Navaratnalu

  • Contact us

Ap Cabinet Meeting: ఏపీ కేబినేట్ భేటీలో కీలక నిర్ణయాలు

February 10, 2023 by bharathi

సీఎం జగన్ (Ap Cm Jagan)అధ్యక్షతన నేడు జరిగిన ఏపీ కేబినేట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Ap-Cabinet-Meeting

సీఎం జగన్ (Ap Cm Jagan)అధ్యక్షతన నేడు జరిగిన ఏపీ కేబినేట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో మొదటి విడతలో 55 వేల కోట్లు, రెండో విడతలో 55 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇక న్యూ ఎనర్జీ పార్క్ తో పాటు కర్నూల్, అనంతపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాలో విండ్ అండ్ సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా కేబినేట్ ఆమోదం తెలిపింది. 1000 మెగావాట్ల విండ్, 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులను ఎనర్జి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. 4 విడతల్లో మొత్తం రూ.10,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. దీనితో 2 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

ఇక కొత్త పాలసీలో భాగంగా పుంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు కూడా కేబినేట్ పచ్చజెండా ఊపింది. అలాగే బందర్ పోర్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.3940 కోట్ల ఋణం తీసుకొనేందుకు అనుమతి పొందింది. 9.75 శాతం వడ్డీతో ఈ ఋణం తీసుకోనున్నారు. వైజాగ్ టెక్ పార్క్ కు 60 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజిగా మార్చేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలకు కేబినేట్ అంగీకరించింది. వైద్యారోగ్యశాఖలో రిక్రూట్ మెంట్ల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుకై కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

పదవి విరమణ వయస్సు పెంపు..

యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పదవి విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచారు. JSW ఇన్ఫ్రా స్ట్రక్శ్చర్ లిమిటెడ్ సంస్థకు రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తులను కేటాయించాలని నిర్ణయించారు. నామినేషన్ పద్దతిలో ఈ బెర్తులను కేటాయించారు. జేఎస్.డబ్ల్యూ సంస్థకు 250 ఎకరాల భూమిని మారిటైమ్ బోర్డు ద్వారా కేటాయించాలని కేబినేట్ లో నిర్ణయం తీసుకున్నారు.

ఇక టీటీడీకి ప్రత్యేక వింగ్ ఏర్పాటుకై కేబినేట్ ఆమోదం తెలిపింది. తాడేపల్లిగూడెంలో పోలీసు సబ్ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొన్ని జిల్లా కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాల వారీగా విభజించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఏలూరు , ఒంగోలు, విజయనగరం , మచిలీపట్నం, నంద్యాల, అనంత, చిత్తూరు జిల్లాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించనున్నారు.

Filed Under: News

Telangana: కొత్తవారికి ఆసరా పెన్షన్లపై కీలక అప్‌డేట్‌ | అసెంబ్లీలో మంత్రి ఎర్రబెల్లి ఏమన్నారంటే ?

February 10, 2023 by bharathi

తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన వారందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం (ఫిబ్రవరి 10) తెలిపారు..

Telangana-Important-update-on-support-pensions-for-freshers

తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన వారందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం (ఫిబ్రవరి 10) తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆసరా పెన్షన్లపై అడిగిన ప్రశ్నకు మంత్రి ఎర్రబెల్లి సమాధానం ఇస్తూ.. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా.. 2014 నుంచి తెలంగాణ రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్ఐవి వ్యాధి గ్రస్తులు, బీడి కార్మికులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా వ్యాధి గ్రస్తులకు సీఎం కేసీఆర్ పెన్షన్లు ఇస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 29 లక్షలు మందికి పెన్షన్లు ఇవ్వగా ఇప్పుడు 44 లక్షల 12 వేల 882 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అప్పుడు పెన్షన్ రూ.200 ఇప్పుడు రూ.2 వేలు ఇస్తున్నాం. అప్పట్లో ఏటా పెన్షన్ల కోసం 861 కోట్లు ఇవ్వగా…ఇప్పుడు 12 వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించాం. ఈ ఆర్ధిక సంవత్సరంలో 9,08,498 మందికి కొత్తగా పెన్షన్లు ఇస్తున్నామన్నారు.

