Navaratnalu

  • Contact us

Standard Deduction: ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం అదిరిపోయే శుభవార్త | పూర్తి వివరాలు

February 8, 2023 by bharathi

Income Tax | మోదీ సర్కార్ వేతన జీవులకు తాజా బడ్జెట్‌లో అదిరిపోయే శుభవార్త అందించింది. కొత్త ట్యాక్స్ విధానంలోకి మారితే పలు రకాల బెనిఫిట్స్ కల్పిస్తోంది.

Nirmala Sitharaman | కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది. స్టాండర్డ్ డిడక్షన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు చూస్తే.. రూ. 50 వేల స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ కేవలం పాత ట్యాక్స్ (Tax) విధానంలోనే అందుబాటులో ఉండేది.

Income Tax Standard Deduction

అయితే ఇకపై కొత్త ట్యాక్స్ విధానంలో కూడా స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ అందుబాటులో ఉండనుంది. వేతన జీవులు, పెన్షన్లు (Pension), ఫ్యామిలీ పెన్షనర్లు ఇకపై కొత్త ట్యాక్స్ విధానంలో కూడా స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం పొందొచ్చు.

ఇక్కడ కొన్ని షరతులు ఉన్నాయి. అందరికీ ఈ బెనిఫిట్ వర్తించకపోవచ్చు. కేవలం రూ. 15.5 లక్షలు లేదా ఆపైన ఆదాయం కలిగిన ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వీరికి రూ. 52,500 వరకు ప్రయోజనం కలుగుతుంది. ఈ విషయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ స్పీచ్‌లో పేర్కొన్నారు.

కాగా కేంద్ర ప్రభుత్వం 2018 బడ్జెట్‌లో ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనే వెసులుబాటు తీసుకువచ్చింది. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్‌ స్థానంలో దీన్ని ప్రకటించారు. 2017-18 ఆర్థిక సంవత్సరం వరకు చూస్తే.. ట్రాన్స్‌ఫోర్ట్ అలవెన్స్ కింద రూ. 19,200 వరకు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ కింద రూ. 15 వేల వరకు పన్ను తగ్గింపు పొందే ఛాన్స్ ఉండేది.

అయితే తర్వాత వీటి స్థానంలో స్టాండర్డ్ డిడక్షన్ వచ్చింది. రూ. 40 వేల వరకు ఈ విధానంలో పన్ను తగ్గింపు లభిచేంది. అయితే 2019 మధ్యంతర బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్‌ను పెంచారు. రూ. 50 వేల వరకు పన్ను తగ్గింపు బెనిఫిట్ కల్పించారు.

ఇది వరకు స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ రూ. 40 వేలుగా ఉండేది. స్టాండర్డ్ డిడక్షన్ కింద పన్ను తగ్గింపు కోసం ఎలాంటి బిల్లులు చూపించాల్సిన పని లేదు.

అంతేకాకుండా స్టాండర్డ్ డిడక్షన్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. 2004-05 వరకు కూడా ఇలాంటి డిడక్షన్ అందుబాటులో ఉండేది.అప్పట్లో డిడక్షన్ అనేది రూ. 30 వేలకు సమానంగా లేదంటే ఆదాయంలో 40 శాతం వరకు ఏది తక్కువ అయితే అది.. అంతవరకు డిడక్షన్ పొందే ఛాన్స్ ఉండేది.

రూ. 75 వేల నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఇది వర్తించేది. అలాగే రూ. 5 లక్షలకు పైన ఆదాయం కలిగి ఉంటే అప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ అనేది రూ. 20 వేలుగా లభించేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త ట్యాక్స్ విధానంలో కూడా స్టాండర్డ్ డిడక్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను చెల్లించే ట్యాక్స్ పేయర్లకు ఊరట కలుగుతుంది.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: News

ముఖ్యమంత్రి జగన్ మరో కీలక హామీ అమలు | Implementation of another key promise of Chief Minister Jagan

February 8, 2023 by bharathi

ముఖ్యమంత్రి జగన్ బీసీలకు ఇచ్చిన మరో కీలక హామీ అమలుకు నిర్ణయించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 95 శాతం పూర్తి చేసారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. బీసీ గర్జనలో చెప్పిన విధంగా ఇప్పుడు ఆ హామీని అమలు చేస్తూ ప్రభుత్వం గజెట్ జారీ చేసింది. ఆలయాల్లో పలు కార్యక్రమాల్లో సేవలందించే తమకు పాలక వర్గాల్లో చోటు కల్పించాలని చాలా ఏళ్లుగా కోరుతున్న నాయీ బ్రాహ్మణుల ఆకాంక్షను అమలు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియా­మ‌కాల్లో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించేలా గజెట్ జారీ అయింది.

