Navaratnalu

  • Contact us

బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Central Government Has Brought the Pradhan Mantri Tractor Yojana Scheme

August 14, 2023 by bharathi

వ్యవసాయ రంగంలో యంత్రాల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. కానీ కొంతమంది బడా రైతులకు మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి.  చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయంలో ప్రధానమైన ట్రాక్టర్​ను కొనే స్థోమత లేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ట్రాక్టర్​ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా చిన్న, సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లను అందజేస్తున్నది. లక్షల రూపాయలు వెచ్చించి ట్రాక్టర్లను కొనుగోలు చేయలేని  రైతులకు ఈ పథకం వరంగా మారింది.

bjp-government-has-brought-the-pradhan-mantri-tractor-yojana-scheme

  • రైతులకు వరంగా ప్రధానమంత్రి ట్రాక్టర్​ యోజన
  • యూనిట్​ ధరలో  50శాతం సబ్సిడీ ఇవ్వనున్న కేంద్రం
  • రూ.లక్షన్నర ఆదాయం మించొద్దు
  • కౌలు రైతులూ అర్హులే..

50 శాతం చెల్లిస్తే ట్రాక్టర్​ సొంతం..

రైతులు ట్రాక్టర్​ ధరలో 50 శాతం చెల్లిస్తే చాలు ప్రధానమంత్రి ట్రాక్టర్​యోజన పథకం కింద నచ్చిన ట్రాక్టర్​ను సొంతం చేసుకోవచ్చు.  అది కూడా భరించలేని రైతులు వ్యవసాయ భూమిని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి లోన్​ తీసుకోవచ్చు.  రైతు ఏ బ్యాంక్​లో లోన్​ తీసుకుంటాడో అదే బ్యాంక్​కు కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందజేస్తుంది. ట్రాక్టర్​ ధర రూ.8లక్షలు అనుకుంటే  రైతు రూ.4లక్షలు చెల్లించాలి. మిగతా రూ.4లక్షలను కేంద్రం భరిస్తుంది.  లోన్​ మొత్తాన్ని వాయిదా పద్ధతుల్లో బ్యాంక్​కు చెల్లిస్తే సరిపోతుంది.

రూ.లక్షన్నర ఆదాయం ఉన్నవారికే..

ప్రధానమంత్రి ట్రాక్టర్​ యోజన పథకం ద్వారా లబ్ధి పొందే రైతుల వార్షికాదాయం రూ.లక్షన్నరకు  మించరాదు. అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.  గత ఏడు సంవత్సరాల్లో ప్రభుత్వ సబ్సిడీపై  ట్రాక్టర్​ కొనుగోలు చేయని రైతులకు ఇది వర్తిస్తుంది. కౌలు రైతులు సైతం ఈ స్కీం ద్వారా ట్రాక్టర్​ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది.  వీరు భూ యజమానుల దగ్గరి నుంచి నో ఆబ్జెక్షన్​ సర్టిఫికెట్​(ఎన్​వోసీ) తీసుకొని ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే ఒక రైతు ఒక ట్రాక్టర్​ను మాత్రమే కొనే వీలుంటుంది. తనకు నచ్చిన కంపెనీ, నచ్చిన మోడల్​ను రైతులు ఎంపిక చేసుకోవచ్చు. ఏ ట్రాక్టర్​ కొనుగోలు చేయాలన్నది పూర్తిగా రైతుల ఇష్టమే.

దరఖాస్తు చేయడం ఇలా..

ప్రధానమంత్రి ట్రాక్టర్​ యోజన పథకానికి రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్​లైన్​లో https://pmkisan .gov.in వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్​ కార్డు, పాన్​ కార్డు, ఓటర్​ ఐడీ కార్డు, డ్రైవింగ్​ లైసెన్స్​, పాస్​పోర్టుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా సమర్పించాలి. వ్యవసాయ భూమికి సంబంధించిన అడంగల్​ పహాణీ, బ్యాంక్​ అకౌంట్​ వివరాలు, ఇన్​కమ్​ సర్టిఫికెట్​, లేటెస్ట్​ పాస్​పోర్టు సైజ్​ ఫొటోతో ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏమైనా అనుమానాలుంటే హెల్ప్​లైన్​ టోల్​ఫ్రీ 155261, 011–24300606 నంబర్లలో  లేదా దగ్గరలోని ట్రాక్టర్​ డిస్ర్టిబ్యూటర్లను సంప్రదించాలి.

