Navaratnalu

  • Contact us

PAN Aadhaar Linking Status Check :మీ ఆధార్‌‌తో పాన్‌ లింక్ అయిందో లేదో మెసేజ్ ద్వారా ఈ విధంగా తెలుసుకోండి!

February 10, 2023 by bharathi

ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌తో పాన్ కార్డ్‌లను లింక్ చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పటినుంచో పేర్కొంటుంది. అయితే చాలా కాలంగా ఆధార్-పాన్ లింకింగ్ తేదీని పెంచుతున్న ప్రభుత్వం ఇటీవల చివరి తేదీని ప్రకటించింది. 1961లోని సెక్షన్ 139AA ప్రకారం మార్చిన 31 నాటికి ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయకపోతే పాన్‌కార్డు ఏప్రిల్ 1, 2023 నుండి పనిచేయదని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇప్పటికే చాలా మంది తమ ఆధార్‌ను పాన్‌తో లింక్ చేసుకున్నారు. ఇంకా కొంత మందికి తమ ఆధార్-పాన్ లింక్ చేయబడిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసం సులభంగా మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు.

PAN-Aadhaar-Linking-Check

SMS ద్వారా ఆధార్ పాన్‌తో లింక్ అయిందో లేదో తెలుసుకోడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి UIDPAN అని టైప్ చేసి 567678 లేదా 56161కి సెండ్ చేయాలి. తరువాత డేటాబేస్‌లో చెకింగ్ పూర్తయిన తరువాత ఆధార్-పాన్ లింకింగ్ గురించిన స్టేటస్ మెసేజ్ ద్వారా వస్తుంది. వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవాలనుకునే వారు

PAN-Aadhaar-Linking-URL

లో పాన్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.

PAN-Aadhaar-Linking-Check-Status

Here you can enter your 10 Digits PAN Card Number and Date of Birth

Fill the Captcha and click on Submit button

Finally you will the “Alert »Aadhaar is already linked to PAN“

Note : If not Linked then link it immediatley. Thank you


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Aadhaar Card

PM KISAN Rejected List 2023 | PM కిసాన్ స్టేటస్ | తిరస్కరించబడిన జాబితా | లబ్ధిదారుల జాబితా లిస్ట్

February 10, 2023 by bharathi

పార్ధన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSNY) యొక్క 12వ విడతను 17 అక్టోబర్ 2022న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేశారు. దరఖాస్తుదారులందరూ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSNY) అధికారిక వెబ్ పోర్టల్‌లో తమ దరఖాస్తుల స్థితిని తనిఖీ చేయవచ్చు. పీఎం కిసాన్ కి సంబంధించిన మొత్తం వివరాలను ఈ వెబ్ పేజీలో డీటెయిల్ గా ఇవ్వబడ్డాయి పూర్తిగా చదివి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి.

How to Download PMKSNY Application Status Check, PMKSNY Rejected List 2023 and PMKSNY Beneficiary List Online, etc information find below.

PM కిసాన్ స్థితి 2023 : 13వ వాయిదా చెల్లింపు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయబడుతుంది. దరఖాస్తుదారులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSNY) అధికారిక వెబ్ పోర్టల్ pmkisan.gov.in లో వారి చెల్లింపు వివరాలు మరియు స్థితిని తనిఖీ చేయవచ్చు.

PM-Kisan-2000-Status

PM కిసాన్ లబ్ధిదారుల జాబితా 2023

19 అక్టోబర్ 2022 వరకు దాదాపు 10.5 కోట్ల మంది లబ్ధిదారులు నమోదు చేయబడ్డారు. దరఖాస్తుదారులు  13వ విడత డబ్బును వారి బ్యాంక్ ఖాతాల్లోకి పొందడానికి వారి E-KYCని తప్పనిసరిగా చేసి ఉండాలి. E-KYC పూర్తి చేయని వారికి ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSNY) కింద ఎలాంటి డబ్బు లేదా ప్రయోజనాలు లభించవు.

