Navaratnalu

  • Contact us

Budget 2023 : అన్ని వర్గాలకు వరం | ‘శ్రీ అన్న’ పథకం | ఎవరికి ఎంత లాభమో తెలుసా

February 9, 2023 by bharathi

ఇటువంటి ధాన్యాలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తృణధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు బడ్జెట్‌2023లో పలు పథకాలను ప్రారంభించింది కేంద్రం.

shri-anna-scheme

కొత్త పథకాలతో అన్ని వర్గాల వారిని టచ్ చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2023-24 వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యంగా వ్యవసాయం, రైతుల కోసం అనేక పథకాలను ప్రస్తావించారు. అందులో దేశ వ్యాప్తంగా ప్రజలను ఆకర్శించిన పథకం ‘శ్రీ అన్న’ స్కీం. ఈ పథకంపై అందరి దృష్టి ప్రత్యేకంగా పడింది. దేశంలో ముతక ధాన్యాల( మిల్లెట్స్) ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు శ్రీ అన్న యోజనను ప్రారంభించినట్లు తెలిపారు. మిల్లెట్స్ అంటే చిరు ధాన్యలకు శ్రీ అన్న అనే పదాన్ని ఉపయోగించారు. అంటే, ఈ పథకం కింద, ముతక ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు జరుగుతాయి. ఇందుకోసం ఇండియన్‌ మిల్లెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. శ్రీ అన్న యోజన కింద ముతక ధాన్యాల ఉత్పత్తికి రైతులను ప్రోత్సహిస్తారు.

‘శ్రీ అన్న’ అంటే ఏంటి?

ఇక్కడ ముతక ధాన్యాలు(చిరు ధాన్యలు) అంటే మిల్లెట్‌లను శ్రీ అన్న అని పిలుస్తారు. ఇటువంటి ధాన్యాలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రపంచంలోనే మినుములను ఎగుమతి చేసే దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి సభకు తెలిపారు. జోన్నలు, రాగి, సజ్జలు, కుట్టు, రామదానా, కంగ్నీ, కుట్కి, కోడో, చిన, సామ వంటి అనేక తృణధాన్యాలు భారతదేశంలో ఉత్పత్తి చేయబడతాయి.

  • జొన్నలు (Sorghum)
  • సజ్జలు (Pearl millet)
  • కొఱ్ఱలు (Foxtail millet)
  • వరిగెలు (Proso millet)
  • రాగులు (Finger millet)
  • కులై
  • కుసుములు
  • అరికెలు (Kodo millet)
  • అండు కొర్రలు
  • సామలు (Little millet)
  • ఊదలు (Indian barnyard millet)

ఈ ముతక ధాన్యాలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. భారత్‌ను గ్లోబల్‌ హబ్‌గా శ్రీ అన్నగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ అంతర్జాతీయ స్థాయిలో మినుములకు సంబంధించిన పరిశోధన సాంకేతికతను, దాని మెరుగైన ఉత్పత్తి పద్ధతులను అందిస్తోంది. అందువల్ల, ఈ సంస్థ ఈ రంగంలో భారీ సహకారం అందించింది.

శ్రీ అన్న ఎందుకు ప్రత్యేకం?
ఆహార భద్రతతో పాటు అంతర్జాతీయ సంబంధాలకు మిల్లెట్ పంట చాలా ముఖ్యమైనది. ఇటీవల, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా కరోనా మహమ్మారి, వాతావరణ మార్పు, ఇతర సవాళ్ల మధ్య మిల్లెట్ల ప్రాముఖ్యతను ప్రస్తావించారు. ఆసియా, ఆఫ్రికా మిల్లెట్స్ ప్రధాన ఉత్పత్తి, వినియోగదారు దేశాలలో ఒకటి. భారతదేశంతో పాటు, నైజర్, సూడాన్, నైజీరియా కూడా మిల్లెట్‌ల ప్రధాన ఉత్పత్తిదారులు.

