Navaratnalu

  • Contact us

PM Tractor Yojana 2023: కేంద్రం గొప్ప పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. అర్హులెవరు.. దరఖాస్తు ఎలా.. మొత్తం డీటెయిల్స్ ఇవే..

August 14, 2023 by bharathi

Govt Schemes: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో అద్భుత పథకాలను అందుబాటులో ఉంచింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు పంట సాయం ఏటా రూ. 6 వేలు అందిస్తోంది. అయితే రైతులకు మరో అద్భుత పథకం ఉంది. ఇందులో సాగుకు అవసరమైన ట్రాక్టర్‌ను సగం ధరకే దక్కించుకోవచ్చు. ఎలాగో పూర్తి వివరాలు చూద్దాం.

Farmers: రైతులను ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో అద్భుత పథకాలు తీసుకొచ్చింది. వివిధ రకాలుగా చేయూతను అందిస్తూ అన్నదాతకు భరోసా కల్పిస్తుంది. అయితే గతంతో పోలిస్తే వ్యవసాయంలో ఆధునికీకరణ, పెరుగుతున్న సాంకేతికత కారణంగా సాగు చేసేందుకు యంత్రాల వినియోగం విపరీతంగా పెరగడం మనం గమనించొచ్చు.

PM-Tractor-Yojana-2023

రైతులకు వ్యవసాయంలో ఆసరాగా నిలిచే యంత్రాల్లో ట్రాక్టర్ ప్రధానమైనది. దుక్కి దున్నడం దగ్గర్నుంచి ఎన్నో అవసరాలకు ట్రాక్టరే ఎక్కువగా అవసరం పడుతుంది. కానీ దీనిని కొనుగోలు చేయడం మాత్రం రైతులకు ఇప్పటికీ భారంగానే ఉంది. లక్షల రూపాయలు పెట్టి ట్రాక్టర్ కొనాలంటే.. భయపడుతుంటారు. వారికి కూడా కేంద్రం మద్దతు ఇస్తోంది. రైతులు సగం ధరకే ట్రాక్టర్‌ను సొంతం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ అమలు చేస్తోంది. ఇదే ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన (Pradhan Mantri Tractor Yojana). అసలు ఈ పథకం ఏంటి.. దీని కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏమేం డాక్యుమెంట్లు కావాలి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పీఎం ట్రాక్టర్ యోజన అంటే?

అన్నదాతకు తక్కువ ధరకే వ్యవసాయ పనిముట్లు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ట్రాక్టర్ యోజన స్కీమ్ అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌లో భాగంగా రైతులు 50 శాతం తక్కువ ధరతో (సబ్సిడీతో) ట్రాక్టర్ కొనుగోలు చేయొచ్చు. ధర మొత్తంలో సగం చెల్లిస్తే చాలు ట్రాక్టర్ కొనే వీలు కల్పిస్తోంది కేంద్రం. ఈ పథకానికి ఆయా రాష్ట్రాలే నోడల్ ఏజెన్సీగా ఉంటాయి.

ఎవరు అర్హులు.. సొంత పొలం ఉండాలా?

భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి చిన్న, సన్నకారు రైతు కూడా పీఎం ట్రాక్టర్ యోజన పథకానికి అర్హుడే. ఇక ఈ స్కీం ద్వారా లబ్ధి పొందాలనుకున్న రైతు వయస్సు మాత్రం 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల లోపు ఉండాలి. సొంత పొలం లేకున్నా పర్లేదు.. కౌలు రైతులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందనేది గుర్తుంచుకోవాలి. కౌలు రైతులు.. యజమాని నుంచి NOC తీసుకోవాల్సి ఉంటుంది.

రూ. 1.50 లక్షలు దాటొద్దు!

పీఎం ట్రాక్టర్ స్కీంకు దరఖాస్తు చేసుకునే రైతు కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకు మించొద్దు. అప్లికేషన్ పెట్టుకున్న రైతు .. అర్హుడైతే అతనికి సగం రేటుకే ట్రాక్టర్ కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ట్రాక్టర్ ధరలో సగం కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. మిగిలిన సగం మొత్తాన్ని .. బ్యాంకులు రైతులు లోన్‌గా ఇస్తాయి.

సబ్సిడీ ఎవరికి వస్తుందంటే?

ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు రైతుకు లోన్ ఇచ్చే బ్యాంకుకే .. కేంద్రం ఈ రాయితీని బదలాయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్.. ఒక ట్రాక్టర్ ధర రూ. 8 లక్షలు అనుకుందాం. అందులో కేంద్రం రూ. 4 లక్షలు భరిస్తుంది. మరో రూ. 4 లక్షలు బ్యాంకు రైతుకు రుణంగా ఇస్తుంది. రైతు ట్రాక్టర్ కొన్న తర్వాత.. తాను లోన్‌గా తీసుకున్న రూ. 4 లక్షలను వాయిదా పద్ధతిలో (EMI) తిరిగి చెల్లిస్తే సరిపోతుంది.

ఇప్పటికే ట్రాక్టర్ ఉన్నవారికి మళ్లీ ఇస్తుందా?

గడిచిన 7 సంవత్సరాలుగా ట్రాక్టర్ కొనుగోలు చేయని వారికి ఈ పథకం కింద మళ్లీ దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇక ఈ స్కీం కింద ఒక రైతు ఒక ట్రాక్టర్ మాత్రమే కొనుగోలు చేసే వీలు ఉంటుంది. రైతు తనకు ఇష్టం వచ్చిన ట్రాక్టర్‌ను .. తనకు ఇష్టమైన ధరలో .. తనకు నచ్చిన కంపెనీ ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. తన సాగు అవసరాలకు తగ్గట్లుగా ఏ ట్రాక్టర్ కొనాలనేది పూర్తిగా రైతు ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది.

ఏమేం డాక్యుమెంట్లు కావాలి?

పీఎం ట్రాక్టర్ పథకానికి దరఖాస్తు చేసే రైతులు కచ్చితంగా ఈ పత్రాలు సమర్పించాలి. ఆధార్ కార్డు కచ్చితం ఉండాలి. పాన్ కార్డు/ఓటర్ ఐడీ / డ్రైవింగ్ లైసెన్స్/ పాస్‌పోర్టు (వీటిల్లో ఏదో ఒకటి), పొలానికి సంబంధించిన అడంగల్ డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో.

దరఖాస్తు ఎలా చేసుకోవాలి?

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా అప్లై చేసుకునేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో వీలు కల్పిస్తున్నాయి. తెలంగాణలో అయితే .. కామన్ సర్వీస్ సెంటర్లలో (మీసేవా కేంద్రాలు) దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో రైతు అతడు ఉన్న గ్రామ సచివాలయం లేదా రైతు భరోసా కేంద్రాల్లోని అధికారులను సంప్రదిస్తే వివరాలు తెలుస్తాయి.

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ వెబ్‌సైట్లో https://pmkisan .gov.in/ ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీని కోసం ముందుగా Login ID క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ తర్వాత.. అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఏమైనా అనుమానాలు తలెత్తితే.. రైతుల కోసం పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో హెల్ప్‌లైన్ నంబర్ ఉంటుంది. 155261 / 011-24300606 నంబర్స్‌కు ఫోన్ చేసి మీరు ప్రశ్నలు అడగొచ్చు.

ఏపీ, తెలంగాణలో ఇలా..

ఇదే పథకాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకో అడుగు ముందుకేసి వినూత్నంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణ సర్కార్.. యంత్రలక్ష్మి పేరుతో అమలు చేస్తూ.. ట్రాక్టర్ సహా వ్యవసాయ పరికరాలు కూడా అదనంగా ఇస్తోంది. మరోవైపు ఏపీ సర్కార్.. వైయస్‌ఆర్ యంత్రసేవ పేరిట అమలు చేస్తోంది. ఈ పథకం కోసం 155251 టోల్‌ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంది. ఇది కూడా మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Farmers

వాలంటీర్ల హాజరు రిపోర్ట్ | Volunteers Attendnace Report

August 14, 2023 by bharathi

GSWS Volunteers Attendnace Report / Attendance Dashboard : గ్రామా వార్డు వాలంటీర్లకు సంబంధించి హాజరు రిపోర్ట్ ప్రాముఖ్యత చాలా ఉంది.ముఖ్యంగా నెలవారీ గౌరవ భృతి కొరకు హాజరు రిపోర్ట్ ఉపయోగపడుతుంది .అధికారులు సచివాలయాలో సందర్శన సమయంలో ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల మరియు వాలంటీర్ల హాజరు రిపోర్ట్ తనిఖీ చేస్తారు . అదే విధంగా ఏదైనా అనుకోని సమయం లో వాలంటీర్ల పై అభియోగం పడినా అప్పుడు విచారణ లో భాగంగా హాజరు ను ముఖ్యంగా పరిగణిస్తారు . అదే విధంగా వాలంటీర్ల అవార్డులలో భాగంగా హాజరును పరిగణిస్తారు . ప్రస్తుతానికి వరం లో మూడు రోజులు సచివాలయం లో వాలంటీర్లు హాజరు వెయ్యాలి , ఆలా నెలలో అన్ని వారాలు హాజరు వేస్తె అప్పుడు ఆ నెలకు 100% హాజరు వేసినట్టు అర్ధము .