Implementation of another key promise of Chief Minister Jagan

చాలా ఏళ్లుగా ఆలయాల వ్యవస్థలో అర్చకు­లతో పాటు నాయీ బ్రాహ్మణులకు విడదీయరాని బంధం ఉంది. ఆలయాల్లో భజంత్రీలుగా, క్షురకులుగా, ప్రత్యేక ఉత్సవాల సమయంలో స్వామి వారి ఊరేగింపు పల్లకీ సేవల్లో నాయీ బ్రాహ్మణులు పాలు పంచుకుంటున్నారు. ఆలయాల్లో పలు కార్యక్రమాల్లో సేవలందించే తమకు పాలక వర్గాల్లో చోటు కల్పించాలన్న నాయీ బ్రాహ్మ‌ణులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం పైన జగన్ పాదయాత్ర వేళ వివరించారు. దీనికి నాడు జగన్ సానుకూలంగా స్పందించారు. వైసీపీ నిర్వహించిన బీసీ గర్జనలోనూ దీని పైన చర్చ చేసారు. ఆ హామీ అమలు చేస్తానని జగన్ స్పష్టం చేసారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు అధికారికంగా అమలు కోసం గజెట్ జారీ చేసారు.

గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుతో దేవాదాయ పరిధిలోని అయిదు లక్షలకు పైగా ఆదాయం ఉన్న దేవాలయలాలకు మాత్రమే బోర్డులు ఏర్పాటు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఆలయాలు 1,234 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే బోర్డు నియామకాలు పూర్తయినవి మినహాయించి, భర్తీ చేయాల్సిన 610 ఆలయాలకు కొత్త పాలక మండళ్ల ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం తాజాగా ఇంద్రకీలాద్రి, అన్నవరం, అరవసల్లి దేవాలయాలకు కొత్తగా పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. తాజాగా జారీ అయిన గజెట్ మేరకు ప్రతీ ఆలయంలోనూ ఒకరి చొప్పున నాయీ బ్రాహ్మణులకు ఈ దేవాలయ ట్రస్టు బోర్డులో స్థానం కల్పించేందుకు అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన నాయీ బ్రాహ్మణ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించారు.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: News

SDG Survey Started From Today | Update for Ration Card Holders | ఈ రోజునుండి రేషన్ కార్డు వారికి కొత్త రకం సర్వే పూర్తి వివరాలు

February 7, 2023 by bharathi

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు నుండి SDG సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే కి సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్లు అంతా ఈ సర్వేలో పాల్గొంటారు ఈ సర్వే ని ఎందుకు చేస్తున్నారు అనే వివరాలను చదివి తెలుసుకోండి.

SDG-Survey-Started

ఈ సర్వే పేరు ఎస్ డి జి ఈ సర్వేలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సర్వేను వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ డెవలప్మెంట్ వారు, సచివాలయంలో మహిళా పోలీస్, ఏఎన్ఎం మరియు అంగన్వాడి వర్కర్లతో జట్టు గా  ఏర్పడి సర్వే పూర్తి చేస్తారు. ఇది పథకాలకు సంబంధించిన సర్వే కావున లబ్ధిదారులు అందరూ ఈ SDG సర్వే కి సహకరించ వలెను

SDG-Survey-Started-from-today

SDG Full form Sustainable Development Goals (స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు)