మిల్లెట్ పంటల ప్రత్యేకత ఏంటి?
శ్రీ అన్న పంటలకు తక్కువ నీరు అవసరం. ఉదాహరణకు, చెరకు మొక్కకు 2100 మి.మీ నీరు అవసరం. అదే సమయంలో ఒక మిల్లెట్ పంటకు దాని మొత్తం జీవితకాలంలో 350 మిమీ నీరు మాత్రమే అవసరం. నీటి కొరత కారణంగా ఇతర పంటలు నాశనమవుతాయి. మరోవైపు, ముతక ధాన్యాల పంట పాడైతే.. దానిని జంతువులకు మేతగా ఉపయోగించవచ్చు.

భారతదేశంలో సజ్జలు 41 శాతం ఉత్పత్తి
సజ్జలు ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశం దాదాపు 41 శాతం వాటాను కలిగి ఉంది. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (FAO) ప్రకారం, 2020 సంవత్సరంలో 30.464 మిలియన్ మెట్రిక్ టన్నుల మిల్లెట్ ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశం మాత్రమే 12.49 మిలియన్ మెట్రిక్ టన్నులను కలిగి ఉంది. గతేడాది కూడా మిల్లెట్ ఉత్పత్తిలో భారత్ 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. భారతదేశంలో రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రధాన మిల్లెట్ ఉత్పత్తి చేసే రాష్ట్రాలు. అంచనాల ప్రకారం, 2025 నాటికి, మిల్లెట్ ఉత్పత్తి మార్కెట్ విలువ $ 9 బిలియన్ నుంచి $(డాలర్లు) 12 బిలియన్లకు పెరుగుతుంది.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: News

Post Office Scheme 2023 | Every Month Rs.20,000/- Income Small Saving Schemes | కేంద్రం గుడ్ న్యూస్

February 9, 2023 by bharathi

Small Saving Schemes: కేంద్రం గుడ్ న్యూస్.. ఇక ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ.20,000

Post-Office-Small-Saving-Schemes

Post Office Schemes | కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో అదిరిపోయే శుభవార్త అందించింది. కీలక ప్రకటనలు చేసింది. వీటిల్లో పోస్టాఫీస్ స్కీమ్స్‌కు సంబంధించి కూడా ముఖ్య ప్రతిపాదనలు ఉన్నాయి. దీని వల్ల ఆయా స్కీమ్స్‌లో డబ్బులు దాచుకునే వారికి ప్రయోజనం కలుగనుంది.

కేంద్రం తీసుకున్న బడ్జెట్ 2023 నిర్ణయాల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ పెంపు కూడా ఒకటి ఉంది. దీని వల్ల ఈ స్కీమ్‌లో చేరిన వారికి ఇకపై అధిక మొత్తాన్ని పొందే వెసులుబాటు ఉంటుంది.

ఇదివరకు రూ. 15 లక్షల వరకు డబ్బులు దాచుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఇకపై ఈ లిమిట్ రూ. 30 లక్షలకు చేరుతుంది. అంటే సీనియర్ సిటిజన్స్ ఈ స్కీమ్ కింద రూ. 30 లక్షల వరకు డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అధిక వడ్డీ రాబడి కూడా సొంతం చేసుకోవచ్చు.

ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. ఇది ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. ఇతర వాటి కన్నా ఈ పథకంలోనే అధిక వడ్డీ వస్తోంది. ఈ వడ్డీ రేట్లు అనేవి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. కేంద్రం స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై త్రైమాసికం చొప్పున వడ్డీ రేట్లను సమీక్షిస్తూ వస్తుంది.

ఇకపోతే స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ఈ మెచ్యూరిటీ కాలం దాటిన తర్వాత మరో మూడేళ్ల వరకు స్కీమ్‌ను పొడిగించుకోవచ్చు. ఇప్పుడు మనం 8 శాతం వడ్డీ రేటు ప్రకారం రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. ఎంత నెలవారీ వడ్డీ రాబడి పొందొచ్చొ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

మీరు ఎస్‌సీఎస్ఎస్ స్కీమ్‌లో రూ. 30 లక్షలు డిపాజిట్ చేశారని అనుకుంటే.. మీరు నెలకు రూ. 20 వేలు వడ్డీ రూపంలో లభిస్తాయి. మూడు నెలలకు రూ. 60 వేలు లభిస్తాయి. అదే ఏడాదికి అయితే రూ. 2,40,000 వస్తాయి. ఇక ఐదేళ్లలో మీరు వడ్డీ రూపంలోనే రూ. 12 లక్షలకు పైగా పొందొచ్చు.

