Navaratnalu

  • Contact us

PAN Card: మీకు పాన్ కార్డ్ ఉందా | ఆ తప్పుతో జైలు కెళ్లాల్సిందే | ముందుగా జాగ్రత్త పడండి !

February 24, 2023 by bharathi

PAN Card: ఈ రోజుల్లో అన్నీ డిజిటల్ చెల్లింపులు కావటం వల్ల పాన్ కార్డ్ కంపర్సరీ అయిపోయింది. ప్రభుత్వానికి సంబంధించిన చాలా స్కీమ్స్ కూడా పొందటానికి పాన్ కార్డ్ తప్పక ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో చాలా మంది వాటిని అక్రమాలకు పాల్పడేందుకు సైతం వినియోగిస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ నుంచి తప్పించుకోవటానికి దుర్వినియోగం చేస్తున్నారు.

If You Make This Mistake with Pan Card Will, Be Jailed, Be Careful

దాచాలనుకున్నా దాగదు..?
మనలో చాలా మంది టాక్స్ చెల్లించని వారు ఉంటారు. అయితే వారు చట్టపరంగా టాక్స్ చెల్లించాలా..? చెల్లించాల్సిన అవసరం లేదా..? అనే విషయాన్ని గుర్తించేందుకు పాన్ కార్డ్ ద్వారా అదాయపు పన్ను అధికారులు ట్రాకింగ్ చేస్తుంటారు. పైగా ఈ రోజుల్లో ఆధార్ కార్డు, పాన్ కార్డ్ లను లింక్ చేయాలని కేంద్రం వెల్లడించింది. అలా చేయకపోతే కార్డులు తర్వాత పనిచేయవని వెల్లడించింది. దీని ద్వారా ప్రజలు చేసే అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను ప్రభుత్వం గుర్తిస్తుంది. దీనివల్ల వివరాలను దాచిపెట్టాలన్నా కుదరదు.

జైలుకెళ్లాల్సిందే !
PAN కార్డ్ విషయంలో నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. ఇందులో గుర్తుంచుకోవలసిన అసలు విషయం ఏమిటంటే.. ఒకే వ్యక్తికి రెండు పాన్ కార్డులు అస్సలు ఉండకూడదు. ఒకవేళ గనుక అలా ఉన్నట్లయితే ఆదాయపు పన్ను అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అలాంటి వారిని గుర్తించినప్పుడు రూ.10 వేలు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు.

రెండో కార్డ్ ఏం చేయాలి..?
ఒకవేళ మీ వద్దర కూడా రెండు పాన్ కార్డులు ఉన్నట్లయితే వెంటనే.. రెండో పాన్ కార్డును తిరిగి అందజేయవచ్చని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది .మీరే రెండవ పాన్ కార్డును డిపార్ట్‌మెంట్‌కు అందజేస్తే.. ఎటువంటి జరిమానా ఉండదు. కానీ.. డిపార్ట్‌మెంట్ అధికారులు నిఘాలో పట్టుకుంటే మాత్రం పెద్ద ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

సరండర్ ప్రక్రియ !
వినియోగదారులు తమ అదనపు పాన్‌ను ఆఫ్‌లైన్‌లో సరెండర్ చేయడానికి సమీపంలోని NSDL సేకరణ కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ వారికి PAN కరెక్షన్ ఫారమ్‌ను అందించాలి. అందులో డూప్లికేట్ PAN వివరాలను పొందుపరిచి జూరిడిక్షనల్ అసెస్సింగ్ ఆఫీసర్ కు పాన్ క్యాన్సిల్ చేయాలని అభ్యర్థించాలి. అలా రెండో పాన్ కార్డును క్యాన్సిల్ చేసుకోవచ్చు.

Filed Under: PAN

Linking PAN with Aadhaar : పాన్‌- ఆధార్‌ అనుసంధానంపై ఐటీశాఖ అలర్ట్‌.. ఇదే లాస్ట్‌ ఛాన్స్‌!