PM Kisan Status Check 2023

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSNY) 13వ విడత స్థితిని ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలో క్రింద ఇవ్వబడిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వండి,

  • దరఖాస్తుదారులు ముందుగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSNY) అధికారిక వెబ్ పోర్టల్ pmkisan.gov.inకి వెళ్లాలి.
  • ఆ తర్వాత, హోమ్‌పేజ్‌లో, అభ్యర్థి కార్నర్‌కు వెళ్లండి.
  • కుడి వైపున ఉన్న లబ్ధిదారుల జాబితా ఎంపికపై నొక్కండి.
  • అప్పుడు, మీరు మరొక పేజీ విండోకు మళ్లించబడతారు.
  • కొత్త విండోలో, మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్ మరియు గ్రామం పేరు వంటి అవసరమైన వివరాలను ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా టైప్ చేయండి.
  • తర్వాత, గెట్ రిపోర్ట్ ఆప్షన్‌పై నొక్కండి మరియు మీరు మరింత ముందుకు సాగుతారు.
  • చివరగా, పార్ధన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 13వ విడత కోసం మీ దరఖాస్తు స్థితి మీ కంప్యూటర్/మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై తెరవబడుతుంది.
  • స్క్రీన్‌పై పేర్కొన్న అన్ని వివరాలను మరియు సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి.
  • మీరు మీ PMKSNY 13వ విడత స్థితి 2023ని ఈ విధంగా తనిఖీ చేయవచ్చు.

PM కిసాన్ తిరస్కరించబడిన జాబితా 2023

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSNY) అనేది అవసరమైన రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ యోజన. ఈ పథకం కింద లబ్దిదారులు సంవత్సరానికి 2000 రూపాయల చొప్పున మూడు వాయిదాలలో మొత్తం 6000 రూపాయలు పొందుతారు. ఇటీవల, భారత ప్రభుత్వం లబ్ధిదారుల కోసం 12వ విడత విడుదల చేసింది.

అయినప్పటికీ, చాలా మంది రైతులు దాని ప్రయోజనాలను పొందడానికి పార్ధన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSNY) కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు, కొన్ని అర్హతలు లేదా అర్హత సమస్యల కారణంగా, కొన్ని దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో దరఖాస్తుదారు చేసిన తప్పులు, తప్పుడు IFSC కోడ్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌తో లింక్ చేయని ఆధార్ కార్డ్ వంటివి మీ దరఖాస్తు తిరస్కరించబడటానికి ఒక కారణం కావచ్చు.

Important links

e-KYC కొరకు క్లిక్ చేయండి

New Farmer Registration

Status of Self Registered Farmer/ CSC Farmers

Updation of Self Registered Farmers

Beneficiary Status

Beneficiary List

Edit Aadhaar Failure Records

Online Refund

Helpdesk – Query Form

Download PM Kisan Mobile App

FAQ

Download KCC Form

దయచేసి మళ్లీ navaratnalu.com ని చెక్ చేయండి మరియు ఏవైనా ప్రభుత్వ పథకాలు మరియు యోజనలకు సంబంధించిన తాజా కంటెంట్‌ను పొందండి.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: PM KISAN

Telangana We-Hub : Wings to Women’s Dreams | వీ-హబ్ దేశంలోనే తొలి కార్యక్రమం

February 9, 2023 by bharathi

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమమే వీ-హబ్. వీ-హబ్ అంటే ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్ అన్నమాట. 2018 మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించారు.

Telangana-We-Hub

ప్రధానాంశాలు:

  • మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం
  • గ్లోబల్ మార్కెట్‌పై ఎదిగేలా సాయం
  • సమసమాజాన్ని స్థాపిస్తోన్న వీ-హబ్
  • వీ-హబ్ తొలి ఫ్లాగ్‌షిప్ రూరల్ ఇంక్యుబేషన్ ప్రొగ్రామ్‌ లాంచ్

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమమే వీ-హబ్. వీ-హబ్ అంటే ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్ అన్నమాట. 2018 మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించారు. వీ-హబ్ కింద మహిళా వ్యాపారవేత్తలు స్థాపించే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు దేశంలోనే తీసుకొచ్చిన ప్రప్రథమ కార్యక్రమం ఇది. వీ-హబ్ సాంకేతికలో అభివృద్ధి చెందుతోన్న రంగాలపై ఫోకస్ చేసే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలతో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీ-హబ్ ప్రధాన లక్ష్యం మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా ఉన్న అడ్డంకులను తొలగించి, వ్యాపారంలో విజయం సాధించడంలో సాయపడటం. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు నిర్వహించే స్టార్టప్‌లకు ఇది వన్ స్టాప్ డెస్టినేషన్‌గా ఉంటోంది. తెలంగాణలో, భారత్‌లోనే కాక గ్లోబల్ మార్కెట్‌పై మహిళా వ్యాపారవేత్తలు ఎదిగేలా వీ-హబ్ సహకరిస్తుంది.

వీ-హబ్ పూర్తి వివరాలు..

ఆవిష్కరణ తేదీ : 2018 మార్చి 8

ప్రధాన లక్ష్యం : మహిళా వ్యాపారవేత్తలకు ఆర్థికంగా, సామాజికంగా ఉన్న అడ్డంకులను తొలగించడం, ప్రోత్సహించడం

అధికారిక వెబ్‌సైట్ : https://wehub. telangana.gov.in/

మహిళా వ్యాపారవేత్తలను ఎలా ప్రమోట్ చేస్తారు?