రూ. 30 లక్షలు లేదనుకుంటే.. రూ. 5 లక్షలు పెడితే నెలకు రూ. 3333 వడ్డీ రూపంలో పొందొచ్చు. అంటే ఐదేళ్లలో రూ.2 లక్షలు వస్తాయి. ఇక రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. అప్పుడు మీకు వడ్డీ రూపంలో ఐదేళ్లలో రూ. 4 లక్షలు లభిస్తాయి. నెలకు రూ. 6667 పొందొచ్చు.

అదే రూ. 25 లక్షలు పెడితే మీకు ఐదేళ్లలో రూ. 10 లక్షలు వడ్డీ రూపంలోనే వస్తాయి. రూ. 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. ఐదేళ్లలో రూ. 8 లక్షలు వడ్డీ పొందొచ్చ. నెలకు రూ. 13,333 పొందొచ్చు.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Monthly Income

AP Ration Card Holders Good News | Key Announcement | రెండు కిలోలకు ఛాన్స్

February 9, 2023 by bharathi

Ap Ration Shops కు సంబంధించి ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే గోధుమపిండి పంపిణీని కొన్ని మున్సిపాలిటీల్లో ప్రారంభించామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో అన్ని రేషన్ షాపుల్లో పంపిణీకి విస్తరిస్తామని.. అలాగే రాగులు, జొన్నలు కూడా పంపిణీని కూడా మొదలు పెడతామన్నారు. రాష్ట్రంలో ఇకపై ధాన్యం లోడింగ్ నుంచి గోదాములకు వెళ్లే వరకు పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఎండీయూ వాహనాలు ఎక్కడున్నాయో ట్రాక్ చేస్తారు.

AP-Ration-Card-Holders-Good-News

ప్రధానాంశాలు:

  • ఏపీలో రేషన్ షాపులకు సంబంధించి కీలక ప్రకటన
  • త్వరలోనే గోధుమ పిండి పంపిణీ రాష్ట్రమంతా విస్తరణ
  • రాగులు, జొన్నలు కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు

రెండు వారాల్లో చిరుధాన్యాల పంపిణీ మొదలు పెడతామంటున్నారు పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. గోధుమపిండి పంపిణీని రాష్ట్రమంతటా విస్తరిస్తామని.. రేషన్‌ కార్డుదారులు కోరితే నెలకు ఒక్కో కుటుంబానికి 2 కిలోల చొప్పున కందిపప్పు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే ప్రస్తుతం కిలో చొప్పున ఇస్తున్న కందిపప్పునే వారు తీసుకోవడం లేదన్నారు. మంత్రి విజయవాడలో సివిల్‌ సప్లై కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభించారు.

ధాన్యం సరఫరా ఎలా జరుగుతుందో మానిటర్‌ చేయడానికే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు నాగేశ్వరరావు. ధాన్యం తరలిస్తున్న వాహనం దారి మళ్లినా క్షణాల్లో సమాచారం అందుతుందని.. అన్ని సివిల్‌ సప్లై వాహనాలకు జియో ట్యాగింగ్‌తో ట్రాక్ చేస్తామన్నారు. ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ నుంచి ధాన్యం లోడింగ్‌ నుంచి రవాణా, మిల్లుల్లో మర ఆడించి గోదాములకు పంపడం వరకు అన్నీ సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షణ ఉంటుందన్నారు. అలాగే ఎండీయూ వాహనాలు ఎక్కడున్నాయి.. ఇంటింటికి వెళ్తున్నాయో లేదో కూడా తెలిసేలా ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి.