AP SDG జర్నీ : లక్ష్య నిర్దేశనం, లక్ష్య ప్రాధాన్యత, సూచిక ఎంపిక, స్కీమ్ విశ్లేషణ మరియు పర్యవేక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడంతో సహా SDGలను స్వీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన మరియు తార్కిక దశల వారీ ప్రక్రియను అనుసరిస్తుంది. లక్ష్యాలు, థీమ్‌లు, లక్ష్యాలు, విభాగాలు, వ్యూహాలు మరియు సూచికలతో కూడిన ఫ్రేమ్‌వర్క్ రాష్ట్రం ఏర్పాటు చేసిన SDG మెకానిజంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఈ ఫ్రేమ్‌వర్క్ పురోగతిని కొలవడానికి ప్రాధాన్యతలు, వాటాదారులు, అమలుదారులు మరియు కొలమానాలను గుర్తిస్తుంది.

 

SDG

About SDG
Sustainable Development Goals (SDGs) represent the world’s vision for a more prosperous, peaceful, and equitable future. In 2015, all member states of the United Nations (UN) came together and adopted a framework of 17 goals to be achieved before the end of 2030. During these fifteen years, countries need to mobilize efforts to end all forms of poverty, fight inequalities, and tackle climate change, while ensuring that no one is left behind. The SDGs build on the success of the Millennium Development Goals (MDGs) and aim to go further to end all forms of poverty and attain higher levels of development.

India has adopted the SDG framework and is committed to achieving the goals by 2030. Andhra Pradesh has aligned its development agenda with SDGs and is on its path to achieve the goals in the envisaged timeframe. It is planned to design this dashboard in such a way that it presents snapshots of the current status, and comparisons at the state and district levels.

This dashboard follows the methodology adopted by NITI Aayog in its SDG India Index – Baseline Report 2018.

This first version of the dashboard will be improved over the coming months, with the inclusion of data points which are currently missing and disaggregation of data. It is also planned to align the SDGs with the schemes related to Navaratnalu and other allied activities.

AP Sustainable Development Goals

Downloads

AP SDG Status Report 2019 PDF File Download

This report set year-wise targets to be achieved until 2022, reviewed the progress so far, highlighted focus areas. and released by the Vijay Kumar IAS Planning Secretary GoAP.

AP SDG Status Report 2018 PDF File Download

This report set year-wise targets to be achieved until 2022, reviewed the progress so far, highlighted focus areas. and released by the Hon’ble Chief Minister of AP.

AP SDG Status Report 2017 PDF File Download

This report was released at the High-Level Political Forum on Sustainable Development 2017 progress achieved in its first two years at United Nations headquarters, New York.

AP SDG Status Report 2016 PDF File Download

This first SDG report of the state outlined the baseline values of key indicators, set high-level targets to be achieved by 2019, and presented the strategies to achieve those.

AP SDG Status Report 2015 PDF File Download

The Millennium Development Goals (MDGs) were in force from 2000 to 2015. This report presents a comprehensive picture of the state’ performance in achieving the goals and targets.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: News

Gas Cylinder ఇకపై గ్యాస్‌ సిలిండర్‌ ఫ్రీగానే డెలివరీ చేయబడుతుంది | పూర్తి వివరాలు

February 6, 2023 by bharathi

ఇకపై గ్యాస్‌ సిలిండర్‌ ఫ్రీగానే డెలివరీ చేయబడుతుంది… ప్రజలు ఈ విషయాన్ని గమనించండి..

గ్యాస్ సిలెండర్ డెలివరీ పేరిట జరుగుతున్న దోపిడీని అరికట్టాలని ప్రభుత్వం కంకణం కట్టుకోంది. గ్యాస్ డీలర్లు వినియోగదారుల్ని డెలివరీ ఛార్జీల పేరుతో దోచుకుంటున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో AP రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సోమవారం అనగా జనవరి 30న ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గ్యాస్ ఏజెన్సీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదనేది దాని సారాంశం.

