Navaratnalu

  • Contact us

New Rules: NPS విత్‌డ్రాలో మార్పులు.. పాలసీలకు కేవైసీ.. రేపటి నుంచే!

February 23, 2023 by bharathi

New Rules From Jan 1st : కొత్త ఏడాదిలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. లాకర్లకు కొత్త నిబంధనలు, క్రెడిట్‌ కార్డు రివార్డుల్లో మార్పులు వంటివి అందులో ఉన్నాయి.

From January 1 These Rules Will Come into Effect Full Details in Telugu

from-january-1-these-rules-will-come-into-effect-full-details-in-telugu

పాత ఏడాదికి గుడ్‌బై చెప్పి కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. ఇప్పటికే చాలా మంది కొత్త ఏడాదిలో ఏమేం చేయాలో నిర్ణయించుకుని ఉంటారు. ఆర్థిక విషయాల గురించీ ప్రణాళికలు రూపొందించుకుని ఉంటారు. అలాగే కొత్త ఏడాదిలో వచ్చే మార్పులు కూడా పనిలో పనిగా తెలుసుకోండి. బీమా పాలసీల కొనుగోలుకు కేవైసీ,  ఎన్‌పీఎస్‌ పాక్షిక విత్‌డ్రా, క్రెడిట్‌ కార్డు రివార్డ్‌ పాయింట్స్‌ సహా మరికొన్ని మార్పులు రాబోతున్నాయి. అవేంటో చూసేయండి..

అన్ని పాలసీలకూ కేవైసీ
2023 జనవరి 1 నుంచి కొనుగోలు, పునరుద్ధరణ చేసే అన్ని రకాల పాలసీల (జీవిత, ఆరోగ్య, మోటారు, ప్రయాణం, గృహ బీమా)కు ఐఆర్‌డీఏఐ కేవైసీ తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఆరోగ్య బీమాలో రూ.1 లక్ష, అంతకంటే ఎక్కువ క్లెయిం విలువ ఉన్న వినియోగదారులు మాత్రమే కేవైసీ పత్రాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు జీవితేతర లేదా సాధారణ బీమా పాలసీలను తీసుకోవడానికి కేవైసీ పత్రాలు తప్పనిసరి కాదు. అయితే, ఇప్పుడు అన్ని రకాల పాలసీలకు కేవైసీ ఇవ్వాల్సి ఉంటుంది.

ఎన్‌పీఎస్‌ పాక్షిక విత్‌డ్రా రూల్స్‌లో మార్పు
నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేపటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పాక్షిక విత్‌డ్రాల కోసం నోడల్‌ ఆఫీస్‌ ద్వారా రిక్వెస్ట్‌ పంపించాల్సి ఉంటుంది. సపోర్టింగ్‌ డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు పాక్షిక విత్‌డ్రాలకు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇస్తే సరిపోయేది.

లాకర్లకు కొత్త రూల్స్‌..
బ్యాంకు లాకర్లకు సంబంధించి 2022 ఆరంభంలోనే ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వాటిని ఆగస్టు నెలలో సమీక్షించి కొన్ని మార్పులు చేసింది. అవే కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఇప్పటికే లాకర్‌ సదుపాయం తీసుకున్న కస్టమర్లంతా తమ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని బ్యాంకులు సూచించాయి. లాకర్‌ ఒప్పందంలో ఎలాంటి అనైతిక షరతులను చేర్చడానికి వీల్లేదని కొత్త నిబంధనల్లో ఆర్‌బీఐ పేర్కొంది. పూర్తి నిబంధనల కోసం క్లిక్‌ చేయండి..

క్రెడిట్‌ కార్డు రివార్డు పాయింట్స్‌లో కోత
కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చేలా కొన్ని బ్యాంకులు తమ రివార్డు ప్రోగ్రాములో మార్పులు చేశాయి. అమెజాన్‌లో కొన్ని క్రెడిట్‌కార్డులతో కొనుగోళ్లకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గతంలో ఇచ్చిన రివార్డు పాయింట్లలో కోత పెట్టింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సైతం రివార్డు పాయింట్ల రిడీమ్‌ విషయంలో పరిమితులు విధించింది.