ఇంకా మంత్రి ఈ విధంగా మాట్లాడారు.. ‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వెయ్యి మంది ఉన్న గ్రామంలో 60,70 మందికి పెన్షన్లు ఇస్తుంటే తెలంగాణలో మాత్రం 600,700 మందికి ఇస్తున్నాం. తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.3,000 పెన్షన్‌ ఇస్తాం అంటారు..వాళ్లు పాలించే రాష్ట్రాల్లో మాత్రం రూ. మూడు వేలు కూడా ఇవ్వడం లేదు. బీజేపీ పాలించే యూపీలో వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మణిపూర్ రాష్ట్రంలో కేవలం రూ.200 నుంచి రూ.500, అస్సాంలో రూ.250 నుంచి రూ.550, నాగాలాండ్‌లో రూ.200, మిజోరాంలో రూ.300 మాత్రమే ఇస్తున్నారు.ఉత్తర ప్రదేశ్‌లో పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే. మోడీ, అమిత్ షా సొంత రాష్ట్రాలైన గుజరాత్‌లో కూడా వెయ్యి నుంచి రూ.1250 వరకు మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. సాంకేతిక సమస్యల వల్ల పెన్షన్లకు ఇబ్బంది వస్తున్న చోట ఆ సమస్యను పరిష్కారిస్తామన్నారు. ఆర్థిక పరిస్థితిని బట్టే పెన్షన్లు ఇస్తున్నామని, పెన్షన్ పొందే భార్యాభర్తలలో ఎవరైనా ఒకరు చనిపోతే మిగిలిన వారికి పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి పలువురు హర్షం వ్యక్తం చేశారు.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Pension

CM Jagan: గ్రామ సచివాలయ స్థాయిలోనే మ్యారేజ్‌ సర్టిఫికేట్స్‌ | వైయస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు

February 10, 2023 by bharathi

వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జమ చేశారు. 2022 అక్టోబరు- డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి 4,536 మంది లబ్ధిదారులకు..

kalyanamastu-and-shaadi-tofa

వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జమ చేశారు. 2022 అక్టోబరు- డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్లను బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భరంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అక్టోబరు- డిసెంబర్‌ మధ్య పెళ్లిళ్లు చేసుకున్నవారికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెలపాటు సమయం ఇచ్చామని, ఫిబ్రవరిలో వెరిఫికేషన్‌ పూర్తిచేసి, ఇవాళ నేరుగా వారికి నగదు జమచేస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరంలో ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఇదే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని, జనవరి- ఫిబ్రవరి- మార్చి నెలలకు సంబంధించి దరఖాస్తులో ఏప్రిల్‌లో స్వీకరిస్తామని, మే నెలలో వారికి అందజేస్తామన్నారు. ఈ పథకం సమూలంగా ఒక మార్పును తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని, పేదవాడి తలరాత మారాలంటే.. చదువు అనే అస్త్రాన్ని ఇవ్వగలిగితేనే తలరాతలు మారుతాయన్నారు సీఎం జగన్‌. పిల్లలను చదివించడానికి పెట్టే ప్రతి రూపాయికూడా ఖర్చుగా భావించడం లేదని, పిల్లలకు ఇచ్చే ఆస్తిగానే భావిస్తున్నామన్నారు. వయసు మాత్రమే కాదు, చదువు కూడా ఒక అర్హతగా ఈపథకానికి నిర్దేశించామని వ్యాఖ్యానించారు.