February 23, 2023 by bharathi

PAN- Aadhaar: పాన్‌తో ఆధార్‌ను (PAN- Aadhaar) అనుసంధానం చేసుకోని వారు వెంటనే లింక్‌ చేసుకోవాలని పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ (IT dept) తాజాగా కోరింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని మరోసారి గుర్తుచేసింది.

It Dept Issues Warning About Not Linking PAN with Aadhaar

it-dept-issues-warning-about-not-linking-pan-with-aadhaar

పాన్‌తో ఆధార్‌ను (PAN- Aadhaar) అనుసంధానం చేసుకోని వారు వెంటనే లింక్‌ చేసుకోవాలని పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ (IT dept) తాజాగా కోరింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని మరోసారి గుర్తుచేసింది. లేదంటే పాన్‌ కార్డు నిరుపయోగంగా మారిపోతుందని పేర్కొంది. ఈ మేరకు ఐటీ శాఖ ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. 

‘‘ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని పాన్‌కార్డు హోల్డర్లంతా తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. ఇందుకు 2023 మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఒకవేళ అనుసంధానం పూర్తి చేయకపోతే మీ పాన్‌ నిరుపయోగంగా మారిపోతుంది. గడువు తేదీ దగ్గరపడుతోంది కాబట్టి ఇవాళే అనుసంధానం పూర్తి చేయండి’’ అని తన ట్విటర్‌లో పేర్కొంది.

పాన్‌తో ఆధార్‌ అనుసంధానం పూర్తి చేయాలంటే మీరు వెయ్యి రూపాయలు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే గడువు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పెనాల్టీతో అనుసంధానానికి అనుమతిస్తున్నారు. ఒకవేళ నిర్దేశించిన గడువులోగా ఆ ప్రక్రియ పూర్తి చేయపోతే పాన్‌ నిరుపయోగంగా మారి బ్యాంక్‌ ఖాతాలు గానీ, డీమ్యాట్‌ అకౌంట్‌ గానీ తెరవడానికి సాధ్యపడదు.

it-dept-issues-warning-about-not-linking-pan-with-aadhaar-1

ఎలా చెల్లించాలి..?

పాన్‌- ఆధార్‌ అనుసంధానానికి ముందు మీరు ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసం egov-nsdl.com అనే వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

ఇందుకోసం తొలుత Tax applicable – (0021) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత (500) Other Receipts ఆప్షన్‌ ఎంచుకోవాలి.

తర్వాత పాన్‌, మదింపు సంవత్సరం, పేమెంట్‌ విధానం, అడ్రస్‌, ఇ-మెయిల్‌, మొబైల్‌ నంబర్‌ తదితర వివరాలు ఇవ్వాలి.

క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి పేమెంట్‌ పూర్తి చేయాలి.

ఒకసారి ఈ ప్రక్రియ పూర్తి చేశాక 4-5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో పాన్‌ ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.

Filed Under: PAN

PAN: మీకు తెలుసా?.. పాన్‌ విషయంలో ఈ తప్పులకు 10 వేల ఫైన్‌!

February 23, 2023 by bharathi

PAN CARD: మన నిత్య జీవితంలో భాగమైపోయిన పాన్‌ను వినియోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. లేదంటే రూ.10వేలు జరిమానా పడే అవకాశం ఉంటుంది.

Avoid These Mistakes Regarding PAN Card Can Lead to Rs 10k Loss

how-to-remember-pan-card-number

కొత్తగా బైక్‌ కొనాలన్నా.. ఏదైనా ఆస్తి కొనాలన్నా/ అమ్మాలన్నా పాన్‌ (PAN) అవసరం. బ్యాంకు ఖాతా తెరవాలన్నా.. రూ.50వేలు మించి చేసే లావాదేవీలకూ శాశ్వత ఖాతా సంఖ్య తప్పనిసరి. ఉద్యోగి అయినా, వ్యాపారి అయినా పాన్‌ కార్డు సుపరిచితమే.