కార్ల ధరలు జూమ్‌
టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీ సహా ఆడి, మెర్సిడెస్‌ బెంజ్‌ వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలు సైతం కొత్త ఏడాదిలో ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఉత్పత్తి వ్యయం పెరగడం, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఉద్గార నిబంధనల నేపథ్యంలో ధరలు సవరిస్తున్నట్లు తెలిపాయి. దీంతో పాటు గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లోనూ జనవరి 1న మార్పులు ఉండొచ్చు.

Filed Under: News

Railway Insurance: రైలు ప్రయాణమా.. రూ.10 లక్షల బీమా.. ఈ విషయాలు తెలుసుకోండి!

February 23, 2023 by bharathi

రైలు ప్రయాణం చేసేవారికి రూ.10 లక్షల బీమా సౌకర్యం ఉంటుంది. అయితే, టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే ఆ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

Indian Railway Travel Insurance Full Details in Telugu

indian-railway-travel-insurance-full-details-in-telugu

విహార యాత్ర, శుభకార్యాలు, పుణ్యక్షేత్రాల సందర్శన.. ఇలా జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనం రైలు ప్రయాణం చేస్తుంటాం. 1,10,000 కి.మీ నెట్‌వర్క్‌తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశం భారత్‌. తక్కువ ధరలో అత్యధిక మందికి అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గం ఇది. నిత్యం వేలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు.

ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం భారత రైల్వే విభాగం అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రయాణ సమయంలో ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగితే.. బీమా సదుపాయం కూడా కల్పిస్తోంది.

అయితే, చాలా మంది టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలో ఇన్సూరెన్స్‌ ఆప్షన్‌ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ప్రమాదాల గురించి అప్పుడప్పుడూ వింటూనే ఉన్నా.. బీమా తీసుకోవడంపై మాత్రం పెద్దగా శ్రద్ధ పెట్టరు. కానీ, ఊహించని ప్రమాదం సంభవిస్తే కష్టసమయంలో కుటుంబానికి భరోసా ఉండాలంటే బీమా చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలోనే ఐఆర్‌సీటీసీ ‘ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ’ పేరిట ప్రయాణికులకు బీమా సదుపాయం కల్పిస్తోంది. కేవలం 35 పైసలతో రూ.10 లక్షల బీమా అందిస్తోంది.

  1. ప్రయాణికుడు మరణించినా లేక శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ.10 లక్షల బీమా
  2. పాక్షిక అంగవైకల్యానికి రూ.7.50 లక్షలు
  3. గాయాలపాలైతే ఆసుపత్రి ఖర్చులకు రూ.2 లక్షలు
  4. ప్రమాదవశాత్తూ ప్రయాణికుడు మరణిస్తే మృతదేహ తరలింపు ఖర్చుల కింద రూ.10,000

ఉగ్రవాద దాడులు, దొంగతనం, దోపిడీ, అల్లర్లు, ప్రమాదవశాత్తూ ప్రయాణికుడు రైలు నుంచి పడిపోవడం, రైళ్లు ఢీకొనడం, పట్టాలు తప్పడం.. వంటి ప్రమాదాలన్నింటికీ బీమా వర్తిస్తుంది. అయినప్పటికీ.. టికెట్‌ బుక్‌ చేసుకునే ముందు ఒకసారి బీమా కల్పిస్తున్న సంస్థ నియమ నిబంధనలు, షరతులను క్షుణ్నంగా తెలుసుకోవడం మంచిది.

ఎవరు అర్హులు..

భారత రైల్వేలో ప్రయాణించే ఎవరైనా ఈ బీమా సదుపాయాన్ని పొందొచ్చు. అయితే, ఆన్‌లైన్‌ లేదా మొబైల్‌ యాప్‌లో రిజర్వేషన్‌ చేసుకునే వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. విదేశీయులు, ఐదేళ్లలోపు పిల్లలు బీమా సదుపాయానికి అర్హులు కాదు.

