Navaratnalu

  • Contact us

FD Rates Hike: గుడ్ న్యూస్ఎ | ఫ్‌డీ రేట్లు పెంచిన బ్యాంకులు

February 20, 2023 by bharathi

బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి సీనియర్ సిటిజన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) డిపాజిట్ లిమిట్‌ను రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో వివిధ బ్యాంకులు టర్మ్ డిపాజిట్లపై అధిక రేట్లను ఆఫర్ చేస్తూ సీనియర్ సిటిజన్స్‌ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.

FD Rates Hike Lucky Chance For Senior Citizens With Increase In SCSS Limit Banks Hiked FD Rates Know Details Here

ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్-2023ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి సీనియర్ సిటిజన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) డిపాజిట్ లిమిట్‌ను రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

దీంతో వివిధ బ్యాంకులు టర్మ్ డిపాజిట్లపై అధిక రేట్లను ఆఫర్ చేస్తూ సీనియర్ సిటిజన్స్‌ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆర్బీఐ కీలక రెపో రేటు‌ను వరుసగా పెంచుతుండడం కూడా బ్యాంకులకు కలిసి వస్తోంది. బడ్జెట్ అనంతరం సీనియర్ సిటిజన్స్ కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకుల వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్‌ను ఆకర్షించేలా వివిధ కాలపరిమితి ఎఫ్ డీలపై వడ్డీరేట్‌ను పెంచింది. 1-2 ఏళ్ల కాలపరిమితి తో కూడిన రూ. 2 కోట్ల కంటే తక్కువ నాన్-కాలబుల్ డిపాజిట్లపై తాజాగా 7.25% వడ్డీని ఆఫర్ చేస్తోంది. 444 రోజుల స్పెషల్ కాలబుల్ డిపాజిట్‌పై 7.85%, నాన్ – కాలబుల్ డిపాజిట్లపై 8.1% వడ్డీని సీనియర్ సిటిజన్స్ కోసం తాజాగా ఆఫర్ చేస్తోంది. తాజా వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చాయి.

* ఎస్‌బీఐ

దిగ్గజ ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్స్ కోసం కొత్త ఎఫ్‌డీ పథకాన్ని ప్రకటించింది. ఎస్‌బీఐ అమృత కలాష్ పేరుతో కొత్త కాలపరిమితి డిపాజిట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. 400 రోజుల కాలపరిమితితో కూడిన ఈ డిపాజిట్ ద్వారా సీనియర్ సిటిజన్స్ 7.6శాతం వడ్డీని పొందనున్నారు.

* యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ..

ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్‌కు 1001రోజుల డిపాజిట్లపై 9.5% వరకు వడ్డీని తాజాగా ఆఫర్ చేస్తోంది. 501 రోజులు, 181-201 రోజుల కాలపరిమితి ఎఫ్‌డీలపై 9.25% వడ్డీని అందిస్తోంది.

* జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సైతం సీనియర్ సిటిజన్స్ కోసం ఎంపిక చేసిన కొన్ని ఎఫ్‌డీలపై వడ్డీ రేటును పెంచింది. 2-3 ఏళ్ల కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సీనియర్ సిటిజన్స్‌కు తాజాగా 8.8% వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇక, 3-5 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లపై 8.05%, 1-2 సంవత్సరాల డిపాజిట్లపై 8.2% వడ్డీని తాజాగా అందిస్తోంది.

బంధన్ బ్యాంక్ ..

ఈ బ్యాంక్ తాజాగా సీనియర్ సిటిజన్స్ కోసం ఎంపిక చేసిన వివిధ కాలపరిమితి ఎఫ్‌డీలపై వడ్డీరేటును పెంచింది. 600 రోజుల డిపాజిట్ పై సీనియర్ సిటిజన్స్‌కు తాజాగా 8.5% వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 3-5 సంవత్సరాల కాలపరిమితి డిపాజిట్లపై 7.5% వడ్డీని అందిస్తోంది.