LPG-Gas-Update

అయితే 5 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల మేర దూరం ఉంటే రూ.20లు, గ్యాస్ ఏజెన్సీ నుంచి 15 కిలోమీటర్లు దాటితే ఒక్కో సిలెండర్కు రూ.30ల చొప్పున వసూలు చేయాలని పౌరసరఫరాల శాఖ తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇకనుండి 5 కిలోమీటర్ల లోపు ఎలాంటి అదనపు మొత్తం చెల్లించాల్సినవసరం లేకుండా.. సిలెండర్ రసీదులో ఉన్న రేటు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని రాష్ట్ర ప్రజలకు AP ప్రభుత్వం సూచించింది. అవును, ఇకనుండి కస్టమర్లు 5 కిలోమీటర్ల లోపు ఉంటే కనుక సిలెండర్ డెలివరీ కోసం ప్రభుత్వం నిర్ణించిన నిర్ణీత రుసుము చెల్లిస్తే సరిపోతుంది. ఈ విషయంలో డెలివరీ ఏజెంట్లు డబ్బులు వసూలు చేయాలనీ చూస్తే మాత్రం పిర్యాదులు చేయవచ్చని కూడా సూచించింది. సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు లేదా జిల్లా పౌరసరఫరాల అధికారి లేదా సేల్స్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ తాజా ప్రకటనలు చెప్పుకొచ్చారు. LPG వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1967 ద్వారా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లలో లేదా ఆయిల్ కంపెనీ టోల్ ఫ్రీ నంబర్ 1800233555కు ఫిర్యాదు చేయవచ్చు.

Gas

సిలిండర్‌ తెచ్చినందుకు అదనపు రుసుము చెల్లించొద్దు

అమరావతి: ఎల్‌పీజీ సిలిండర్‌ ఇంటికి తెచ్చినప్పుడు… రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని, అదనంగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌. అరుణ్‌కు మార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్ణీత పరిధిలో ఉన్నా కూడా కొందరు డీలర్లు, డెలివరీ చేసేవారు అద నపు ఛార్జీలను వసూలు చేస్తున్నారని తరచూ ఫిర్యా దులు అందుతున్నాయని, వారిపై చర్యలు తీసుకుంటా మని ఆయన వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వసూలు చేస్తున్నట్లయితే జిల్లా పౌరసరఫరా లశాఖ అధికారులు, ఇంధన సంస్థల మార్కెటింగ్‌ సిబ్బందికి ఫిర్యాదు చేయాలన్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోని కాల్‌ సెంటర్‌ 1961, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలోని టోల్‌ప్రీ నంబర్‌ 1800 2089555 కి ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.

వంటగ్యాస్‌ సిలిండర్‌ తెచ్చినందుకు చెల్లించాల్సిన రుసుము

అధీకృత డీలర్ కార్యాలయం నుండి దూరం : 5 కి.మీ లోపు

చెల్లించవలసిన రుసుము : చెల్లించాల్సిన పనిలేదు


అధీకృత డీలర్ కార్యాలయం నుండి దూరం : 5 – 15 కి.మీ వరకు 

చెల్లించవలసిన రుసుము : సిలిండర్‌కు రూ.20


అధీకృత డీలర్ కార్యాలయం నుండి దూరం : 15 కి.మీ, ఆ వైన

చెల్లించవలసిన రుసుము : సిలిండర్‌కు రూ.80


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: News Tagged With: Gas

AP Disha SOS App Download Android, iOS – Disha Act Pdf Telugu

February 4, 2023 by bharathi

AP దిశా SOS యాప్ డౌన్‌లోడ్ ఆండ్రాయిడ్, iOS – దిశా చట్టం Pdf తెలుగు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల భద్రత మరియు భద్రత కోసం ‘దిశా యాప్’ని ప్రవేశపెట్టారు. AP దిశ యాప్ సేవలు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజమండ్రిలో ప్రత్యేక కార్యక్రమంలో ఈ యాప్‌ను ఆవిష్కరించనున్నారు. పోలీసులు, ఆరోగ్య శాఖ వ్యక్తులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఫోరెన్సిక్ వ్యక్తులు మరియు ఇతర సంబంధిత వ్యక్తులకు ఖచ్చితమైన మార్గదర్శకాలు ఇవ్వబడే దిశ చట్టం కోసం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సిఎం పాల్గొనబోతున్నారు. ఆడిట్ సమావేశంలో హోంమంత్రి మేకోతోటి సుచిత్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.