ఇక పెళ్లైనవారే కాకుండా వారి తర్వాత తరాలు కూడా చదువుల బాట పట్టాలనే ఇది చేస్తున్నామని, పిల్లల చదువులను ప్రోత్సహించడం, బాల్యవిహాహాలను నివారించడం, స్కూళ్లలో డ్రాప్‌ అవుట్స్‌ను తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకం పెట్టామన్నారు. కనీస వయస్సు.. నా చెల్లెమ్మలకు 18 ఏళ్లు, నా తమ్ములకు 21 ఏళ్లు నిర్దేశించాం.. టెన్త్‌ సర్టిఫికెట్‌ కచ్చితంగా ఉండాలని చెబుతున్నామన్నారు.

ఈ ప్రోత్సాహకం కోసం కనీసంగా టెన్త్‌ వరకూ తీసుకున్నామని, తర్వాత అమ్మ ఒడి ఉండటంతో సహజంగానే ఇంటర్మీడియట్‌ చదువుకుంటారు.. ఆ తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు ఉన్నాయి.. అందుకే ఇంటర్మీడియట్‌ నుంచి వారి చదువులు ఆగిపోకుండా ముందుకు కొనసాగుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల్లోని ఆడపిల్లలందరికీ కూడా మంచి జరుగుతుందని, వచ్చే త్రైమాసికం నుంచి కళ్యాణమస్తు, షాదీ తోఫా డబ్బులు పెళ్లికూతురు తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నామని పేర్కొన్నారు. పలువురి సూచనలమేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, పెళ్లిళ్లుకోసం కొంతకాలం ఆగొచ్చు.. కానీ చదువులు ఆగిపోకూడదనేది మా ఉద్దేశమన్నారు.

అమ్మాయిలు చదువుల బాట పడితేనే సమాజం బాగుపడుతుందని, పదేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్న ఆలోచనతో మనం అడుగులు ముందుకేస్తున్నామన్నారు. ప్రపంచంలో పోటీ విపరీతంగా ఉంది. మన పిల్లలకు ఎక్కడకు వెళ్లినా.. గెలిచే పరిస్థితి ఉండాలి. అందుకే విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో మెరుగుపరచడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నాం.. అమ్మ ఒడి, సంపూర్ణ పౌష్టికాహారం, విద్యాకానుక, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్‌, నాడు-నేడుతోపాటు, నాడునేడులో చివరి కార్యక్రమం ఆరోతరగతి పైన అన్ని క్లాసుల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌, 8వ తరగతిలోకి రాగానే వారందరికీ ట్యాబ్స్‌, బైజూస్‌ కంటెంట్‌, సీబీఎస్‌ఈ సిలబస్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కోసం విద్యాదీవెన, వసతి దీవెన, ఉద్యోగాలు కల్పించేలా పాఠ్యప్రణాళిక, విదేశాల్లో అత్యుత్తమ కాలేజీల్లో సీట్లు సంపాదించేవారికి రూ.1.25 కోట్ల వరకూ వారికి సహాయాన్ని విదేశీ విద్యాదీవెన ఇస్తున్నామని వివరించారు.

గ్రామ సచివాలయ స్థాయిలోనే మ్యారేజ్‌ సర్టిఫికేట్స్‌, దరఖాస్తుకు ఏర్పాట్లు:
గ్రామ సచివాలయ స్థాయిలోనే మ్యారేజ్‌ సర్టిపికేట్స్‌, దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎక్కడా కూడా లంచాలకు, వివక్షకు తావులేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. గతంలో కూడా ఇలాంటి తరహా కార్యక్రమం ప్రకటించారు. కానీ అమలు మాత్రం దారుణంగా ఉండేది. మంచి చేయాలన్న ఆలోచనతో చేసింది కాదు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆరోజు తీసుకు వచ్చారు. అరకొరగా డబ్బులు ఇచ్చారు.. అవికూడా పూర్తిగా ఇవ్వలేదని ఆరోపించారు. 2018-19 సంవత్సరంలో 17,709 మంది లబ్ధిదారులకు రూ. 68.68 కోట్లు ఎగ్గొట్టారు. 2018 అక్టోబరు నుంచి పూర్తిగా ఎగ్గొట్టారు. కేవలం ప్రకటనలకే ఆనాడు పథకం పరిమితమైంది. ఎస్సీలకు గతంలో రూ.40వేలు అయితే ఇప్పుడు లక్ష చేశాం.