  • మహిళలు వ్యాపారవేత్తలుగా మారేందుకు ప్రభుత్వ సంస్థలు, ఇండస్ట్రీలు, విద్యాసంస్థలు, కార్పొరేట్లతో కోలాబరేట్ అయి పనిచేసే అవకాశం కల్పించడం
  • నిధులు అందించడం, మెంటరింగ్ సపోర్టు అందివ్వడం ద్వారా మహిళా వ్యాపారవేత్తల స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోంది. అంతేకాక మహిళా వ్యాపారావేత్తలలో సాధికారత తీసుకువస్తోంది
  • విధాన కార్యాచరణ, పరిశోధన ద్వారా ప్రభుత్వ పథకాల యాక్సెస్‌ను వారికి కల్పించడం
  • స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేయడంతో పాటు వాటి గ్రోత్‌కు అవసరమైన నిధులు సమకూర్చేందుకు కూడా ప్రభుత్వం టీ-ఫండ్ పేరుతో వెంచర్ క్యాపిటల్ నిధిని కల్పించింది. ఈ నిధి ద్వారా వీ-హబ్ ఇప్పటికే పలు స్టార్టప్‌లకు పెట్టుబడి సాయం చేసింది.
  • మహిళల నేతృత్వంలోని అన్ని రకాల స్టార్టప్‌లకు ఇది సహాయ సహకారాలను అందిస్తోంది. వీ-హబ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు website http://wehub. telangana.gov.in/ వెళ్లాల్సి ఉంటుంది.

వీ-హబ్ కేవలం మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడమే కాకుండా.. పురుషులకు, మహిళలకు మధ్య సమాన ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తోంది. లాక్ డౌన్ కాలంలో రూ.35 కోట్ల విలువైన క్రెడిట్ లింకేజీలను నిర్వహించింది. అంతేకాక వీహబ్ ప్రారంభమైనప్పటి నుంచి మహిళా వ్యాపారవేత్తలకు పెద్ద మొత్తంలో మార్కెట్ యాక్సస్‌, పెట్టుబడులు లభించాయి.

గ్రామాల్లో మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు వీ-హబ్ తన తొలి ఫ్లాగ్‌షిప్ రూరల్ ఇంక్యుబేషన్ ప్రొగ్రామ్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా తయారీ, టెక్స్‌టైల్స్, హ్యాండ్‌లూమ్స్, ఎఫ్‌ఎంసీజీ, ఫుడ్ ప్రాసెసింగ్, హ్యాండిక్రాఫ్ట్స్ వంటి ఐదు ముఖ్యమైన రంగాలలో 50 మహిళా ఎంట్రప్రెన్యూర్లకు ఇంక్యుబేట్ చేస్తోంది. దీని కోసం అప్లికేషన్ ప్రాసెస్‌ను కూడా ప్రారంభించింది. టైర్ 2, 3 రీజన్లలో సంస్థలను మరింత ప్రోత్సహించేందుకు రూరల్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ పనిచేస్తుందని వీహబ్ సీఈవో దీప్తి రావుల చెప్పారు. ఇలా స్టార్టప్‌ కంపెనీలకు వీ-హబ్ పలు ఇంక్యుబేషన్ ప్రొగ్రామ్‌లను చేపడుతోంది. వీ-హబ్ ఇప్పటి వరకు మహిళలు నిర్వహించే 4527 స్టార్టప్‌లకు సపోర్టు ఇచ్చింది.


Who is eligible to apply to WE HUB?
Any women led startups is eligible. Any startup which has a women holding 51% stake holding pattern in a company is considered as women-led startup.

How are the applicants selected for the program at WE HUB
Applicants will be invited for a pitch day, where the jury consists of representatives from partner organizations to evaluate pitches. Selected applicants will be notified via email with further steps.

Do we need to have the entire idea fully working?
The entire idea need not be fully implemented however, the submission should be functional so that it can be reviewed by the judges.

How can I apply to WE HUB’s incubation program?
Please follow this link for the application form if you are eligible to apply. Upon review of your application, you will be hearing from us on further steps.

How does WE HUB help with funding?
WE HUB actively helps startups with credit linkages and helps identify schemes/subsidies that startups can operationalize.

Will mentors be provided to each team?
Yes, mentors will be provided for every team.