AP Disha SOS App Download

AP Disha SOS App Download Android, iOS – Disha Act Pdf Telugu

‘దిశా యాప్‌’ అనే విభిన్న యాప్‌ను తీసుకురావాలని అధికారులకు మార్గనిర్దేశం చేసిన ముఖ్యమంత్రి, అందుకు నిధులు మంజూరు చేయడాన్ని ధృవీకరించారు. అదే విధంగా దిశా చట్టం అమలు కోసం ఒక మహిళా IPS అధికారిని అప్పగించడానికి అధికారులను ప్రతిపాదించారు మరియు మొత్తం 18 మహిళా పోలీసు ప్రధాన కార్యాలయాలు IPS నియంత్రణలో ఉంటాయి. దిశా చట్టం కోసం స్టాండర్డ్ వర్కింగ్ మెథడాలజీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అన్ని ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు తెలియజేశారు.

దిశ చట్టం వినియోగం కోసం, మొత్తం 13 జిల్లాల్లో నిబద్ధతతో కూడిన కోర్టులను ఏర్పాటు చేసేందుకు ఆర్థిక మద్దతు కోసం ముఖ్యమంత్రి తక్షణ ఉత్తర్వులు ఇచ్చారు. కోర్టుల నిర్మాణానికి అవసరమైన మొత్తాన్ని ఏడు రోజుల్లోగా జమ చేయాలని ఆయన అధికారులను కోరారు. ఒక్కో కోర్టుకు రూ.2 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రస్తావించారు. 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ల అవసరాన్ని అధికారులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు.

Download AP Disha SOS App For Android

దిశా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా భద్రత మరియు స్థానం వైపు ఒక అడుగు.. దిశ SOS సేవలు మహిళలు మరియు పౌరులకు అత్యవసర పరిస్థితుల్లో సహాయపడతాయి. DISHA యాప్ సమీపంలోని భద్రతా స్థలాలు, సమీపంలోని పోలీస్ స్టేషన్‌లు, సమీపంలోని ఆసుపత్రులు మరియు ఉపయోగకరమైన పరిచయాల వంటి అవసరమైన సమాచారంతో కూడా అనుసంధానించబడింది.దిషా ప్రతి వినియోగదారు కోసం ట్రాకింగ్ భద్రతా ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ APP మీకు అత్యవసర సహాయం మరియు మద్దతు పొందడానికి డయల్ చేయగల ఫోన్ నంబర్‌లను కూడా అందిస్తుంది. DISHA హెల్ప్‌లైన్ నంబర్‌ల వంటి లింక్‌లను కూడా కలిగి ఉంది. ఈ APP మహిళలు మరియు పౌరులకు మరింత భద్రత కల్పిస్తుందని మరియు నేరాల రేటును తక్కువగా చేస్తుందని మనము ఆశిద్దాం.

Disha-SOS

‘దిశ’ యాప్‌లోని ముఖ్యాంశాలు ఇవీ..

❖ ఇంటర్నెట్‌ ఉన్నా.. లేకపోయినా యాప్‌ పనిచేస్తుంది.

❖ ఫోన్‌లో యాప్‌ని తెరిచి ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే ఆ ఫోన్‌ లొకేషన్‌ వివరాలు, ఆ ఫోన్‌ నెంబరు ఎవరి పేరు మీద ఉంది, చిరునామా వంటి వివరాలన్నీ పోలీసు కంట్రోల్‌ రూంకి వెళతాయి.

❖ ఫోన్‌ లొకేషన్‌, 10 సెకన్ల నిడివిగల వీడియో, ఆడియో కూడా కంట్రోల్‌ రూంకి చేరతాయి. బాధితురాలు ఎక్కడున్నారో, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేసేందుకు వీడియో, ఆడియో ఉపయోగపడతాయి.

❖ ఈ యాప్‌లో ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ అని ఒక ఆప్షన్‌ ఉంది.