ఏది బెటర్ అంటే?
కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ ద్వారా సీనియర్ సిటిజన్స్‌కు అనేక ప్రయోజనాలను కల్పించింది. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోల్చితే ఇది మరింత మెరుగైంది. ప్రస్తుతం, ఎస్‌సీఎస్‌ఎస్ వడ్డీ రేటు 8%గా ఉంది. అంతేకాకుండా, SCSS ఖాతా పెట్టుబడులకు గ్యారెంటీ ఉంటుంది. అదే FD విషయంలో కేవలం రూ.5 లక్షల వరకు మాత్రమే హామీ ఉంటుంది. SCSSలో పెట్టుబడికి ఆదాయ పన్ను సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు సైతం ఉంటాయి.

Filed Under: Bank

Jagananna Vidya Kanuka Kits Best Quality Students | సీఎం జగన్‌ ఆదేశాలు.. మేలిమి ‘కానుక’

February 20, 2023 by bharathi

విద్యార్థులకు అత్యుత్తమంగా ‘జగనన్న విద్యాకానుక’ | ఖరీదైన బ్యాగ్, సౌకర్యవంతమైన బూట్లు.. ఆకర్షణీయంగా చెక్స్‌ యూనిఫామ్‌.. పెరిగిన క్లాత్‌ పరిమాణం | బెల్టుల బాధ్యత స్పోర్ట్స్‌ ఉపకరణాల తయారీ సంస్థకు | 6, 7, 9 విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో ద్విభాషా పాఠ్య పుస్తకాలు | ఇప్పటికే మొదలైన ముద్రణ.. 24 నుంచి జిల్లా పాయింట్లకు | రూ.1,042.53 కోట్లతో 40 లక్షల మందికిపైగా విద్యార్థులకు కిట్లు | జేవీకే వస్తువుల నాణ్యత, అమలు తీరుపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి

jagananna-vidya-kanuka-kits-best-quality-students-2

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని ఇనుమడింపచేస్తూ అందచేస్తున్న జగనన్న విద్యా కానుక (జేవీకే) కిట్లను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మరింత నాణ్యతతో, సకాలంలో సమకూర్చేలా విద్యా­శాఖ సన్నద్ధమైంది. రూ.1,042.53 కోట్ల వ్యయంతో 40 లక్షల మందికిపైగా విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందించేలా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి సరఫరాదారులందరికీ ఇప్పటికే వర్క్‌ ఆర్డర్లు ఇచ్చారు. ఈసారి విద్యా­ర్థులకు మరింత మన్నికతో కూడిన నాణ్యమైన బ్యాగ్‌లు, బూట్లను అందించనున్నారు. యూని­ఫామ్‌ను ప్లెయిన్‌ క్లాత్‌ కాకుండా ఆకర్షణీయంగా రంగు రంగుల చెక్స్‌ డిజైన్‌తో రూపొందించారు. దుస్తులు కుట్టే సమయంలో సమస్యలు ఎదురు కాకుండా యూనిఫామ్‌ క్లాత్‌ను అదనంగా పెంచారు.

ఇక పాఠ్య పుస్తకాలు, వర్క్‌ బుక్స్‌ ముద్రణ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా ఈనెల 24వ తేదీ నుంచి జిల్లా పాయింట్లకు పంపిణీ మొదలవుతుంది. స్కూళ్లు తెరిచే రోజే వీటిని విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతు­న్నాయి. ప్రభుత్వ పాఠశా­లల పట్ల పెరుగుతున్న ఆదరణ, ఏటా అదనంగా చేరుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఐదు శాతం అదనపు బఫర్‌తో ప్రభుత్వం 5.06 కోట్ల పాఠ్యపుస్తకాలను ముద్రిస్తుండటం గమనార్హం.

విద్యాకానుక ద్వారా అందించే ప్రతి ఒక్క వస్తువు నాణ్యతను స్వయంగా పరిశీలిస్తూ ఓ మేనమామలా ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విషయం తెలిసిందే. మూడున్నరేళ్లుగా జేవీకే అమలు తీరును గమనిస్తూ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా మార్పు చేర్పులను సూచిస్తున్నారు.