Volunteers-Attendnace-Report

హాజరు రిపోర్ట్ తెలుసుకునే విధానము :

ముందుగా కింద తెలిపిన లింక్ పై క్లిక్ చెయ్యండి

Click Here

District  వద్ద జిల్లా ను సెలెక్ట్ చేసుకోవాలి .

Mandal వద్ద మండలం/మున్సిపాలిటీ  ను సెలెక్ట్ చేసుకోవాలి

Category ను సెలెక్ట్ చేస్తే రెండు ఆప్షన్ లు చూపిస్తాయి అందులో Voluntter  ను సెలెక్ట్ చెయ్యాలి

From Date వద్ద ఏ రోజు నుంచి హాజరు రిపోర్ట్ కావాలో ఆ తేదీ ను సెలెక్ట్ చెయ్యాలి

To Date వద్ద ఈ రోజు వరకు హాజరు రిపోర్ట్ కావాలో ఆ తేడాను సెలెక్ట్ చెయ్యాలి .తరువాత SUBMIT పై క్లిక్ చెయ్యాలి .

వెంటనే మీరు ఎంటర్ చేసిన డేటా మేరకు వివరాలు చూపిస్తుంది . మీ మండలం / మునిసిపాలిటీ  లో ఉండే అన్ని సచివాలయాలు పేర్లు చూపిస్తుంది .రిపోర్ట్ లో

Note : The Attendance Dashboard will be available between 11:00 AM to 02:45 PM and 05:45 PM onwards.

Secretariat Name సచివాలయం పేరు

Employee/Volunteer Name  వాలంటీర్ పేరు

Cluster Name  వాలంటీర్ క్లస్టర్ నెంబర్

Volunteer Type  వాలంటీర్ Incharge  / Regular అని చూపిస్తుంది

No .of Calendar Days  మొత్తం రోజులు

No .of Days Present  ఎన్ని రోజులు హాజరు అయ్యారు

Percentage హాజరు శాతం

అందులో మీ డేటా కోసం 🔍Search Box లో మీ పేరు ఎంటర్ చేస్తే మీ హాజరు వివరాలు చూపిస్తుంది .అదే మీ సచివాలయం డేటా కావాలి అనుకుంటే మీ సచివాలయం పేరు ఎంటర్ చేయాలి . హాజరు రిపోర్ట్ ను Excel ఫైల్ రూపం లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు DOWNLOAD EXCEL పై క్లిక్ చెయ్యాలి

Sachivalayam Volunteers Attendance Report Note  :

1. ఈ విధానం లొ కేవలం ఒక నెల రోజుల వ్యవధిలో హాజరు రిపోర్ట్ మాత్రమే తెలుసుకోవచ్చు .

2. ఈ రిపోర్ట్ లింక్ రోజు ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 2.45 వరకు మరలా ,సాయంత్రం  5.45 తరువాత నుంచి అందుబాటులో ఉంటుంది.


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Volunteer

AP: CM సంచలన నిర్ణయం: పెన్షన్@ రూ. 4,000.!? Volunteers Salary Increased to Rs.10,000/- ?

August 13, 2023 by bharathi

CM సంచలన నిర్ణయం: పెన్షన్‌ @ రూ. 4000? AP: ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాలంటీర్లకు ఇచ్చే భృతిని రూ.10,000 పెంచనున్నట్లు, అలాగే ఆసరా పెన్షన్లను కూడా రూ. 4000 లకు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

YSR-AASARA-Update-4000

For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: YSR Asara

వైయస్సార్ పెళ్లి | YSR Pelli Kaanuka Important Update

August 9, 2023 by bharathi

☛ వైయస్సార్ పెళ్లి కానుక *01.10.2022* తరువాత పెళ్లయిన వారికి మాత్రమే వర్తిస్తుంది.

☛ అంతకు ముందు అయినటువంటి ఏ పెళ్లికి కూడా వైయస్సార్ పెళ్లి కానుక వర్తించదు.