రాష్ట్రంలో రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని.. ఎవరికీ ఆందోళన అవసరం లేదన్నారు నాగేశ్వరరావు. మార్క్‌ఫెడ్‌ దగ్గర అదనంగా సొమ్ము ఉన్నందునే ఆ సంస్థ నుంచి రూ.3,200 కోట్లను అప్పుగా తీసుకున్నామని.. సివిల్‌ సప్లైలో అప్పులు పెరగడానికి చంద్రబాబే కారణమన్నారు. ఖరీఫ్‌లో దళారులు, మిల్లర్లకు సంబంధం లేకుండా రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని బాగా సేకరించారని సీఎం ప్రశంసించారన్నారు.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Rice Card

PM Kisan Samman Nidhi: రైతులకు అలర్ట్.. 2 రోజులే గడువు, డబ్బులు పొందాలంటే ఇలా చేయాల్సిందే!

February 9, 2023 by bharathi

PM Kisan 13th Installment | పీఎం కిసాన్ స్కీమ్ రైతులకు ముఖ్యమైన అలర్ట్. మీరు కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే డబ్బులు రావు. ఇలా మీరు ఇకేవైసీ పూర్తి చేసుకోవడానికి ఇంకో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

PM-Kisan-Samman-Nidhi

పీఎం కిసాన్ స్కీమ్ కింద లబ్ధి పొందుతున్న రైతులు అందరూ కచ్చితంగా ఇకేవైసీ చేసుకోవాలి. దీనికి ఫిబ్రవరి 10 డెడ్‌లైన్‌గా ఉంది. అందువల్ల మీరు ఇంకా ఇకేవైసీ చేసుకోకపోతే వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి.

మీరు నేరుగా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. లేదంటే దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లినా కూడా ఇకేవైసీ పూర్తి చేస్తారు. మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా ఇకేవైసీ చేసుకోవాలని భావిస్తే.. ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి.

రాజస్థాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 10లోపు ఇకేవైసీ చేసుకోవాలని రైతులకు తెలియజేసింది. లేదంటే పీఎం కిసాన్ తర్వాతి విడత డబ్బులు రావని స్పష్టం చేసింది. అందువల్ల మీరు కూడా ఈ గడువు లోగా ఇకేవైసీ పూర్తి చేసుకోవడం ఉత్తమం.

ఎందుకంటే పీఎం కిసాన్ స్కీమ్ అనేది జాతీయ పథకం. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. అందువల్ల అన్ని రాష్ట్రాలకు ఒకటే రూల్స్ వర్తిస్తాయి. అందువల్ల ఇకేవైసీ పూర్తి చేసుకోని వారు ఉంటే మాత్రం ఫిబ్రవరి 10లోగా ఆ పని పూర్తి చేసుకోవడం మంచిది.

కాగా కేంద్ర ప్రభుత్వం వచ్చే విడత డబ్బులను త్వరలోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. హోలీ పండుగ కన్నా ముందుగానే ఈ డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ కావొచ్చని తెలుస్తోంది.

అందువల్ల మీరు ఇంకా ఇకేవైసీ చేసుకోకపోతే మాత్రం వెంటనే త్వరపడండి. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డును లింక్ చేసుకోండి. ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ అయిన వారికే డబ్బులు వస్తాయి.

కాగా ఇప్పటి వరకు చూస్తే కేంద్ర ప్రభుత్వం 12 విడతల డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. అంటే రూ. 24 వేలు అందాయి. ఒక్కో రైతుకు ఈ మేర డబ్బులు లభించాయి. ఇప్పుడు తర్వాతి విడత డబ్బులు వస్తే.. ఒక్కొక్కరికి రూ. 26 వేలు వచ్చినట్లు అవుతుంది.

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తెచ్చింది. దీని కింద అర్హత కలిగిన వారికి ఏడాదికి రూ. 6 వేలు అందిస్తోంది. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున అన్నదాతలకు అందుతున్నాయి.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: PM KISAN

YSR Law Nestham 2023 Online Apply & Status Check | వైఎస్ఆర్ లా నేస్తం | Rs.5000/- Stipend to Jr. Advocates

February 9, 2023 by bharathi

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్తపథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులకు శుభవార్త అందించింది. వృత్తిలోకి కొత్తగా ప్రవేశించే న్యాయవాదులకు వైయస్సార్ లా నేస్తం పేరుతో నెలకు రూ.5వేల చొప్పున స్టైఫండ్ ఇచ్చేందుకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద ప్రాక్టీసులో ఉండే జూనియర్ న్యాయవాదులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలవారీ స్టైపెండ్ అందిస్తుంది. లా నేస్తం పథకం ద్వారా జూనియర్‌ లాయర్లకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్‌ సమయంలో మూడేళ్ల పాటు అందిస్తారు.