ఇన్సూరెన్స్‌ ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేసుకొని టికెట్‌ బుక్‌ చేసుకుంటే కన్ఫర్మ్‌ అయిన వెంటనే మీ మొబైల్‌, ఇ-మెయిల్‌కు సందేశం వస్తుంది. తర్వాత నామినీ వివరాలు నమోదు చేయడానికి ఓ లింక్‌ను కూడా పంపుతారు. క్యాన్సిల్‌ చేసుకోవడానికి వీలుండదు. ఒకే పీఎన్‌ఆర్‌ కింద చేసుకునే అన్ని బుకింగ్స్‌కు బీమా వర్తిస్తుంది.

ఈ విషయాలు గుర్తుంచుకోవాలి..

  • ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా చేసుకునే బుకింగ్స్‌కు మాత్రమే ఈ బీమా సదుపాయం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ సదుపాయం లేనివారు ఈ సౌకర్యాన్ని పొందలేరు. అలాగే నేరుగా రైల్వేస్టేషన్‌కి వెళ్లి కౌంటర్‌లో టికెట్‌ తీసుకున్నా బీమా ఉండదు.
  • కేవలం భారతీయులకు మాత్రమే ఈ సదుపాయం ఉంది. భారత్‌లో పనిచేస్తున్న లేదా పర్యటిస్తున్న విదేశీయులు బీమా తీసుకోవడానికి వీలులేదు.
  • మరణం, అంగవైకల్యం, గాయాలు.. వీటికి మాత్రమే బీమా వర్తిస్తుంది. లగేజీ చోరీ, రైలు ఆలస్యం వల్ల సంభవించే నష్టం, రైలు ఆలస్యమైనప్పుడు అయ్యే నివాస, భోజన ఖర్చులకు బీమా ఉండదు.
  • ఐఆర్‌సీటీసీ ఎంపిక చేసిన కొన్ని కంపెనీలు మాత్రమే బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. మనకు నచ్చిన సంస్థ నుంచి ఇన్సూరెన్స్‌ తీసుకునే అవకాశం లేదు.

Filed Under: Insurance

LIC on Whatsapp: వాట్సాప్‌లో ఎల్‌ఐసీ సేవల కోసం ఎలా రిజిస్టర్‌ అవ్వాలి?

February 23, 2023 by bharathi

LIC on Whatsapp: పాలసీదారులకు మెరుగైన సేవలందించేందుకు ఓ వాట్సాప్‌ (Whatsapp) నంబర్‌ను LIC అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా 10 రకాల సేవలు పొందొచ్చు.

How To Avail LIC WhatsApp Services in Telugu

how-to-avail-lic-whatsapp-services-in-telugu

జీవిత బీమా రంగ దిగ్గజం లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) పాలసీదారులకు ఎంతగానో ఉపయోగపడే సేవలను ప్రారంభించింది. వాట్సాప్‌ (Whatsapp)లో 10 రకాల సేవలను అందుబాటులోకి తెచ్చింది. పాలసీదారులు ఎల్‌ఐసీ కేటాయించిన వాట్సాప్‌ నంబర్‌కు హాయ్‌ (Hi) అని సందేశం పంపిస్తే చాలు.. సేవలను సులువుగా పొందొచ్చు. ప్రీమియం బకాయిలు, బోనస్‌ సమాచారం వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

పాలసీ వివరాలను ఎల్‌ఐసీ పోర్టల్‌లో నమోదు చేసుకొన్న వారు, తమ  మొబైల్‌ నంబరు నుంచి ఈ సేవలను పొందే వీలుంది. ఇంతకీ ఏయే సేవలు లభిస్తాయి? ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి? వివరాలను ఎలా పొందాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

how-to-avail-lic-whatsapp-services-in-telugu-1

వాట్సాప్‌లో సేవలు ఎలా?

ఎల్‌ఐసీ అధికారిక వాట్సాప్‌ నంబర్‌ 89768 62090ను మీ మొబైల్‌లో సేవ్‌ చేసుకోవాలి.

వాట్సాప్‌ ఓపెన్‌చేసి ఎల్‌ఐసీ చాట్‌ బాక్స్‌లోకి వెళ్లాలి.