☛ వైయస్సార్ పెళ్లి కానుక పేమెంట్ అనేది సంవత్సరానికి నాలుగు సార్లు రిలీజ్ చేస్తారు. *(జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో….)*


☛ YSR Pellikanuka is applicable only for those married after *01.10.2022*.

☛ YSR Pellikanuka is not applicable for any previous marriage.

☛ YSR Wedding Gift Payment is released four times a year. *(in the months of January, April, July, October…)*


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: YSR Pelli Kaanuka

విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు | Rice Card for Divorced Single Persons

August 9, 2023 by bharathi

🙎 *//విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు//*

రాష్ట్రంలో అనర్హత (ఇన్ ఎలిజిబుల్) కారణంగా రైస్ కార్డు కోల్పో న వారు దరఖాస్తు చేసుకుంటే ఆరుదశల ధ్రువీకరణ (సిక్స్ స్టెప్ వెరిఫికేషన్) అనంతరం కొత్తకార్డు మంజూరుకు పౌరసరఫరాల శాఖ అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సిట్ ఆప్షన్ తీసుకొచ్చింది. వీరితోపాటు విడాకులు తీసుకుని సంతానం లేని ఒంటరి వ్యక్తులు సైతం తగిన ధ్రువపత్రాలు సమర్పిస్తే రైస్ కార్డు ఇవ్వనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖతో సమన్వయం చేసుకుంటూ రైస్ కార్డుల దరఖాస్తులను స్వీకరించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖకు సూచించింది.


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Rice Card

  • « Previous Page
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • …
  • 55
  • Next Page »

Recent Posts

  • Sachivalayam Aadhar Camps in August 2023 | ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు
  • ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు 2022 జులై DA ప్రకటన | ఏ బేసిక్‌ వారికి ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి
  • ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhan Mantri Mudra Yojana) – PMMY | Updates
  • తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు | Central Government Schemes in Telangana Villages
  • Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం
  • YSR NethaAnna Nestham (BENEFICIARY OUT REACH APP) Full Detailed Process
  • YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల తేదీ ఖరారు
  • పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం 2023 | PM Vishwakarma Kaushal Samman Scheme 2023
  • Ammavodi Payment Status Checking -2023 | అమ్మఒడి చెల్లింపు స్థితి తనిఖీ -2023
  • బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Central Government Has Brought the Pradhan Mantri Tractor Yojana Scheme
  • PM Tractor Yojana 2023: కేంద్రం గొప్ప పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. అర్హులెవరు.. దరఖాస్తు ఎలా.. మొత్తం డీటెయిల్స్ ఇవే..
  • వాలంటీర్ల హాజరు రిపోర్ట్ | Volunteers Attendnace Report
  • AP: CM సంచలన నిర్ణయం: పెన్షన్@ రూ. 4,000.!? Volunteers Salary Increased to Rs.10,000/- ?
  • వైయస్సార్ పెళ్లి | YSR Pelli Kaanuka Important Update
  • విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు | Rice Card for Divorced Single Persons
  • YSR Pension Kanuka Hike
  • ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • YSR CHEYUTHA scheme 2023-24
  • Ammavodi-2023 – eKYC | అమ్మఒడి-2023 – ఇకెవైసి
  • ఖరీఫ్ సీజన్ : పంట నమోదు ఫారం | Kharif Season : Crop Registration Form
  • వైఎస్సార్ వాహన మిత్ర 2023-24 సంవత్సరానికి సంబంధించి GO విడుదల | YSR Vahana Mitra GO release for the year 2023-24
  • వాలంటీర్ల గౌరవ భృతి సమాచారం | Honorarium information for volunteers
  • వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ | Documents required for fresh registration of YSR signature
  • వైఎస్సార్ కళ్యాణమస్తు 3వ విడత అప్డేట్ | YSR Kalyanamastu 3rd installment update
  • YSR Pension Kanuka Details (వైఎస్ఆర్ పెన్షన్ కానుక వివరాలు)
  • Jagananna Suraksha (జగనన్న సురక్ష)
  • AP Mission Vatsalya | ఆంధ్రప్రదేశ్-మిషన్ వాత్సల్య | అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు
  • Mission Vatsalya Scheme Date Extended | మిషన్ వాత్సల్య పథకం గడువు పొడిగింపు
  • Jagananna Vasathi Deevena 2023 Date Fixed | Starts in Ananthapur | జగనన్న వసతి దీవెన 2023 అనంతపురంలో ప్రారంభమవుతుంది
  • YSR PENSION KANUKA & AASARA Key Contacts | HelpLine Numbers District
  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2026 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in