❖ ఉదాహరణకు ఒక మహిళ విజయవాడలో బెంజ్‌సర్కిల్‌ నుంచి బస్టాండ్‌కి ఆటో లేదా క్యాబ్‌లో వెళుతుంటే.. ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ ఆప్షన్‌లో బయల్దేరిన ప్రాంతం, గమ్యం నమోదుచేయాలి. ఆ మహిళ వెళుతున్న మార్గాన్ని కంట్రోల్‌ రూం నుంచి గమనిస్తారు. నమోదుచేసిన మార్గంలో కాకుండా, ఆటో మరో మార్గంలోకి వెళ్తే వెంటనే పోలీసు కంట్రోల్‌ రూంని, స్థానికంగా ఉన్న పోలీసుస్టేషన్‌ను అప్రమత్తం చేస్తూ సందేశం వెళుతుంది.

❖ ఆపదలో ఉన్నప్పుడు అత్యవసర సమాచారం పంపేందుకు కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల ఫోన్‌ నంబర్లను యాప్‌లో నమోదు చేయవచ్చు. ఐదు నంబర్లు నమోదు చేసేందుకు వీలుంటుంది. ఎస్‌ఓఎస్‌ సందేశం పంపినా, ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ ఆప్షన్‌ వినియోగించినప్పుడు వాహనం దారితప్పి వెళుతున్నా.. పోలీసులతో పాటు, ఈ ఐదు నంబర్లకూ సందేశం వెళుతుంది.

❖ ఆపదలో ఉన్నవారు యాప్‌లో ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కగానే.. ఆ సమాచారాన్ని వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్‌కి, అక్కడికి దగ్గర్లో ఉన్న పోలీసు రక్షక వాహనాలకు కంట్రోల్‌ రూం నుంచి ఆటోమేటిక్‌ కాల్‌ డిస్పాచ్‌ విధానంలో పంపిస్తారు.

❖ జీపీఎస్‌ అమర్చిన పోలీసు రక్షణ వాహనాల్లో ‘మొబైల్‌ డాటా టెర్మినల్‌’ ఉంటుంది. వాహనం ఉన్న ప్రాంతం నుంచి ఆ సందేశం వచ్చిన ప్రాంతం వరకు రూట్‌ మ్యాప్‌ అందులో కనిపిస్తుంది. దాన్ని అనుసరించి ఆ వాహనం ఆ ప్రదేశానికి చేరుకోవచ్చు.

❖ యాప్ ద్వారా 100/112 నంబర్లకూ సహాయం కోసం ఫోన్‌ చేయవచ్చు.

❖ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్‌ నంబర్లు, సమీపంలోని పోలీసుస్టేషన్ల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయి.❖ ఈ యాప్‌ని ప్రధానంగా మహిళల కోసమే ఉద్దేశించినా, ఆపదలో ఉన్న వృద్ధులూ దీన్ని ఉపయోగించవచ్చు.

❖ వైద్యసేవలు అవసరమైనప్పుడు యాప్‌ ద్వారా దగ్గర్లోని మెటర్నిటీ, ట్రామా కేర్‌ సెంటర్లు, ఇతర ఆస్పత్రులు, బ్లడ్‌ బ్యాంకులు, ఫార్మసీలు వంటి వాటి వివరాలు తెలుసుకోవచ్చు.

❖ ఇంకా ఈ యాప్‌లో సమీపంలోని సురక్షిత ప్రదేశాల వివరాలు, బాధితులు ఉన్న ప్రదేశం నుంచి సమీపంలోని పోలీసు స్టేషన్లకు, సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు మార్గసూచి (నావిగేషన్‌)లు, పోలీసు డైరెక్టరీ, అత్యవసర సమయాల్లో ఫోన్‌ చేయాల్సిన నంబర్లు, సామాజిక మాధ్యమాలు, రోడ్డు భద్రత వంటి ఆప్షన్లు పొందుపరిచారు.

ఫోరెన్సిక్ ల్యాబ్‌ల సామర్థ్యాన్ని నాలుగు రెట్లు బలోపేతం చేసేందుకు, విశాఖపట్నం మరియు తిరుపతిలో మరో రెండు ఫోరెన్సిక్ ల్యాబ్‌లను నిర్మించాలని ముఖ్యమంత్రి ధృవీకరించారు. కొత్త ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో సిబ్బందికి 176 పోస్టులు అవసరమని డీజీపీ సూచించారని, జనవరి 1న నోటిఫికేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు.