HI అని సందేశం పంపగానే.. మీకు 11 ఆప్షన్లు కనిపిస్తాయి.

ప్రీమియం బకాయి తేదీ తెలుసుకోవడానికి 1.. మీ పాలసీపై వచ్చే లోన్‌ వివరాలు తెలుసుకోవడానికి 4 వంటి ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఆప్షన్లివే..

1. ప్రీమియం బకాయి

2. బోనస్‌ సమాచారం

3. పాలసీ స్థితి

4. పాలసీపై వచ్చే రుణ సమాచారం

5. రుణం తిరిగి చెల్లింపు

6. రుణంపై వడ్డీ

7. ప్రీమియం చెల్లింపు సర్టిఫికెట్‌

8. యులిప్‌- యూనిట్ల స్టేట్‌మెంట్

9. ఎల్‌ఐసీ సేవలకు సంబంధించిన లింకులు

10. ఆప్ట్‌ ఇన్‌/ఆప్ట్‌ ఔట్‌ సేవలు

11. సంప్రదింపులు పూర్తిచేయండి.

రిజిస్టర్‌ ఇలా..

ఎల్‌ఐసీ పోర్టల్‌లో నమోదు చేసుకొంటేనే ఈ సేవలను వాట్సాప్‌లో పొందే వీలుంటుంది. ఒకవేళ మీ మొబైల్‌ నంబర్‌ను గానీ, మీ ఎల్‌ఐసీ పాలసీ వివరాలను గానీ నమోదు చేసుకోకపోతే ఈ సేవలను పొందలేరు. ఒకవేళ మీరు రిజిస్టర్‌ చేసుకోకపోయి ఉంటే..

www.licindia.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

అందులో కస్టమర్‌ పోర్టల్‌ ఆప్షన్‌ను ఎంచుకోండి..

మీరు కొత్త యూజర్‌ అయితే New Userపై క్లిక్‌ చేసి పూర్తి వివరాలు నమోదు చేయండి.

ఒకవేళ మీరు పాత యూజర్‌ అయితే యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వండి.

అందులో బేసిక్‌ సర్వీసెస్‌ విభాగంలో యాడ్‌ పాలసీని క్లిక్‌ చేసి ఎన్ని పాలసీలు ఉంటే అన్ని పాలసీల వివరాలు అక్కడ నమోదు చేయొచ్చు.

Filed Under: Bank

Linking PAN with Aadhaar : పాన్‌- ఆధార్‌ అనుసంధానంపై ఐటీశాఖ అలర్ట్‌.. ఇదే లాస్ట్‌ ఛాన్స్‌!

February 23, 2023 by bharathi

PAN- Aadhaar: పాన్‌తో ఆధార్‌ను (PAN- Aadhaar) అనుసంధానం చేసుకోని వారు వెంటనే లింక్‌ చేసుకోవాలని పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ (IT dept) తాజాగా కోరింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని మరోసారి గుర్తుచేసింది.

It Dept Issues Warning About Not Linking PAN with Aadhaar

it-dept-issues-warning-about-not-linking-pan-with-aadhaar

పాన్‌తో ఆధార్‌ను (PAN- Aadhaar) అనుసంధానం చేసుకోని వారు వెంటనే లింక్‌ చేసుకోవాలని పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ (IT dept) తాజాగా కోరింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని మరోసారి గుర్తుచేసింది. లేదంటే పాన్‌ కార్డు నిరుపయోగంగా మారిపోతుందని పేర్కొంది. ఈ మేరకు ఐటీ శాఖ ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. 

‘‘ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని పాన్‌కార్డు హోల్డర్లంతా తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. ఇందుకు 2023 మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఒకవేళ అనుసంధానం పూర్తి చేయకపోతే మీ పాన్‌ నిరుపయోగంగా మారిపోతుంది. గడువు తేదీ దగ్గరపడుతోంది కాబట్టి ఇవాళే అనుసంధానం పూర్తి చేయండి’’ అని తన ట్విటర్‌లో పేర్కొంది.