ఇప్పటివరకు 15 ట్రాక్టర్లు ఇచ్చాం

ప్రధానమంత్రి ట్రాక్టర్​ యోజన స్కీమ్​ చిన్న, సన్నకారు రైతులకు ఎంతో లాభదాయకం. ఈ పథకం కింద ఇప్పటివరకు మేం 15 ట్రాక్టర్లు ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం గరిష్ఠంగా రూ.4లక్షలు సబ్సిడీ ఇస్తుంది. ట్రాక్టర్​ కొనుగోలు చేసిన తర్వాత మూడు నెలల్లోపు సబ్సిడీ అమౌంట్​వస్తుంది. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Farmers

PM Tractor Yojana 2023: కేంద్రం గొప్ప పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. అర్హులెవరు.. దరఖాస్తు ఎలా.. మొత్తం డీటెయిల్స్ ఇవే..

August 14, 2023 by bharathi

Govt Schemes: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో అద్భుత పథకాలను అందుబాటులో ఉంచింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు పంట సాయం ఏటా రూ. 6 వేలు అందిస్తోంది. అయితే రైతులకు మరో అద్భుత పథకం ఉంది. ఇందులో సాగుకు అవసరమైన ట్రాక్టర్‌ను సగం ధరకే దక్కించుకోవచ్చు. ఎలాగో పూర్తి వివరాలు చూద్దాం.

Farmers: రైతులను ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో అద్భుత పథకాలు తీసుకొచ్చింది. వివిధ రకాలుగా చేయూతను అందిస్తూ అన్నదాతకు భరోసా కల్పిస్తుంది. అయితే గతంతో పోలిస్తే వ్యవసాయంలో ఆధునికీకరణ, పెరుగుతున్న సాంకేతికత కారణంగా సాగు చేసేందుకు యంత్రాల వినియోగం విపరీతంగా పెరగడం మనం గమనించొచ్చు.

PM-Tractor-Yojana-2023

రైతులకు వ్యవసాయంలో ఆసరాగా నిలిచే యంత్రాల్లో ట్రాక్టర్ ప్రధానమైనది. దుక్కి దున్నడం దగ్గర్నుంచి ఎన్నో అవసరాలకు ట్రాక్టరే ఎక్కువగా అవసరం పడుతుంది. కానీ దీనిని కొనుగోలు చేయడం మాత్రం రైతులకు ఇప్పటికీ భారంగానే ఉంది. లక్షల రూపాయలు పెట్టి ట్రాక్టర్ కొనాలంటే.. భయపడుతుంటారు. వారికి కూడా కేంద్రం మద్దతు ఇస్తోంది. రైతులు సగం ధరకే ట్రాక్టర్‌ను సొంతం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ అమలు చేస్తోంది. ఇదే ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన (Pradhan Mantri Tractor Yojana). అసలు ఈ పథకం ఏంటి.. దీని కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏమేం డాక్యుమెంట్లు కావాలి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పీఎం ట్రాక్టర్ యోజన అంటే?

అన్నదాతకు తక్కువ ధరకే వ్యవసాయ పనిముట్లు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ట్రాక్టర్ యోజన స్కీమ్ అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌లో భాగంగా రైతులు 50 శాతం తక్కువ ధరతో (సబ్సిడీతో) ట్రాక్టర్ కొనుగోలు చేయొచ్చు. ధర మొత్తంలో సగం చెల్లిస్తే చాలు ట్రాక్టర్ కొనే వీలు కల్పిస్తోంది కేంద్రం. ఈ పథకానికి ఆయా రాష్ట్రాలే నోడల్ ఏజెన్సీగా ఉంటాయి.