► స్థానిక మార్కెట్లో సుమారు రూ.650 విలువ చేసే నాణ్యమైన బ్యాగులను సరఫరా చేసేందుకు మంజీత్‌ ప్లాస్టిక్‌ ఇండస్ట్రీస్, కోర్స్‌ ఇండియా లిమిటెడ్, అభిలాష కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఎక్స్‌వో ఫుట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, వినిష్మా టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేసి ఆర్డర్లు ఇచ్చారు. స్వే్కర్‌ టైపులో పెద్ద బ్యాగులు రీ డిజైన్‌ చేశారు.

►యూనిఫామ్‌కి సంబంధించి బాలికల టాప్, బాలుర షర్ట్‌లను ప్లెయిన్‌ క్లాత్‌ నుంచి చెక్స్‌ (గడులు) రూపంలోకి మార్పు చేశారు. దుస్తులు కుట్టే సమయంలో సమస్యలు ఎదురు కాకుండా క్లాత్‌ పరిమాణాన్ని కూడా దాదాపు 20 శాతం పెంచారు. మఫత్‌లాల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్, నందన్‌ డెనిమ్‌ లిమిటెడ్, కంచన్‌ ఇండియా లిమిటెడ్, అరవింద్‌ కాట్సిన్‌ ఇండియా లిమిటెడ్, పదమ్‌ చంద్‌ మిలాప్‌చంద్‌ జైన్‌ సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేశారు. యూనిఫామ్‌ వస్త్రం మరో 50 రోజుల్లో జిల్లాలకు సరఫరా మొదలు కానుంది.

►బూట్లు మరింత కాంతివంతంగా (షైనింగ్‌) ఉండేలా చర్యలు చేపట్టారు. సరఫరాదారులు పాత మెటీరియల్‌ వాడకుండా నియంత్రించారు. డైమండ్‌ ఫుట్‌కేర్‌ ఉద్యోగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మంజీత్‌ ప్లాస్టిక్‌ ఇండస్ట్రీస్, ఎక్స్‌ఓ ఫుట్‌ వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, పవర్‌ టెక్‌ ఎలక్ట్రో ఇన్ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్, లెహర్‌ పుట్‌వేర్‌ లిమిటెడ్‌ సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేసి పంపిణీ ఆర్డర్లు ఇచ్చారు.

►అటల్‌ ప్లాస్టిక్స్, ఓం స్పోర్ట్స్‌ సంస్థలను బెల్టుల తయారీకి టెండర్ల ద్వారా ఎంపిక చేశారు.

►ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలను ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ప్రెస్‌కి గతంలో మాదిరిగా నామినేషన్‌ ప్రాతిపదికన అప్పగించారు.

►1 నుంచి 9వ తరగతి వరకు బైలింగ్వుల్‌ పాఠ్య పుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా 6, 7, 9 తరగతుల విద్యార్థుల కోసం ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో బైలింగ్వుల్‌ పాఠ్య పుస్తకాలు ముద్రిస్తున్నారు. తమిళనాడు న్యూ ప్రింట్‌ పేపర్స్‌ లిమిటెడ్‌ కాగితాన్ని సరఫరా చేస్తోంది. 40 లక్షల మందికిపైగా విద్యార్థులకు రెండు సెమిస్టర్ల విధానంలో పుస్తకాలు తయారు చేస్తున్నారు. దాదాపు 4.83 కోట్ల పుస్తకాలు ముద్రించి అందించనున్నారు.

►ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అదనపు విద్యార్థుల కోసం 5 శాతం అదనపు బఫర్‌తో ప్రభుత్వం 5.06 కోట్ల పాఠ్యపుస్తకాలను ముద్రిస్తోంది.

►అన్ని మీడియం పాఠశాలలకు బైలింగ్వుల్‌ పుస్తకాలు అందించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో చదివే విద్యార్థులకు తెలుగు, ఆంగ్లంలో ద్విభాషా పాఠ్య పుస్తకాలు అందిస్తారు. ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉర్దూ, ఇంగ్లీష్‌లలో ద్విభాషా పాఠ్య పుస్తకాలను సరఫరా చేయనున్నారు. బెలింగ్వుల్‌ పుస్తకాలు 5 భాషల్లో (తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం) ముద్రించనున్నారు. 9వ తరగతికి కొత్తగా ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ పుస్తకాలను 2023–24లో పరిచయం చేస్తున్నారు.