పాన్‌తో ఆధార్‌ అనుసంధానం పూర్తి చేయాలంటే మీరు వెయ్యి రూపాయలు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే గడువు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పెనాల్టీతో అనుసంధానానికి అనుమతిస్తున్నారు. ఒకవేళ నిర్దేశించిన గడువులోగా ఆ ప్రక్రియ పూర్తి చేయపోతే పాన్‌ నిరుపయోగంగా మారి బ్యాంక్‌ ఖాతాలు గానీ, డీమ్యాట్‌ అకౌంట్‌ గానీ తెరవడానికి సాధ్యపడదు.

it-dept-issues-warning-about-not-linking-pan-with-aadhaar-1

ఎలా చెల్లించాలి..?

పాన్‌- ఆధార్‌ అనుసంధానానికి ముందు మీరు ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసం egov-nsdl.com అనే వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

ఇందుకోసం తొలుత Tax applicable – (0021) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత (500) Other Receipts ఆప్షన్‌ ఎంచుకోవాలి.

తర్వాత పాన్‌, మదింపు సంవత్సరం, పేమెంట్‌ విధానం, అడ్రస్‌, ఇ-మెయిల్‌, మొబైల్‌ నంబర్‌ తదితర వివరాలు ఇవ్వాలి.

క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి పేమెంట్‌ పూర్తి చేయాలి.

ఒకసారి ఈ ప్రక్రియ పూర్తి చేశాక 4-5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో పాన్‌ ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.

Filed Under: PAN

Insurance With ATM Card: మీ ఏటీఎం కార్డుతోనే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌!

February 23, 2023 by bharathi

Insurance With ATM Card: ఏటీఎం కార్డుతో ప్రమాద బీమా లభిస్తుందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. దాదాపు అన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని తమ కస్టమర్లకు కల్పిస్తున్నాయి.

Your ATM Card Comes with NUPTO Rs.10 Lakh Insurance

your-atm-card-comes-with-nupto-rs-10-lakh-insurance

ఏటీఎం వల్ల ఉన్న ప్రయోజనాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, చాలా మందికి తెలియని ఉపయోగం ఒకటి ఉంది. అదే ప్రమాద బీమా (Accidental Insurance Cover). చాలా వరకు బ్యాంకులు ఏటీఎం (ATM)తో పాటు అదనపు ప్రయోజనం కింద ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.

ప్రైవేట్‌ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ సహా దాదాపు అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు డెబిట్‌ కార్డు (Debit Card)తో పాటే ప్రమాద బీమా (Accidental Insurance Cover) సదుపాయాన్ని ఇస్తున్నాయి. బ్యాంకు, కార్డు రకాన్ని బట్టి రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకు బీమా కవర్‌ ఉంటుంది. కొన్ని బ్యాంకులు ప్రమాద బీమాను కూడా కల్పిస్తున్నాయి. ఒకవేళ కార్డుదారునికి ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరితే సంబంధింత పత్రాలతో బ్యాంకును సంప్రదించి బీమా క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

ప్రమాదవశాత్తూ మరణిస్తే క్లెయిం దరఖాస్తుకు డెత్‌ సర్టిఫికెట్‌, శవపరీక్ష నివేదికను జత చేయాల్సి ఉంటుంది. ప్రమాద బీమా (Accidental Insurance Cover)తో పాటు కొన్ని బ్యాంకులు ‘పర్చేజ్‌ ప్రొటెక్షన్‌’ను కూడా అందిస్తున్నాయి. అంటే షాపింగ్‌ చేసేటప్పుడు జరిగే మోసపూరిత లావాదేవీలపై కూడా బీమా పొందొచ్చు.

అయితే, డెబిట్‌ కార్డుపై బీమా క్లెయిం చేసుకోవాలంటే ఒక షరతు ఉంటుంది. కార్డుదారుడు ప్రమాదానికి గురి కావడం లేదా చనిపోవడానికి ముందు 30 రోజుల్లో కనీసం ఒక్కసారైనా కార్డుని ఉపయోగించి ఉండాలి. కొన్ని బ్యాంకుల్లో ఈ గడువు 60, 90 రోజుల వరకు ఉంది.