YSR-Law-Nestham-2023

స్కాలర్షిప్ పేరు : వైఎస్ఆర్ లా నేస్తం

స్కాలర్షిప్ టైప్ : ఫైనాన్సియల్ అసిస్టెన్స్

ఎవరికి అందిస్తారు : జూనియర్ లాయర్లకు

అర్హుత : 35 ఏళ్ల లోపు వయస్సు & తొలి మూడేళ్ల ప్రాక్టీసులో ఉండాలి

వైఎస్ఆర్ లా నేస్తం పథకానికి దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి. దరఖాస్తుదారుడు పేరు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సెక్షన్‌ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం రోల్స్‌లో నమోదై ఉండాలి.

వైఎస్ఆర్ లా నేస్తం పథకం జూనియర్ లాయర్లకు ప్రాక్టీసు సమయంలో ఆర్థిక తోడ్పాటును అందివ్వనుంది. ఈ పథకం కుటుంబంలో ఒక వ్యక్తికీ మాత్రమే అందిస్తారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సెక్షన్ ఎన్‌రోల్‌మెంట్ ధ్రువపత్రాన్ని పరిగణలోకి తీసుకొని మొదటి మూడేళ్లను లెక్కిస్తారు. జీవో జారీ చేసే నాటికి జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించి మూడేళ్లు నిండనివారు మిగిలిన కాలానికి మాత్రమే స్టైఫండ్ పొందుతారు.

ఏం అవసరం… – దరఖాస్తుదారు తాను ఇంకా ప్రాక్టీస్‌లోనే ఉన్నానని పదిహేనేళ్ల అనుభవం కలిగిన సీనియర్ న్యాయవాది లేదా సంబంధిత బార్ అసోసియేషన్ లేదా సంబంధిత కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ల నుంచి అఫిడవిట్‌ సమర్పించాలి. – న్యాయవాదిగా నమోదైన తర్వాత బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, రెండేళ్ల లోపు సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్‌ను సమర్పించాలి.

వైఎస్ఆర్ లా నేస్తం ఎలిజిబిలిటీ

  1. వైఎస్ఆర్ లా నేస్తం పథకానికి దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
  2. అభ్యర్థులు 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.
  3. దరఖాస్తుదారు పేరు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సెక్షన్‌ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం రోల్స్‌లో నమోదై ఉండాలి.
  4. మూడేళ్ళ ప్రాక్టీస్ పూర్తిచేసినవారు, సొంత నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నవారు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సెక్షనులో రిజిస్టర్ చేసుకొని వారు ఈ పథకానికి అనర్హులు.
  5. దరఖాస్తుదారుడు తాను ఇంకా ప్రాక్టీస్‌లోనే ఉన్నానని పదిహేనేళ్ల అనుభవం కలిగిన సీనియర్ న్యాయవాది లేదా సంబంధిత బార్ అసోసియేషన్ లేదా సంబంధిత కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ల నుంచి అఫిడవిట్‌ సమర్పించాలి.

వైఎస్ఆర్ లా నేస్తం దరఖాస్తు

అర్హుత ఉన్న అభ్యర్థులు లా నేస్తం అధికారిక వెబ్ సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అందివ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలు సామజిక వెరిఫికేషన్ కోసం గ్రామ/వార్డు వాలంటీర్లకు పంపిస్తారు. వెరిఫికేషన్‌లో దరఖాస్తు సరైనదేనని తేలితే, దానిని పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, ఆతర్వాత జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు.

కలెక్టర్ల ఆమోదం పొందిన అనంతరం ఆ దరఖాస్తును మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలు సీఎప్ఎంఎస్ యందు అప్లోడ్ చేస్తారు. సోషల్ ఆడిట్ కోసం ఆ దరఖాస్తును గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ప్రదర్శిస్తారు. ఈ దశలన్నీ పూర్తిచేసుకుని తుది ఆమోదం పొందిన వారి అకౌంట్లలో సొమ్మును జమ చేస్తారు. గ్రామ లేదా వార్డు వాలంటీర్లు స్టైఫండ్ చెల్లింపు రసీదును లబ్ధిదారు ఇంటివద్ద అందిస్తారు.