అయితే, పాన్‌ కార్డు విషయంలో ఈ పొరపాట్లు చేస్తే మాత్రం భారీ జరిమానా చెల్లించాలని మీకు తెలుసా? అయితే ఈ విషయం గుర్తుంచుకోండి. పాన్‌కు సంబంధించి తప్పుడు వివరాలు ఇవ్వడం, రెండేసి కార్డులు కలిగి ఉండడం చట్టరీత్యా నేరం. అందుకు రూ.10వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఐటీ చట్టం, 1961లోని సెక్షన్‌ 272B ప్రకారం.. ఎవరైనా సరే తప్పుడు పాన్‌ వివరాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం. ఇందుకు రూ.10వేలు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని ఐటీ శాఖ చెబుతోంది. ముఖ్యంగా ఐటీ రిటర్నులు దాఖలు, పాన్‌ వివరాలు ఇవ్వాల్సిన ఇతర చోట్లా.. తప్పుడు వివరాలు ఇవ్వడం నేరం. కాబట్టి అంకెలు, సంఖ్యలతో కూడిన పాన్‌ నంబర్‌ను తప్పుగా రాయకుండా చూసుకోండి.

పాన్‌ వివరాలు నింపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. పాన్‌ కార్డుపై మొద‌టి ఐదు ఆంగ్ల అక్షరాలు, తర్వాత నాలుగు అంకెలు, చివర్లో మళ్లీ ఆంగ్ల అక్షరం ఉంటుందని గుర్తుంచుకోండి. ఎక్కువ మంది సున్నా, ఓ (ఆంగ్ల అక్షరం) ఉన్న చోట గుర్తించే క్రమంలో తడబాటుపడుతుంటారు.

రెండు కార్డులున్నాయా?
ఆదాయ పన్ను చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి రెండు పాన్‌కార్డులు కలిగి ఉండటం కూడా చట్టరీత్యా నేరమే. ఆదాయ పన్ను దర్యాప్తులో మీ వద్ద రెండు పాన్‌లు ఉన్నట్లు తేలితే భారీ జరిమానా చెల్లించక తప్పదు. అంతేకాకుండా అధికారులు మీ బ్యాంక్‌ ఖాతాను స్థంభింప చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి మీ వద్ద రెండు పాన్‌కార్టులు కలిగి ఉంటే వెంటనే వెనక్కి ఇచ్చేయండి. ఒక వ్యక్తికి రెండు పాన్‌ కార్డుల ఎలా ఉంటాయనే సందేహం మీకు రావొచ్చు! చాలా మంది పాన్‌కార్డులో ఏదైనా తప్పులు (కరెక్షన్‌లు) ఉంటే దాన్ని సరిదిద్దుకోకుండా కొత్త దాని కోసం అప్లయ్‌ చేస్తుంటారు.

ఇది ఓ రకంగా రెండు పాన్‌ నంబర్లు కలిగి ఉండడానికి దోహదం చేస్తుంది. కార్డు కోసం అప్లయ్‌ చేసినా కొన్ని సందర్భాల్లో వచ్చి ఉండవు. దీంతో కొందరు మళ్లీ అప్లయ్‌ చేస్తుంటారు. కాబట్టి కొత్త పాన్‌ అప్లయ్‌ చేసే ముందు పాన్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవడం మంచింది. మహిళలు పెళ్లి చేసుకున్న తర్వాత వారి ఇంటి పేరు మార్పులో భాగంగా కొత్త పాన్‌ కోసం దరఖాస్తు చేస్తారు. అయితే, పెళ్లి చేసుకున్నాక పాన్‌కార్డులో కరెక్షన్‌లను సరిచేసుకుంటే సరిపోతుంది.

ఇలా వెనక్కి ఇచ్చేయండి..
అఫ్‌లైన్‌లో పాన్‌కార్డు తొలగించడం కోసం ముందుగా మీరు ఫామ్‌ 49Aలో మీ సమాచారం నింపాల్సి ఉంటుంది. అనంతరం దగ్గరలోని  ఎన్‌సీడీసీఎల్‌ కేంద్రానికి వెళ్లి మీ వివరాలు సమర్పించాలి. అక్కడ పాన్‌కార్డుతో పాటు అధికారులు అడిగిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇంతకంటే ముందుగా ఆదాయ పన్ను శాఖ సంబంధిత అధికారికి లేఖ రాయాల్సి ఉంటుంది. ఆపై డూప్లికేట్‌ పాన్‌ సమర్పించినట్లు రసీదు తీసుకోండి.