ఎస్‌బీఐ గోల్డ్‌ (మాస్టర్‌ కార్డ్‌/వీసా) కార్డుపై రూ.రెండు లక్షల ప్రమాద బీమా ఉంది. ఎస్‌బీఐ వీసా సిగ్నేచర్‌ కార్డుపై గరిష్ఠంగా రూ.10 లక్షల బీమా హామీ లభిస్తోంది. మరోవైపు ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ ప్లాటినం డెబిట్‌ కార్డ్‌పై రూ.5 లక్షల బీమా అందజేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ వీసా ప్లాటినం డెబిట్‌ కార్డుపై రూ.50,000 బీమా అందిస్తోంది. గరిష్ఠంగా టైటానియం కార్డుపై రూ.10 లక్షల బీమా ఉంది.

Filed Under: ATM

  • « Previous Page
  • 1
  • …
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • …
  • 55
  • Next Page »

Recent Posts

  • Sachivalayam Aadhar Camps in August 2023 | ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు
  • ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు 2022 జులై DA ప్రకటన | ఏ బేసిక్‌ వారికి ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి
  • ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhan Mantri Mudra Yojana) – PMMY | Updates
  • తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు | Central Government Schemes in Telangana Villages
  • Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం
  • YSR NethaAnna Nestham (BENEFICIARY OUT REACH APP) Full Detailed Process
  • YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల తేదీ ఖరారు
  • పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం 2023 | PM Vishwakarma Kaushal Samman Scheme 2023
  • Ammavodi Payment Status Checking -2023 | అమ్మఒడి చెల్లింపు స్థితి తనిఖీ -2023
  • బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Central Government Has Brought the Pradhan Mantri Tractor Yojana Scheme
  • PM Tractor Yojana 2023: కేంద్రం గొప్ప పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. అర్హులెవరు.. దరఖాస్తు ఎలా.. మొత్తం డీటెయిల్స్ ఇవే..
  • వాలంటీర్ల హాజరు రిపోర్ట్ | Volunteers Attendnace Report
  • AP: CM సంచలన నిర్ణయం: పెన్షన్@ రూ. 4,000.!? Volunteers Salary Increased to Rs.10,000/- ?
  • వైయస్సార్ పెళ్లి | YSR Pelli Kaanuka Important Update
  • విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు | Rice Card for Divorced Single Persons
  • YSR Pension Kanuka Hike
  • ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • YSR CHEYUTHA scheme 2023-24
  • Ammavodi-2023 – eKYC | అమ్మఒడి-2023 – ఇకెవైసి
  • ఖరీఫ్ సీజన్ : పంట నమోదు ఫారం | Kharif Season : Crop Registration Form
  • వైఎస్సార్ వాహన మిత్ర 2023-24 సంవత్సరానికి సంబంధించి GO విడుదల | YSR Vahana Mitra GO release for the year 2023-24
  • వాలంటీర్ల గౌరవ భృతి సమాచారం | Honorarium information for volunteers
  • వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ | Documents required for fresh registration of YSR signature
  • వైఎస్సార్ కళ్యాణమస్తు 3వ విడత అప్డేట్ | YSR Kalyanamastu 3rd installment update
  • YSR Pension Kanuka Details (వైఎస్ఆర్ పెన్షన్ కానుక వివరాలు)
  • Jagananna Suraksha (జగనన్న సురక్ష)
  • AP Mission Vatsalya | ఆంధ్రప్రదేశ్-మిషన్ వాత్సల్య | అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు
  • Mission Vatsalya Scheme Date Extended | మిషన్ వాత్సల్య పథకం గడువు పొడిగింపు
  • Jagananna Vasathi Deevena 2023 Date Fixed | Starts in Ananthapur | జగనన్న వసతి దీవెన 2023 అనంతపురంలో ప్రారంభమవుతుంది
  • YSR PENSION KANUKA & AASARA Key Contacts | HelpLine Numbers District
  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2026 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in