Online Apply at : https:// ysrlawnestham.e-pragati.in/#/

వీరు అనర్హులు :

  • నాన్ ప్రాక్టీస్ లాయర్లు
  • మూడేళ్ల ప్రాక్టీస్ పూర్తి చేసినవారు 
  • ఫోర్ వీలర్ కలిగిన వారు 
  • 35 ఏళ్లు నిండకూడదు 

న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకొని, న్యాయవాదిగా, ప్రాక్టీస్ చేయకుండా ఇతర ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వారు కూడా అనర్హులు.

YSR LAW NESTHAM Status Check

Law-Nestham-Status-Check

Click on above image for checking status online

Downloads

Faq_JuniorAdvocate

LawNesthamGO2

UM_ApplicantPH2

UM_Collector


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: YSR Law Nestham

  • « Previous Page
  • 1
  • …
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • …
  • 55
  • Next Page »

Recent Posts

  • Sachivalayam Aadhar Camps in August 2023 | ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు
  • ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు 2022 జులై DA ప్రకటన | ఏ బేసిక్‌ వారికి ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి
  • ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhan Mantri Mudra Yojana) – PMMY | Updates
  • తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు | Central Government Schemes in Telangana Villages
  • Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం
  • YSR NethaAnna Nestham (BENEFICIARY OUT REACH APP) Full Detailed Process
  • YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల తేదీ ఖరారు
  • పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం 2023 | PM Vishwakarma Kaushal Samman Scheme 2023
  • Ammavodi Payment Status Checking -2023 | అమ్మఒడి చెల్లింపు స్థితి తనిఖీ -2023
  • బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Central Government Has Brought the Pradhan Mantri Tractor Yojana Scheme
  • PM Tractor Yojana 2023: కేంద్రం గొప్ప పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. అర్హులెవరు.. దరఖాస్తు ఎలా.. మొత్తం డీటెయిల్స్ ఇవే..
  • వాలంటీర్ల హాజరు రిపోర్ట్ | Volunteers Attendnace Report
  • AP: CM సంచలన నిర్ణయం: పెన్షన్@ రూ. 4,000.!? Volunteers Salary Increased to Rs.10,000/- ?
  • వైయస్సార్ పెళ్లి | YSR Pelli Kaanuka Important Update
  • విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు | Rice Card for Divorced Single Persons
  • YSR Pension Kanuka Hike
  • ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • YSR CHEYUTHA scheme 2023-24
  • Ammavodi-2023 – eKYC | అమ్మఒడి-2023 – ఇకెవైసి
  • ఖరీఫ్ సీజన్ : పంట నమోదు ఫారం | Kharif Season : Crop Registration Form
  • వైఎస్సార్ వాహన మిత్ర 2023-24 సంవత్సరానికి సంబంధించి GO విడుదల | YSR Vahana Mitra GO release for the year 2023-24
  • వాలంటీర్ల గౌరవ భృతి సమాచారం | Honorarium information for volunteers
  • వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ | Documents required for fresh registration of YSR signature
  • వైఎస్సార్ కళ్యాణమస్తు 3వ విడత అప్డేట్ | YSR Kalyanamastu 3rd installment update
  • YSR Pension Kanuka Details (వైఎస్ఆర్ పెన్షన్ కానుక వివరాలు)
  • Jagananna Suraksha (జగనన్న సురక్ష)
  • AP Mission Vatsalya | ఆంధ్రప్రదేశ్-మిషన్ వాత్సల్య | అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు
  • Mission Vatsalya Scheme Date Extended | మిషన్ వాత్సల్య పథకం గడువు పొడిగింపు
  • Jagananna Vasathi Deevena 2023 Date Fixed | Starts in Ananthapur | జగనన్న వసతి దీవెన 2023 అనంతపురంలో ప్రారంభమవుతుంది
  • YSR PENSION KANUKA & AASARA Key Contacts | HelpLine Numbers District
  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2026 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in