ఎస్సీలు కులాంతర వివాహాలకు గతంలో రూ.75వేలు ప్రకటిస్తే ఇప్పుడు రూ.1.2లక్షలు చేసి అమలు చేస్తున్నాం. ఎస్టీలకు రూ.50 వేలు గతంలో అయితే.. ఇప్పుడు రూ.1 లక్ష ఇస్తున్నాం. అలాగే ఎస్టీ కులాంతర వివాహాలకు గతంలో రూ.75వేలు అయితే ఇప్పుడు రూ.1.2 లక్షలు ఇస్తున్నాం. బీసీలకు గతంలో రూ.35వేలు అయితే ఇప్పుడు రూ.50 వేలు, బీసీలు కులాంతర వివాహాలకు గతంలో రూ.50వేలు అయితే ఇప్పుడు రూ.75వేలు, మైనార్టీలకు గతంలో రూ.50 వేలు అయితే ఇప్పుడు రూ.1 లక్ష రూపాయలు, విభిన్న ప్రతిభావంతులకు గతంలో రూ.1 లక్ష అని చెప్తే.. ఇప్పుడు రూ.1.5 లక్షలు, భవన, ఇతర కార్మికులకు గతంలో రూ.20వేలు అయితే, ఇప్పుడు రూ.40వేలు ఇస్తున్నామని సీఎం జగన్‌ వెల్లడించారు.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: YSR Kalyanamasthu

Loan Charges: లోన్ తీసుకున్న వారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. కొత్త రూల్స్!

February 10, 2023 by bharathi

Penal Interest | మీరు లోన్ తీసుకున్నారా? అయితే గుడ్ న్యూస్. ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. పీనల్ చార్జీలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు తీసుకువస్తామని వెల్లడించింది.

Bank-Loan-Charges

Penal Charges | రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI – ఆర్‌బీఐ) తీపికబురు అందించింది. రుణ గ్రహీతలకు ఊరట కలిగే ప్రకటన చేసింది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు జారీ చేసే రుణాలకు సంబంధించిన పీనల్ చార్జీలకు కొత్త మార్గదర్శకాలు తీసుకువస్తామని ఆర్‌బీఐ ప్రకటించింది. పీనల్ చార్జీల్లో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీని వల్ల లోన్ (Loan) తీసుకున్న వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం పీనల్ చార్జీలు అనేవి ఒక్కో బ్యాంక్‌కు ఒక్కోలా ఉంటాయి. అంటే బ్యాంక్ తనకు నచ్చిన విధంగా పాలసీ విధానాలకు అనుగుణంగా పీనల్ చార్జీలను వసూలు చేస్తోంది. ఇలా అన్ని బ్యాంకులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలు కూడా ఇలానే పీనల్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ పాలసీ ప్రకారం చార్జీలను వసూలు చేస్తున్నాయి. వీటికి మార్గదర్శకాలు అంటూ ఏమీ లేవు. వాటి ఇష్టం. అందుకే ఆర్‌బీఐ పీనల్ చార్జీలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు తెస్తామని ప్రకటించింది.