దిశ చట్టం అమలుకు, మహిళా పోలీస్ స్టేషన్ల అప్‌గ్రేడేషన్‌కు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడంపై ముఖ్యమంత్రి ఆసక్తి చూపారు. 1 డీఎస్పీ, 3 ఎస్‌ఐలు, 4 మంది కేర్ సిబ్బందితో 18 మహిళా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఏర్పాటు చేయాలనే డీజీపీ ప్రతిపాదనను ఆయన ధృవీకరించారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని ఫౌండేషన్ కార్యాలయాలకు ఆస్తుల ప్రదానానికి ముఖ్యమంత్రి అంగీకరించారు.

ప్రతి ప్రాంతంలో ఏర్పాటు చేసిన వన్‌స్టాప్‌ కేంద్రాలను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, ప్రస్తుత సిబ్బందితో పాటు ఒక మహిళా ఎస్‌ఐని నియమించాలని ఆదేశించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఫిర్యాదు చేసేందుకు సురక్ష స్పందన యాప్‌ని ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. దీని ద్వారా 86 సేవలు అందుబాటులోకి వస్తాయని, త్వరలో యాప్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. ఇది 100, 112 సంఖ్యలను ఏకీకృతం చేయడానికి ఎంపిక చేయబడింది.

AP DISHA Act. Salient Features – దిశ చట్టం. విశిష్ట లక్షణాలు

AP DISHA Act Salient Features

దిశ చట్టంలో ప్రత్యేకతలు

మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో ఐపీసీ ౩354 ఎఫ్‌, 354 జి సెక్షన్లను అదనంగా చేర్చారు.

ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 పని రోజుల్లో విచారణ పూర్తి

దిశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు

దర్యాప్తు కోసం రాష్ట్రంలో 18 ప్రత్యేక దిశ పోలీస్‌ స్టేషన్లు

ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా దిశ కోర్టులు

13 మంది ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం

రేప్‌, గ్యాంగ్‌ రేప్‌లకు పాల్పడితే ఉరిశిక్ష

చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవితఖైదు

సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియాలో మహిళలను వేధిస్తే మొదటిసారి

రెండేళ్లు జైలు శిక్ష, రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష

అత్యాచారం కేసుల్లో శిక్ష పడిన దోషులు అప్పీలు చేసుకునే గడువు 180 రోజుల నుంచి 45 రోజులకు కుదింపు

మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారి వివరాలను అందరికీ తెలిసేలా డిజిటల్‌ (ఆన్‌లైన్‌) రిజిస్టర్‌లో నమోదు చేస్తారు

మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఆధునికీకరణ

తిరుపతి, విశాఖపట్నంలో రెండు డీఎన్‌ఏ సెంటర్లు

బయాలజీ, సెరాలజీ, సైబర్‌ ల్యాబ్‌లు

దిశ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే వారికి ౩0 శాతం ప్రత్యేక అలవెన్సు

కేసుల దర్యాప్తునకు నెలకు రూ.లక్ష

రాష్ట్రంలో మహిళా పోలీస్‌ స్టేషన్ల అవ్‌గ్రేడేషన్‌. ఒక డీఎస్సీ, మూడు ఎస్‌ఐ పోస్టులు మంజూరు

బాధితుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో గైనకాలజీ పోస్టుల భర్తీ

అన్యాయానికి గురైన మహిళ రాష్ట్రంలో ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్‌ఐఆర్‌ సౌకర్యం.

Note : AP శాసనసభ ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం, 2019 (ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం 2019)ని ఆమోదించింది.