ఎవరు అర్హులు.. సొంత పొలం ఉండాలా?

భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి చిన్న, సన్నకారు రైతు కూడా పీఎం ట్రాక్టర్ యోజన పథకానికి అర్హుడే. ఇక ఈ స్కీం ద్వారా లబ్ధి పొందాలనుకున్న రైతు వయస్సు మాత్రం 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల లోపు ఉండాలి. సొంత పొలం లేకున్నా పర్లేదు.. కౌలు రైతులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందనేది గుర్తుంచుకోవాలి. కౌలు రైతులు.. యజమాని నుంచి NOC తీసుకోవాల్సి ఉంటుంది.

రూ. 1.50 లక్షలు దాటొద్దు!

పీఎం ట్రాక్టర్ స్కీంకు దరఖాస్తు చేసుకునే రైతు కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకు మించొద్దు. అప్లికేషన్ పెట్టుకున్న రైతు .. అర్హుడైతే అతనికి సగం రేటుకే ట్రాక్టర్ కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ట్రాక్టర్ ధరలో సగం కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. మిగిలిన సగం మొత్తాన్ని .. బ్యాంకులు రైతులు లోన్‌గా ఇస్తాయి.

సబ్సిడీ ఎవరికి వస్తుందంటే?

ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు రైతుకు లోన్ ఇచ్చే బ్యాంకుకే .. కేంద్రం ఈ రాయితీని బదలాయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్.. ఒక ట్రాక్టర్ ధర రూ. 8 లక్షలు అనుకుందాం. అందులో కేంద్రం రూ. 4 లక్షలు భరిస్తుంది. మరో రూ. 4 లక్షలు బ్యాంకు రైతుకు రుణంగా ఇస్తుంది. రైతు ట్రాక్టర్ కొన్న తర్వాత.. తాను లోన్‌గా తీసుకున్న రూ. 4 లక్షలను వాయిదా పద్ధతిలో (EMI) తిరిగి చెల్లిస్తే సరిపోతుంది.

ఇప్పటికే ట్రాక్టర్ ఉన్నవారికి మళ్లీ ఇస్తుందా?

గడిచిన 7 సంవత్సరాలుగా ట్రాక్టర్ కొనుగోలు చేయని వారికి ఈ పథకం కింద మళ్లీ దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇక ఈ స్కీం కింద ఒక రైతు ఒక ట్రాక్టర్ మాత్రమే కొనుగోలు చేసే వీలు ఉంటుంది. రైతు తనకు ఇష్టం వచ్చిన ట్రాక్టర్‌ను .. తనకు ఇష్టమైన ధరలో .. తనకు నచ్చిన కంపెనీ ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. తన సాగు అవసరాలకు తగ్గట్లుగా ఏ ట్రాక్టర్ కొనాలనేది పూర్తిగా రైతు ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది.

ఏమేం డాక్యుమెంట్లు కావాలి?

పీఎం ట్రాక్టర్ పథకానికి దరఖాస్తు చేసే రైతులు కచ్చితంగా ఈ పత్రాలు సమర్పించాలి. ఆధార్ కార్డు కచ్చితం ఉండాలి. పాన్ కార్డు/ఓటర్ ఐడీ / డ్రైవింగ్ లైసెన్స్/ పాస్‌పోర్టు (వీటిల్లో ఏదో ఒకటి), పొలానికి సంబంధించిన అడంగల్ డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో.

దరఖాస్తు ఎలా చేసుకోవాలి?

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా అప్లై చేసుకునేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో వీలు కల్పిస్తున్నాయి. తెలంగాణలో అయితే .. కామన్ సర్వీస్ సెంటర్లలో (మీసేవా కేంద్రాలు) దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో రైతు అతడు ఉన్న గ్రామ సచివాలయం లేదా రైతు భరోసా కేంద్రాల్లోని అధికారులను సంప్రదిస్తే వివరాలు తెలుస్తాయి.