చెక్ బౌన్స్ అయినప్పుడు, ప్రిపేమెంట్, చెల్లింపులు ఆలస్యం అయినప్పుడు, ఈఎంఐ మిస్ అయినప్పుడు బ్యాంకులు ఈ చార్జీలను వసూలు చేస్తుంటాయి. వీటినే పీనల్ చార్జీలుగా చెప్పుకుంటారు. ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. ఆటో లోన్స్‌కు సంబంధించి ప్రీపేమెంట్ చార్జీలు ఒక శాతంగా ఉన్నాయి. దీనికి జీఎస్‌టీ అదనం. లోన్ జారీ అయ్యి రెండేళ్ల గడువక ముందే చెల్లించే ప్రిపెయిడ్ అమౌంట్‌కు ఇది వర్తిస్తుంది.

కొన్ని సందర్భాల్లో పీనల్ చార్జీలు అనేవి అధికంగా ఉన్నాయని, అందుకే పారదర్శకత తీసుకురావడం కోసం కొత్త మార్గదర్శకాలు తీసుకువస్తామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. దీని వల్ల రుణ గ్రహీతలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. కాగా మరోవైపు ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకంది. కీలక రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. పావు శాతం మేర రెపో రేటు పెరిగింది. దీని వల్ల రెపో రేటు 6.5 శాతానికి చేరింది.

ఆర్‌బీఐ రెపో రేటు పెంపు వల్ల బ్యాంక్ కస్టమర్లకు రెండు రకాలుగా ప్రభావం పడనుంది. రుణ రేట్లు పెరుగుతాయి. దీని వల్ల లోన్ తీసుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అదేవిధంగా డిపాజిట్ రేట్లు పెరుగుతాయి. దీని వల్ల బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆర్‌బీఐ క్యూఆర్ కోడ్ బేస్డ్ కాయిన్ వెండింగ్ మెషీన్లను తీసువస్తున్నట్లు ప్రకటించింది. తొలిగా 12 పట్టణాల్లో వీటిని అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Bank

LPG Cylinder Price: గ్యాస్ సిలిండర్ ధర ఎప్పుడు తగ్గుతుంది ? పెట్రోలియం మంత్రి ఏం చెప్పారంటే..

February 10, 2023 by bharathi

LPG Cylinder: గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సిలిండర్ల ధరలు తగ్గితే ప్రజలకు ఎంతో ఊరటనిస్తుంది.

LPG-Cylinder-Price-to-be-decreased

పెరుగుతున్న ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర కొన్నిసార్లు ప్రజల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సిలిండర్ల ధరలు తగ్గితే ప్రజలకు ఎంతో ఊరటనిస్తుంది.

ఎల్‌పీజీ సిలిండర్‌కు సంబంధించిన పెద్ద సమాచారం బయటకు వస్తోంది. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధనం ధర తగ్గితే ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తగ్గించవచ్చని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ గురువారం తెలిపారు.

అంతర్జాతీయంగా ఇంధన ధర మెట్రిక్ టన్నుకు 750 డాలర్లుగా ఉన్నట్లయితే దేశీయ ఎల్‌పిజి సిలిండర్‌లను ఇంకా సరసమైన ధరలకు విక్రయించవచ్చని ఆయన సూచించారు.

గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు పలు సమస్యలు తలెత్తాయి. గ్యాస్ సిలిండర్ల ధరలకు సంబంధించి అంతర్జాతీయ ధరను వివిధ కారకాలు నిర్ణయిస్తుందని కేంద్రమంత్రి అన్నారు.

దేశీయ ఎల్‌పిజి ధరపై లోక్‌సభలో డిఎంకె ఎంపి కళానిధి వీరాస్వామి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చాు. వినియోగదారుల అవసరాలకు, ముఖ్యంగా అత్యంత బలహీన వర్గాల వారి అవసరాలకు ప్రభుత్వం సున్నితంగా ఉంటుందని అన్నారు. ఢిల్లీలో దేశీయ ఎల్‌పిజి సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర రూ.1053గా ఉందని పూరీ తెలిపారు.