ఆన్‌లైన్‌లో అయితే మీరు పాన్‌ సర్వీసు పోర్టల్‌లోకి వెళ్లి ‘Change or Correction’పై క్లిక్‌ చేయండి. ఇక్కడ మీ పూర్తి వివరాలు ఎంటర్‌ చేసి పాన్‌కార్డును అప్‌డేట్‌ చేసుకోండి.

Filed Under: PAN

PAN Card: పెళ్లి తర్వాత పాన్‌ కార్డుపై ఇంటి పేరు మార్చాలనుకుంటున్నారా?

February 23, 2023 by bharathi

How To Update Surname On PAN Card: పాన్ కార్డులో ఇంటి పేరును మార్చాలనుకుంటున్నారా? అయితే సులువుగా ఆన్‌లైన్‌లోనే మార్చుకోవచ్చు.

How To Update Surname on Pan Card After Marriage

how-to-update-surname-on-pan-card-after-marriage

మనం నిత్యం వినియోగించే కార్డుల జాబితాలో పాన్‌ కార్డు (PAN Card) కూడా వచ్చి చేరింది. విలువైన వస్తువులు కొనాలన్నా, అమ్మాలన్నా, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపాలన్నా పాన్‌ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. సామాన్యుడి నుంచి పెద్ద వ్యాపారి వరకు అందరూ ఈ కార్డును ఉపయోగిస్తుంటారు. కొందరైతే గుర్తింపు కార్డుగా కూడా (ఐడెంటీ ఫ్రూఫ్‌గా) దీన్ని వాడుతుంటారు. ఈ కార్డులో వ్యక్తికి సంబంధించిన పేరు, ఫోన్‌ నంబరు, చిరునామా ఉంటాయి.

ఇన్ని విధాలుగా ఉపయోగించే పాన్‌కార్డ్‌లో తప్పులున్నా, పేరును మార్చుకోవాలన్నా పెద్ద సమస్యేం కాదు. ఇంటి వద్దనే మనం వీటిని సరిచేసుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లయిన తరవాత చాలా మంది మహిళలు పాన్‌ కార్డులో తమ ఇంటి పేరును మార్చాలనుకుంటారు. అయితే దాని కోసం ఎక్కడకీ వెళ్లే అవసరం లేకుండా తమ ఫోన్‌ ద్వారానే పేరును మార్చుకోవచ్చు.

పాన్‌ కార్డ్‌లో పేరు మార్చుకోండిలా..

మీ మొబైల్‌/డెస్క్‌టాప్‌ బ్రౌజర్‌లో టీఐఎన్‌ ఎన్‌ఎస్‌డీఎల్‌ (www.tin-nsdl.com) అని టైప్‌ చేస్తే, సంబంధిత వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది.

దాంట్లో సర్వీసెస్‌ విభాగంలో PAN అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి.

కిందకు స్క్రోల్‌ చేశాక Change/Correction in PAN Data అనే సెక్షన్‌లో అప్లయ్‌పై క్లిక్‌ చేయాలి.

అందులో ‘Application Type’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో ‘Changes or Correction in existing PAN data’ని సెలక్ట్‌ చేయాలి.

పాన్‌ నంబర్‌ సహా పేరు, పుట్టిన తేదీ, ఇ-మెయిల్‌, ఫోన్‌ నంబర్‌ తదితర వివరాలు అందులో ఇవ్వాలి.

ఈ వివరాలన్నీ సబ్మిట్‌ చేశాక మీకో టోకెన్‌ నంబర్‌ జారీ చేస్తారు. తర్వాత కింద బటన్‌పై క్లిక్‌ చేసి తర్వాతి ప్రక్రియకు వెళ్లాలి.

ఇప్పుడు పాన్‌ కార్డుకు సంబంధించిన కరెక్షన్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ పేరు, పుట్టినరోజు, ఫోన్‌ నంబరు, ఇలా ఇక్కడ అన్నింటినీ మార్చుకొనే వీలుంటుంది.