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ వెబ్‌సైట్లో https://pmkisan .gov.in/ ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీని కోసం ముందుగా Login ID క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ తర్వాత.. అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఏమైనా అనుమానాలు తలెత్తితే.. రైతుల కోసం పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో హెల్ప్‌లైన్ నంబర్ ఉంటుంది. 155261 / 011-24300606 నంబర్స్‌కు ఫోన్ చేసి మీరు ప్రశ్నలు అడగొచ్చు.

ఏపీ, తెలంగాణలో ఇలా..

ఇదే పథకాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకో అడుగు ముందుకేసి వినూత్నంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణ సర్కార్.. యంత్రలక్ష్మి పేరుతో అమలు చేస్తూ.. ట్రాక్టర్ సహా వ్యవసాయ పరికరాలు కూడా అదనంగా ఇస్తోంది. మరోవైపు ఏపీ సర్కార్.. వైయస్‌ఆర్ యంత్రసేవ పేరిట అమలు చేస్తోంది. ఈ పథకం కోసం 155251 టోల్‌ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంది. ఇది కూడా మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Farmers

ఖరీఫ్ సీజన్ : పంట నమోదు ఫారం | Kharif Season : Crop Registration Form

August 9, 2023 by bharathi

🌾 ఖరీఫ్ సీజన్ కి సంబంధించి పంట నమోదు మొదలు కావడం జరిగింది కాబట్టి మీ పరిధిలోని రైతులకు తెలియజేయండి కచ్చితంగా పంట నమోదు అనేది చేయించుకోవాలి ఇప్పుడు చేసుకుంటేనే ధాన్యం అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వాలంటీర్స్ అందరు మీ క్లస్టర్ లొ వారికి క్రింద డేటా కలెక్ట్ చేయు విషయం పై సహాయం చెయ్యండి.

1. పంట నమోదు దరఖాస్తు ఫామ్

2. 1-బి జిరాక్స్

3. ఆధార్ కార్డు జిరాక్స్

4. పంట రకం -(example :1061, 1064, masuri)

5. ఫోన్ no.

*పంట నమోదు ఫారం* :

Click here to download application form


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Farmers

రైతులకు తీపి కబురు | రూ.5 లక్షల వరకు వడ్డీ రహిత రుణం!

February 20, 2023 by bharathi

రైతు లేనిదే ఏ దేశం కూడా వృద్ధిలోకి రాలేదు. రైతు బాగుంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే భారతదేశంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తారు. కేటాయింపులు, నిధుల విషయంలో రైతులకు ప్రాధాన్యత కల్పిస్తుంటారు.

details-about-karnataka-government-short-term-loans-for-farmers

రైతులే దేశానికి వెన్నెముక అని అందరికీ తెలిసిందే. పారిశ్రామికంగా, సాంకేతికంగా ఎంత ఎదిగినా రైతన్న లేనిదే ప్రజల ఉనికే ఉండదు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ సంక్షేమ పథకాలు తర్వాత రైతులకే పెద్దపీట వేస్తాయి. నిధులు, కేటాయింపుల్లో రైతులకు ప్రధాన్యత ఇస్తూ ఉంటాయి. అలాగే పలు రాష్ట్రాలు కూడా రైతుల కోసం ఎన్నో పథకాలను కూడా అందిస్తున్నాయి.

కేంద్రం నుంచి పీఎం కిసాన్ యోజన, ఏపీలో రైతు భరోసా, తెలంగాణలో రైతు బంధు వంటి పథకాలు ఉన్నాయి. ఇప్పుడు మరోరాష్ట్రం రైతుల మేలు కోసం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. రైతులకు రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నట్లు ప్రకటించింది.

రైతు బాగుంటేనే ఆ దేశం బాగుంటుందని చెబుతుంటారు. అందుకే మన దేశంలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వారికోసం అనేక పథకాలను నిర్వహిస్తున్నారు, కొత్త పథకాలను కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు తాజాగా కర్ణాటక ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది.