►2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు, వర్క్‌ బుక్స్‌ ముద్రణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 88 ప్రింటర్లకు ఈ పనులు అప్పగించారు. 14,611 మెట్రిక్‌ టన్నుల ఇన్‌సెట్‌ పేపర్, 1,401 మెట్రిక్‌ టన్నుల టైటిల్‌ కవర్‌ పేపర్‌ సరఫరా కోసం తమిళనాడు న్యూ ప్రింట్‌ – పేపర్స్‌ లిమిటెడ్‌కి ఆర్డర్లు ఇచ్చారు. సంస్థ పేపర్‌ సరఫరా చేస్తుండడంతో ప్రింటింగ్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి.

►ఈనెల 24వ తేదీ నుంచి జిల్లా పాయింట్లకు పుస్తకాల పంపిణీ ప్రారంభమవుతుంది. మే 31వ తేదీకల్లా అన్ని స్కూల్‌ పాయింట్లకు పుస్తకాలు చేరేలా చర్యలు చేపట్టారు.

►పాఠ్య పుస్తకాలు వర్కు బుక్కులు స్కూళ్లు తెరిచే రోజే విద్యార్ధులకు అందించనున్నారు.

jagananna-vidya-kanuka-kits-best-quality-students

గోదాముల్లో ఆకస్మిక తనిఖీలు

జగనన్న విద్యా కానుక ద్వారా అందచేసే కిట్లలో నాణ్యత తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు ఎప్పటికప్పుడు ప్రతి దశలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించారు.

పాఠ్య పుస్తకాల సంచాలకులు రవీంద్రనాథ్‌రెడ్డి, సమగ్ర శిక్ష రాష్ట్ర అదనపు సంచాలకులు డా. కె.వి.శ్రీనివాసులురెడ్డితో కలసి వివిధ ముద్రణ కేంద్రాలు, గోదాముల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మరింత నాణ్యమైన కిట్లను సకాలంలో అందించేలా చర్యలు చేపట్టినట్లు ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపారు.

Filed Under: Jagananna Vidya Kanuka

ఏపీలో 12 వేలు దాటిన ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య | AP IS IN 2ND PLACE IN SINGLE TEACHER SCHOOLS

February 20, 2023 by bharathi

AP IS IN 2ND PLACE IN SINGLE TEACHER SCHOOLS

ap-is-in-2nd-place-in-single-teacher-schools

ఏపీలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరుగుతోంది. మొత్తం ఏకోపాధ్యాయ బడులు 12 వేలు దాటాయి. 2017తో పోలిస్తే 4,900 ఏకోపాధ్యాయ స్కూళ్ల పెరుగుదలతో.. మధ్యప్రదేశ్ తర్వాత దేశంలో ఏపీ రెండో స్థానానికి చేరింది.

Filed Under: Schools

రైతులకు తీపి కబురు | రూ.5 లక్షల వరకు వడ్డీ రహిత రుణం!

February 20, 2023 by bharathi

రైతు లేనిదే ఏ దేశం కూడా వృద్ధిలోకి రాలేదు. రైతు బాగుంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే భారతదేశంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తారు. కేటాయింపులు, నిధుల విషయంలో రైతులకు ప్రాధాన్యత కల్పిస్తుంటారు.

details-about-karnataka-government-short-term-loans-for-farmers

రైతులే దేశానికి వెన్నెముక అని అందరికీ తెలిసిందే. పారిశ్రామికంగా, సాంకేతికంగా ఎంత ఎదిగినా రైతన్న లేనిదే ప్రజల ఉనికే ఉండదు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ సంక్షేమ పథకాలు తర్వాత రైతులకే పెద్దపీట వేస్తాయి. నిధులు, కేటాయింపుల్లో రైతులకు ప్రధాన్యత ఇస్తూ ఉంటాయి. అలాగే పలు రాష్ట్రాలు కూడా రైతుల కోసం ఎన్నో పథకాలను కూడా అందిస్తున్నాయి.