సబ్మిట్‌ చేశాక పేమెంట్‌ ఆప్షన్‌ వస్తుంది.  నచ్చిన విధానంలో పేమెంట్‌ చేసే వెసులుబాటు ఉంటుంది.

పేమెంట్‌ అయిన వెంటనే మీరు కార్డును అప్‌డేట్‌ చేసినట్టుగా ఓ స్లిప్‌ వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. ఆ స్లిప్‌ను ప్రింటవుట్‌ తీసుకుని దానిపై రెండు ఫొటోలు అతికించి సంబంధిత పత్రాలను ఎన్‌ఎస్‌డీఎల్‌ కార్యాలయానికి పంపించాలి.

చిరునామా ఇదీ..

NSDL e-Gov at Income Tax PAN Services Unit
NSDL e-Governance Infrastructure Limited
5th Floor, Mantri Sterling, Plot No. 341
Survey No. 997/8, Model Colony
Near Deep Bungalow Chowk, Pune- 411016

Filed Under: PAN

PAN Card: ఈ ట్రిక్‌ తెలిస్తే పాన్‌ కార్డు నంబర్‌ను అస్సలు మర్చిపోరు!

February 23, 2023 by bharathi

How to Remember PAN card Number: పాన్‌ కార్డు నంబర్‌ను సులువుగా గుర్తుంచుకోవాలంటే దానిపై ఉన్న అక్షరాల, అంకెల వెనుక మర్మం తెలియాలి. అప్పుడే సులువుగా గుర్తుంచుకోవడం సాధ్యమవుతుంది.

How To Remember Pan Card Number

how-to-remember-pan-card-number

చాలా మందికి 10 అంకెల ఫోన్‌ నంబర్‌ గుర్తుంటుంది. కేవలం మనదే  కాదు.. ఇతరుల ఫోన్‌ నంబర్లు సైతం గుర్తుంటాయి. 12 అంకెల ఆధార్‌ కార్డూ గుర్తుంటుంది. కానీ, పాన్‌ కార్డు (Pan card) నంబర్‌ మాత్రం గుర్తుండదు. అంకెలు, అక్షరాలతో కలిపి 10 అక్షరాలే ఉన్నా.. దీన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవడం కష్టంగానే ఉంటుంది. పైగా చూసి రాయాల్సిన చోటా ఒక్కోసారి కన్ఫ్యూజ్‌ అవుతుంటారు. నంబర్‌లో సున్నా, ఆంగ్ల అక్షరం ఓ ఉన్నప్పుడు ఎక్కువగా గందరగోళానికి గురవుతుంటారు. ఈ సింపుల్‌ ట్రిక్‌ తెలిస్తే మీ పాన్‌ కార్డు నంబర్‌ను ఎప్పుడూ మరిచిపోరు. ఎప్పుడూ గందరగోళానికి గురికారు.

పాన్‌ కార్డుపై అంకెలు, అక్షరాలతో కూడిన 10 అంకెల నంబర్‌ ఉంటుంది. ఆ పది నంబర్‌ను మీకు కేటాయించడం వెనుక పెద్ద కారణమే ఉంటుంది. అందులో మన వ్యక్తిగత సమాచారం కూడా దాగి ఉంటుంది. యుటీఐ లేదా ఎన్ఎస్‌డీఎల్ (NSDL) ద్వారా ఒక క్రమంలో పాన్‌ను వ్యక్తలకు ఆదాయ ప‌న్ను శాఖ జారీ చేస్తుంది. మీ మొబైల్ నంబర్‌ మాదిరిగా పాన్ నంబర్‌ కంప్యూట‌ర్ జ‌న‌రేటెడ్ కాదు. పాన్‌ కార్డులో మొదటి ఐదు అక్షరాలు ఆంగ్ల అక్షరాలు, త‌ర్వాత నాలుగు అంకెలు, చివ‌ర్లో మళ్లీ ఓ ఆంగ్ల అక్షరం ఉంటుది. చాలా మంది ఈ విషయం తెలీక ‘సున్నా’కి, ‘ఓ’ విషయంలో పొరపడుతుంటారు. ఈ ట్రిక్‌ తెలిశాక ఆ పొరపాటు పునరావృతం కాదు.