సౌదీ అరేబియాలో గ్యాస్ ధరలలో 330 శాతం కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది, అయితే ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను చాలా తక్కువగా పెంచింది. ఇలాంటి పరిస్థితుల్లో సౌదీ అరేబియాలో గ్యాస్ ధరలు తగ్గితే.. ఆ ప్రభావం దేశంలో అందుబాటులో ఉన్న ఎల్‌పీజీ సిలిండర్‌లపై కూడా కనిపిస్తుంది.

సమాచారం ప్రకారం, ఇంతకుముందు ప్రతి వ్యక్తికి గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ పూర్తిగా నిలిపివేయబడింది. గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ ప్రారంభమైతే.. అది ఎవరికి లాభం చేకూర్చుతుందనే చర్చ మొదలైంది. ఇదే జరిగితే ప్రభుత్వం ముందుగా పేద ప్రజలకు గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఇవ్వడం ప్రారంభిస్తుంది.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Gas

  • « Previous Page
  • 1
  • …
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • …
  • 55
  • Next Page »

Recent Posts

  • Sachivalayam Aadhar Camps in August 2023 | ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు
  • ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు 2022 జులై DA ప్రకటన | ఏ బేసిక్‌ వారికి ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి
  • ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhan Mantri Mudra Yojana) – PMMY | Updates
  • తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు | Central Government Schemes in Telangana Villages
  • Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం
  • YSR NethaAnna Nestham (BENEFICIARY OUT REACH APP) Full Detailed Process
  • YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల తేదీ ఖరారు
  • పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం 2023 | PM Vishwakarma Kaushal Samman Scheme 2023
  • Ammavodi Payment Status Checking -2023 | అమ్మఒడి చెల్లింపు స్థితి తనిఖీ -2023
  • బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Central Government Has Brought the Pradhan Mantri Tractor Yojana Scheme
  • PM Tractor Yojana 2023: కేంద్రం గొప్ప పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. అర్హులెవరు.. దరఖాస్తు ఎలా.. మొత్తం డీటెయిల్స్ ఇవే..
  • వాలంటీర్ల హాజరు రిపోర్ట్ | Volunteers Attendnace Report
  • AP: CM సంచలన నిర్ణయం: పెన్షన్@ రూ. 4,000.!? Volunteers Salary Increased to Rs.10,000/- ?
  • వైయస్సార్ పెళ్లి | YSR Pelli Kaanuka Important Update
  • విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు | Rice Card for Divorced Single Persons
  • YSR Pension Kanuka Hike
  • ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • YSR CHEYUTHA scheme 2023-24
  • Ammavodi-2023 – eKYC | అమ్మఒడి-2023 – ఇకెవైసి
  • ఖరీఫ్ సీజన్ : పంట నమోదు ఫారం | Kharif Season : Crop Registration Form
  • వైఎస్సార్ వాహన మిత్ర 2023-24 సంవత్సరానికి సంబంధించి GO విడుదల | YSR Vahana Mitra GO release for the year 2023-24
  • వాలంటీర్ల గౌరవ భృతి సమాచారం | Honorarium information for volunteers
  • వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ | Documents required for fresh registration of YSR signature
  • వైఎస్సార్ కళ్యాణమస్తు 3వ విడత అప్డేట్ | YSR Kalyanamastu 3rd installment update
  • YSR Pension Kanuka Details (వైఎస్ఆర్ పెన్షన్ కానుక వివరాలు)
  • Jagananna Suraksha (జగనన్న సురక్ష)
  • AP Mission Vatsalya | ఆంధ్రప్రదేశ్-మిషన్ వాత్సల్య | అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు
  • Mission Vatsalya Scheme Date Extended | మిషన్ వాత్సల్య పథకం గడువు పొడిగింపు
  • Jagananna Vasathi Deevena 2023 Date Fixed | Starts in Ananthapur | జగనన్న వసతి దీవెన 2023 అనంతపురంలో ప్రారంభమవుతుంది
  • YSR PENSION KANUKA & AASARA Key Contacts | HelpLine Numbers District
  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2026 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in