కేంద్రం నుంచి పీఎం కిసాన్ యోజన, ఏపీలో రైతు భరోసా, తెలంగాణలో రైతు బంధు వంటి పథకాలు ఉన్నాయి. ఇప్పుడు మరోరాష్ట్రం రైతుల మేలు కోసం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. రైతులకు రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నట్లు ప్రకటించింది.

రైతు బాగుంటేనే ఆ దేశం బాగుంటుందని చెబుతుంటారు. అందుకే మన దేశంలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వారికోసం అనేక పథకాలను నిర్వహిస్తున్నారు, కొత్త పథకాలను కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు తాజాగా కర్ణాటక ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది.

వడ్డీ రహిత రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రైతులు రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండానే రుణాలు తీసుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. 2023- 2024 బడ్జెట్ లో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న రూ.3 లక్షల స్వల్పకాలిక రుణ పరిమితిని ఇప్పుడు రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్లు తెలిపింది.

గతంలో ఉన్న రుణపరిమితిని రూ.5 లక్షల వరకు పెంచడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తే రైతులకు వ్యవసాయం కోసం ఎంతో ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెరిగిన రుణ పరిమితి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రానుంది. అంటే ఏప్రిల్ 1 నుంచి రైతులు ఈ రుణాలు పొందవచ్చు.

30 లక్షల వరకు రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం ప్రకటించింది. రూ.25 వేల కోట్ల వరకు రుణాలు మంజూరు చేయచ్చని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు.

Filed Under: Farmers

గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై అదిరిపోయే ఆఫర్లు, భారీ తగ్గింపు | పొందండిలా

February 20, 2023 by bharathi

గ్యాస్ సిలిండర్ ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. సిలిండర్ బుక్ చేయాలంటేనే సామాన్యులు జంకుతున్నారు. అలాంటి వారికి శుభవార్త. సిలిండర్ వాడేవారికి అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

offers-and-discounts-available-on-gas-cylinder-bookings-available

గ్యాస్ సిలిండర్ల ధరలు భగ్గుమంటున్నాయి. పెరిగిన ధరలతో బతుకుజీవుడా అంటూ సామాన్యులు జీవనం సాగిస్తున్నారు. గృహావసరాలకు వినియోగించే 14 కిలోల సిలిండర్ ధర రూ.1,105గా ఉంది. ఈ నేపథ్యంలో మీకో గుడ్‌న్యూస్. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

భారీ తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ల మీద ఏయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బజాజ్ ఫైనాన్స్ యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే సుమారుగా రూ.100 వరకు క్యాష్ బ్యాక్ దక్కుతుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుంది. ఈ నెల 28 వరకే ఈ డీల్ లభిస్తుందని గుర్తుంచుకోవాలి. అయితే తొలిసారి బజాజ్ ఫైనాన్స్ యాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే వారు మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఈ ఆఫర్‌ను పొందేందుకు బజాజ్ పే యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది.


ఎయిర్‌టెల్ కస్టమర్లు కూడా గ్యాస్ సిలిండర్ బుకింగ్ మీద తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకుంటే రూ.20 తగ్గింపు లభిస్తుంది. ఇది కూడా పరిమిత కాల ఆఫర్ అని వినియోగదారులు గుర్తుంచుకోవాలి.

అలాగే అమెజాన్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే కూడా తగ్గింపును పొందొచ్చు. ఐసీఐసీఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకుంటే 2 శాతం క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంది.


ఇంకా పలు స్క్రాచ్ కార్డులను కూడా సొంతం చేసుకోవచ్చు. వీటిల్లో వివిధ రకాల ఆఫర్లు ఉంటాయి. పేటీఎంలో రూ.5 నుంచి రూ.1,000 వరకు తగ్గింపును పొందొచ్చు. ఫ్రీ గ్యాస్ ప్రోమో కోడ్ ను వినియోగిస్తే 100 శాతం వరకు క్యాష్ బ్యాక్ వచ్చే చాన్స్ ఉంది.


గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌కు సంబంధించి పేటీఎంలో మరో ఆఫర్ కూడా ఉంది. మీరు గ్యాస్ 1,000 ప్రోమో కోడ్‌ను ఉపయోగిస్తే.. మీకు రూ.1,000 వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే రూ.5 నుంచి రూ.1,000 లోపు ఎంతైనా రావొచ్చు.


ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. సిలిండర్‌ను ఇలా బుక్ చేసుకుంటే నేరుగా తగ్గింపును పొందొచ్చు. అయితే దీనికి సూపర్ కాయిన్లు ఉండాలి. వీటి ద్వారా సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు. ఉదాహరణకు వినియోగదారుడి దగ్గర 160 సూపర్ కాయిన్లు ఉన్నాయని అనుకుందాం.. అప్పుడు మీరు సిలిండర్ బుక్ చేయాలని భావిస్తే మీకు రూ.40 తగ్గింపు వస్తుంది.

ఇలా మీ దగ్గర ఉన్న సూపర్ కాయిన్ల సంఖ్యను బట్టి డిస్కౌంట్ దొరుకుతుంది. మరి. మీరూ గ్యాస్ సిలిండర్ వాడకందారులైతే ఈ ఆఫర్లు, డిస్కౌంట్లు ఎలా అనిపించాయనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Filed Under: Gas

  • « Previous Page
  • 1
  • …
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • …
  • 55
  • Next Page »

Recent Posts

  • Sachivalayam Aadhar Camps in August 2023 | ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు
  • ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు 2022 జులై DA ప్రకటన | ఏ బేసిక్‌ వారికి ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి
  • ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhan Mantri Mudra Yojana) – PMMY | Updates
  • తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు | Central Government Schemes in Telangana Villages
  • Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం
  • YSR NethaAnna Nestham (BENEFICIARY OUT REACH APP) Full Detailed Process
  • YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల తేదీ ఖరారు
  • పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం 2023 | PM Vishwakarma Kaushal Samman Scheme 2023
  • Ammavodi Payment Status Checking -2023 | అమ్మఒడి చెల్లింపు స్థితి తనిఖీ -2023
  • బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Central Government Has Brought the Pradhan Mantri Tractor Yojana Scheme
  • PM Tractor Yojana 2023: కేంద్రం గొప్ప పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. అర్హులెవరు.. దరఖాస్తు ఎలా.. మొత్తం డీటెయిల్స్ ఇవే..
  • వాలంటీర్ల హాజరు రిపోర్ట్ | Volunteers Attendnace Report
  • AP: CM సంచలన నిర్ణయం: పెన్షన్@ రూ. 4,000.!? Volunteers Salary Increased to Rs.10,000/- ?
  • వైయస్సార్ పెళ్లి | YSR Pelli Kaanuka Important Update
  • విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు | Rice Card for Divorced Single Persons
  • YSR Pension Kanuka Hike
  • ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • YSR CHEYUTHA scheme 2023-24
  • Ammavodi-2023 – eKYC | అమ్మఒడి-2023 – ఇకెవైసి
  • ఖరీఫ్ సీజన్ : పంట నమోదు ఫారం | Kharif Season : Crop Registration Form
  • వైఎస్సార్ వాహన మిత్ర 2023-24 సంవత్సరానికి సంబంధించి GO విడుదల | YSR Vahana Mitra GO release for the year 2023-24
  • వాలంటీర్ల గౌరవ భృతి సమాచారం | Honorarium information for volunteers
  • వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ | Documents required for fresh registration of YSR signature
  • వైఎస్సార్ కళ్యాణమస్తు 3వ విడత అప్డేట్ | YSR Kalyanamastu 3rd installment update
  • YSR Pension Kanuka Details (వైఎస్ఆర్ పెన్షన్ కానుక వివరాలు)
  • Jagananna Suraksha (జగనన్న సురక్ష)
  • AP Mission Vatsalya | ఆంధ్రప్రదేశ్-మిషన్ వాత్సల్య | అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు
  • Mission Vatsalya Scheme Date Extended | మిషన్ వాత్సల్య పథకం గడువు పొడిగింపు
  • Jagananna Vasathi Deevena 2023 Date Fixed | Starts in Ananthapur | జగనన్న వసతి దీవెన 2023 అనంతపురంలో ప్రారంభమవుతుంది
  • YSR PENSION KANUKA & AASARA Key Contacts | HelpLine Numbers District
  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2026 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in