We-Hub Innovation Impact

Created Jobs : 2,823

Startups Supported : 1,495

Startups Incubated : 2,194

Partner Connets : 53

Startup Programs : 21

Funding Raised (in crores) : 66.3

Entrepreneurs Engaged so far : 5,235

Service Providers : 50


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Telangana

YSR Jalayagnam Scheme 2023 Full Details | వైఎస్సార్ జలయజ్ఞం పథకం | పూర్తి వివరాలు

February 9, 2023 by bharathi

రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అందిస్తోంది. వీటిల్లో జలయజ్ఞం కూడా ఒకటి. వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. రైతులకు దీని వల్ల చాలా ప్రయోజనం కలిగిందని చెప్పుకోవచ్చు.

YSR-Jalayagnam-Scheme

ప్రధానాంశాలు:

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పలు రకాల పథకాలు
  • వీటిల్లో రైతుల కోసం కూడా కొన్ని స్కీమ్స్ అందుబాటులో
  • ఈ పథకాల్లో వైఎస్సార్ జలయజ్ఞం కూడా ఒకటి

ఇప్పుడు ఈ స్కీమ్ గురించి వివరాలు తెలుసుకుందాం

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. అన్నదాతల కోసం ఏపీ సర్కార్ పలు స్కీమ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటిల్లో వైఎస్సార్ జలయజ్ఞం కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ కింద రైతులకు ప్రయోజనం కలుగుతోంది. వ్యవసాయ రంగంలో అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు ఈ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం.

వైఎస్సార్ జలయజ్ఞం పథకం పూర్తి వివరాలు

పథకం పేరు వైఎస్సార్ జలయజ్ఞం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
ఆవిష్కరణ వైఎస్సార్
లబ్ధిదారులు అన్నదాతలు
లక్ష్యం వ్యవసాయ రంగ వృద్ధి

జలయజ్ఞం పథకం
కరువు కాటకాలు వల్ల రైతులు చితికిపోకూడదనే లక్ష్యంతో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ స్కీమ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చారు. అలాగే రైతులకు సాగునీరు కొరత ఉండకూడదని ఈ పథకాన్ని ఆవిష్కరించారు. జలయజ్ఞం పథకం ద్వారా వ్యవసాయ రంగంలో అభివృద్ధి నమోదు చేయాలని వైఎస్సార్ ఆకాంక్షించారు. అందుకే చాలా ప్రాజెక్టులను నిర్మించేందుకు రెడీ సన్నద్ధం అయ్యారు. వీటిల్లో వైఎస్సార్ మరణానికి కొన్ని ప్రాజెక్టులు రెడీ అయితే.. మరికొన్ని పెండింగ్‌లోనే ఉండిపోయాయి.

నవ్యాంధ్రలో జలయజ్ఞం
జలయజ్ఞం పథకాన్ని వైఎస్సార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా బాగా అమలు చేశారు. అయితే ఆయన మరణం తర్వాత ప్రాజెక్టులు అలాగే ఉండిపోయాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి తలపెట్టిన జలయజ్ఞం పథకాన్ని తన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందుకే ఈ పథకాన్ని నవరత్నాల్లో భాగంగా చేశారు.

వడివడిగా అడుగులు
రాజన్న కల సహకారం చేయడమే ధ్యేయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో చిత్తశుద్ధితో యుద్ధప్రాతిపదికన జలయజ్ఞం పూర్తిచేయాలని నిర్ణయించారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూనే రైతులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ సాగు, తాగు నీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు సాగిపోతున్నారు.

జలయజ్ఞం లక్ష్యాలు ఇవే

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు అందించడమే లక్ష్యం.

* పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడం.

* గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

* పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యతల ఆధారంగా పూర్తి చేయడం.

* సాగు నీటితో రైతులకు కరువు తీర్చాలని లక్ష్యం.

* ప్రాజెక్టుల లక్షలాది రైతులు వెలకట్టలేని లబ్ధి చేకూర్చడం.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: YSR Jalayagnam

ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు జరగబోయే ఆధార్ డ్రైవ్ సమాచారం | Aadhaar drive

February 9, 2023 by bharathi

ఫిబ్రవరి నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆధార్ స్పెషల్ క్యాంపు లు జరుగును. ఈ ఆధార్ క్యాంపు లు ముఖ్యంగా జూనియర్ కాలేజీ లో చెయ్యటం జరుగును.

కాలేజీ విద్యార్థులకు ముఖ్యంగా Mandatory Biometric Update (MBU) చేయటం జరుగును. ఈ సర్వీస్ ఎవరు అయితే ఆధార్ పొంది, 5 మరియు 15 సంవత్సరాల వయసు దాటి ఉంటారో, ఒక సారి కూడా బయోమెట్రిక్ అప్డేట్ చెయ్యకుండా ఉంటారో వారు వినియోగించుకోగలరు. ఈ సర్వీస్ కు ఎటువంటి ఫీజు అవసరం లేదు. ఆధార్ కార్డు ఒరిజినల్ / జిరాక్స్ ఉంటే సరిపోతుంది.