వడ్డీ రహిత రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రైతులు రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండానే రుణాలు తీసుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. 2023- 2024 బడ్జెట్ లో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న రూ.3 లక్షల స్వల్పకాలిక రుణ పరిమితిని ఇప్పుడు రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్లు తెలిపింది.

గతంలో ఉన్న రుణపరిమితిని రూ.5 లక్షల వరకు పెంచడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తే రైతులకు వ్యవసాయం కోసం ఎంతో ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెరిగిన రుణ పరిమితి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రానుంది. అంటే ఏప్రిల్ 1 నుంచి రైతులు ఈ రుణాలు పొందవచ్చు.

30 లక్షల వరకు రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం ప్రకటించింది. రూ.25 వేల కోట్ల వరకు రుణాలు మంజూరు చేయచ్చని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు.

Filed Under: Farmers

Recent Posts

  • Sachivalayam Aadhar Camps in August 2023 | ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు
  • ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు 2022 జులై DA ప్రకటన | ఏ బేసిక్‌ వారికి ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి
  • ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhan Mantri Mudra Yojana) – PMMY | Updates
  • తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు | Central Government Schemes in Telangana Villages
  • Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం
  • YSR NethaAnna Nestham (BENEFICIARY OUT REACH APP) Full Detailed Process
  • YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల తేదీ ఖరారు
  • పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం 2023 | PM Vishwakarma Kaushal Samman Scheme 2023
  • Ammavodi Payment Status Checking -2023 | అమ్మఒడి చెల్లింపు స్థితి తనిఖీ -2023
  • బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Central Government Has Brought the Pradhan Mantri Tractor Yojana Scheme
  • PM Tractor Yojana 2023: కేంద్రం గొప్ప పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. అర్హులెవరు.. దరఖాస్తు ఎలా.. మొత్తం డీటెయిల్స్ ఇవే..
  • వాలంటీర్ల హాజరు రిపోర్ట్ | Volunteers Attendnace Report
  • AP: CM సంచలన నిర్ణయం: పెన్షన్@ రూ. 4,000.!? Volunteers Salary Increased to Rs.10,000/- ?
  • వైయస్సార్ పెళ్లి | YSR Pelli Kaanuka Important Update
  • విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు | Rice Card for Divorced Single Persons
  • YSR Pension Kanuka Hike
  • ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • YSR CHEYUTHA scheme 2023-24
  • Ammavodi-2023 – eKYC | అమ్మఒడి-2023 – ఇకెవైసి
  • ఖరీఫ్ సీజన్ : పంట నమోదు ఫారం | Kharif Season : Crop Registration Form
  • వైఎస్సార్ వాహన మిత్ర 2023-24 సంవత్సరానికి సంబంధించి GO విడుదల | YSR Vahana Mitra GO release for the year 2023-24
  • వాలంటీర్ల గౌరవ భృతి సమాచారం | Honorarium information for volunteers
  • వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ | Documents required for fresh registration of YSR signature
  • వైఎస్సార్ కళ్యాణమస్తు 3వ విడత అప్డేట్ | YSR Kalyanamastu 3rd installment update
  • YSR Pension Kanuka Details (వైఎస్ఆర్ పెన్షన్ కానుక వివరాలు)
  • Jagananna Suraksha (జగనన్న సురక్ష)
  • AP Mission Vatsalya | ఆంధ్రప్రదేశ్-మిషన్ వాత్సల్య | అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు
  • Mission Vatsalya Scheme Date Extended | మిషన్ వాత్సల్య పథకం గడువు పొడిగింపు
  • Jagananna Vasathi Deevena 2023 Date Fixed | Starts in Ananthapur | జగనన్న వసతి దీవెన 2023 అనంతపురంలో ప్రారంభమవుతుంది
  • YSR PENSION KANUKA & AASARA Key Contacts | HelpLine Numbers District
  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2026 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in