దిశ చట్టం :

  • అత్యాచారం మరియు సామూహిక అత్యాచారం వంటి నేరాలకు మరణశిక్ష విధించాలని మరియు అటువంటి కేసుల విచారణను 21 రోజుల్లోగా వేగవంతం చేయాలని బిల్లు అందిస్తుంది.
  • ఈ చట్టం ఏడు రోజుల్లో దర్యాప్తును పూర్తి చేసి, 14 పని దినాలలో విచారణను పూర్తి చేయాలని, తగిన నిశ్చయాత్మక సాక్ష్యం ఉన్న చోట, మొత్తం తీర్పు సమయాన్ని ప్రస్తుత నాలుగు నెలల నుండి 21 రోజులకు తగ్గించాలని చట్టం భావిస్తోంది.
  • AP దిశ చట్టం పిల్లలపై ఇతర లైంగిక నేరాలకు జీవిత ఖైదును కూడా నిర్దేశిస్తుంది మరియు IPCలోని సెక్షన్ 354 F మరియు 354 Gలను కలిగి ఉంటుంది.
  • సోషల్ లేదా డిజిటల్ మీడియా ద్వారా మహిళలపై వేధింపులకు పాల్పడిన కేసుల్లో, మొదటి నేరానికి రెండేళ్లు జైలు శిక్ష, రెండవ మరియు తదుపరి నేరారోపణలకు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తుంది.
  • దీని కోసం, IPC, 1860లో కొత్త సెక్షన్ 354 E జోడించబడుతుంది.

Click here for Download AP DISHA ACT 2019 PDF


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: News

  • « Previous Page
  • 1
  • …
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • Next Page »

Recent Posts

  • Sachivalayam Aadhar Camps in August 2023 | ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు
  • ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు 2022 జులై DA ప్రకటన | ఏ బేసిక్‌ వారికి ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి
  • ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhan Mantri Mudra Yojana) – PMMY | Updates
  • తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు | Central Government Schemes in Telangana Villages
  • Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం
  • YSR NethaAnna Nestham (BENEFICIARY OUT REACH APP) Full Detailed Process
  • YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల తేదీ ఖరారు
  • పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం 2023 | PM Vishwakarma Kaushal Samman Scheme 2023
  • Ammavodi Payment Status Checking -2023 | అమ్మఒడి చెల్లింపు స్థితి తనిఖీ -2023
  • బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Central Government Has Brought the Pradhan Mantri Tractor Yojana Scheme
  • PM Tractor Yojana 2023: కేంద్రం గొప్ప పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. అర్హులెవరు.. దరఖాస్తు ఎలా.. మొత్తం డీటెయిల్స్ ఇవే..
  • వాలంటీర్ల హాజరు రిపోర్ట్ | Volunteers Attendnace Report
  • AP: CM సంచలన నిర్ణయం: పెన్షన్@ రూ. 4,000.!? Volunteers Salary Increased to Rs.10,000/- ?
  • వైయస్సార్ పెళ్లి | YSR Pelli Kaanuka Important Update
  • విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు | Rice Card for Divorced Single Persons
  • YSR Pension Kanuka Hike
  • ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • YSR CHEYUTHA scheme 2023-24
  • Ammavodi-2023 – eKYC | అమ్మఒడి-2023 – ఇకెవైసి
  • ఖరీఫ్ సీజన్ : పంట నమోదు ఫారం | Kharif Season : Crop Registration Form
  • వైఎస్సార్ వాహన మిత్ర 2023-24 సంవత్సరానికి సంబంధించి GO విడుదల | YSR Vahana Mitra GO release for the year 2023-24
  • వాలంటీర్ల గౌరవ భృతి సమాచారం | Honorarium information for volunteers
  • వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ | Documents required for fresh registration of YSR signature
  • వైఎస్సార్ కళ్యాణమస్తు 3వ విడత అప్డేట్ | YSR Kalyanamastu 3rd installment update
  • YSR Pension Kanuka Details (వైఎస్ఆర్ పెన్షన్ కానుక వివరాలు)
  • Jagananna Suraksha (జగనన్న సురక్ష)
  • AP Mission Vatsalya | ఆంధ్రప్రదేశ్-మిషన్ వాత్సల్య | అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు
  • Mission Vatsalya Scheme Date Extended | మిషన్ వాత్సల్య పథకం గడువు పొడిగింపు
  • Jagananna Vasathi Deevena 2023 Date Fixed | Starts in Ananthapur | జగనన్న వసతి దీవెన 2023 అనంతపురంలో ప్రారంభమవుతుంది
  • YSR PENSION KANUKA & AASARA Key Contacts | HelpLine Numbers District
  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2026 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in