AADHAAR-SEVA-KENDRA-PRICES

MBU సర్వీస్ ద్వారా అప్డేట్ చేసుకోని ఆధార్ మార్చ్ నెల తరువాత De-Activate అయ్యే అవకాశం ఉంది . కావున అందరు ఈ సెర్వుస్ ను ఉపయిగించుకోవలెను.

ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలలో ఆధార్ డ్రైవ్ లకు సంబంధించిన ఉత్తర్వులు

సచివాలయం లో అందించే ఆధార్ సేవలు :

ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ : Rs.50/-

ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్ : Rs.50/-

బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్ : Rs.100/-

పేరు మార్పు ( Proof తప్పనిసరి ) : Rs.50/-

DOB మార్పు ( Proof తప్పనిసరి ) : Rs.50/-

జెండర్ మార్పు : Rs.50/-

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( POI & POA ఒరిజినల్ తప్పనిసరి) : Rs.50/-

చిరునామా మార్పు ( Proof తప్పనిసరి ) : Rs.50/-

కొత్తగా ఆధార్ నమోదు : Free

Mandatory Biometric Update : Free

3+ Anyone Service : Rs.100/-

Click here to Download February Month Aadhar Drive Circular


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Aadhaar Card

  • « Previous Page
  • 1
  • …
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • …
  • 55
  • Next Page »

Recent Posts

  • Sachivalayam Aadhar Camps in August 2023 | ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు
  • ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు 2022 జులై DA ప్రకటన | ఏ బేసిక్‌ వారికి ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి
  • ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhan Mantri Mudra Yojana) – PMMY | Updates
  • తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు | Central Government Schemes in Telangana Villages
  • Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం
  • YSR NethaAnna Nestham (BENEFICIARY OUT REACH APP) Full Detailed Process
  • YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల తేదీ ఖరారు
  • పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం 2023 | PM Vishwakarma Kaushal Samman Scheme 2023
  • Ammavodi Payment Status Checking -2023 | అమ్మఒడి చెల్లింపు స్థితి తనిఖీ -2023
  • బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Central Government Has Brought the Pradhan Mantri Tractor Yojana Scheme
  • PM Tractor Yojana 2023: కేంద్రం గొప్ప పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. అర్హులెవరు.. దరఖాస్తు ఎలా.. మొత్తం డీటెయిల్స్ ఇవే..
  • వాలంటీర్ల హాజరు రిపోర్ట్ | Volunteers Attendnace Report
  • AP: CM సంచలన నిర్ణయం: పెన్షన్@ రూ. 4,000.!? Volunteers Salary Increased to Rs.10,000/- ?
  • వైయస్సార్ పెళ్లి | YSR Pelli Kaanuka Important Update
  • విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు | Rice Card for Divorced Single Persons
  • YSR Pension Kanuka Hike
  • ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • YSR CHEYUTHA scheme 2023-24
  • Ammavodi-2023 – eKYC | అమ్మఒడి-2023 – ఇకెవైసి
  • ఖరీఫ్ సీజన్ : పంట నమోదు ఫారం | Kharif Season : Crop Registration Form
  • వైఎస్సార్ వాహన మిత్ర 2023-24 సంవత్సరానికి సంబంధించి GO విడుదల | YSR Vahana Mitra GO release for the year 2023-24
  • వాలంటీర్ల గౌరవ భృతి సమాచారం | Honorarium information for volunteers
  • వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ | Documents required for fresh registration of YSR signature
  • వైఎస్సార్ కళ్యాణమస్తు 3వ విడత అప్డేట్ | YSR Kalyanamastu 3rd installment update
  • YSR Pension Kanuka Details (వైఎస్ఆర్ పెన్షన్ కానుక వివరాలు)
  • Jagananna Suraksha (జగనన్న సురక్ష)
  • AP Mission Vatsalya | ఆంధ్రప్రదేశ్-మిషన్ వాత్సల్య | అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు
  • Mission Vatsalya Scheme Date Extended | మిషన్ వాత్సల్య పథకం గడువు పొడిగింపు
  • Jagananna Vasathi Deevena 2023 Date Fixed | Starts in Ananthapur | జగనన్న వసతి దీవెన 2023 అనంతపురంలో ప్రారంభమవుతుంది
  • YSR PENSION KANUKA & AASARA Key Contacts | HelpLine Numbers District
  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2026 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in