పాన్‌లో మొద‌టి మూడు అక్షరాలు AAA to ZZZ సిరీస్‌లో ఉంటాయి. నాలుగో అక్షరానికి మాత్రం ప్రత్యేకత ఉంటుంది. ఆదాయ ప‌న్ను శాఖ దృష్టిలో మీరు ఏంటనేది ఆ అక్షరం తెలియజేస్తుంది. వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులందరికీ ‘P’ అక్షరాన్ని కేటాయిస్తారు. ఇక ఐదో అక్షరం మీ ఇంటి పేరు మొద‌టి అక్షరాన్ని తెలియజేస్తుంది. కావాలంటే మీరు కార్డును ఓ సారి గమనించండి. వ్యక్తులు కాకపోతే పాన్‌కార్డు హోల్డర్‌ పేరులోని మొదటి అక్షరం ఉంటుంది. ఆ త‌ర్వాత నాలుగు అంకెలు 0001 నుంచి 9999 మధ్య ఉంటాయి. పాన్‌ కార్డుపై చివ‌ర్లో ఎప్పుడూ అక్షరమే ఉంటుంది. ఈ విషయాలను గుర్తుంచుకుంటే ఎప్పుడూ మీ పాన్‌ సంఖ్యను మరిచిపోరు.

నాలుగో అక్షరం ఎవరికి ఏది?

P- అంటే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడు

C- కంపెనీ

H- హిందూ అవిభాజ్య కుటుంబం (HUF‌)

A- వ్యక్తులు లేదా సంస్థల బృందం (అసోసియేష‌న్ ప‌ర్సన్స్‌-ఏఓపీ)

B- వ్యక్తుల బృందం (BOI)

G- ప్రభుత్వ ఏజెన్సీ

J- ఆర్టిఫిషియల్‌ జ్యురిడికల్‌ పర్సన్‌

L- లోకల్‌ అథారిటీ

F- సంస్థ లేదా ప‌రిమిత భాగ‌స్వామ్య సంస్థ

T – ట్రస్ట్‌

Filed Under: PAN

Recent Posts

  • Sachivalayam Aadhar Camps in August 2023 | ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు
  • ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు 2022 జులై DA ప్రకటన | ఏ బేసిక్‌ వారికి ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి
  • ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhan Mantri Mudra Yojana) – PMMY | Updates
  • తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు | Central Government Schemes in Telangana Villages
  • Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం
  • YSR NethaAnna Nestham (BENEFICIARY OUT REACH APP) Full Detailed Process
  • YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల తేదీ ఖరారు
  • పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం 2023 | PM Vishwakarma Kaushal Samman Scheme 2023
  • Ammavodi Payment Status Checking -2023 | అమ్మఒడి చెల్లింపు స్థితి తనిఖీ -2023
  • బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Central Government Has Brought the Pradhan Mantri Tractor Yojana Scheme
  • PM Tractor Yojana 2023: కేంద్రం గొప్ప పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. అర్హులెవరు.. దరఖాస్తు ఎలా.. మొత్తం డీటెయిల్స్ ఇవే..
  • వాలంటీర్ల హాజరు రిపోర్ట్ | Volunteers Attendnace Report
  • AP: CM సంచలన నిర్ణయం: పెన్షన్@ రూ. 4,000.!? Volunteers Salary Increased to Rs.10,000/- ?
  • వైయస్సార్ పెళ్లి | YSR Pelli Kaanuka Important Update
  • విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు | Rice Card for Divorced Single Persons
  • YSR Pension Kanuka Hike
  • ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • YSR CHEYUTHA scheme 2023-24
  • Ammavodi-2023 – eKYC | అమ్మఒడి-2023 – ఇకెవైసి
  • ఖరీఫ్ సీజన్ : పంట నమోదు ఫారం | Kharif Season : Crop Registration Form
  • వైఎస్సార్ వాహన మిత్ర 2023-24 సంవత్సరానికి సంబంధించి GO విడుదల | YSR Vahana Mitra GO release for the year 2023-24
  • వాలంటీర్ల గౌరవ భృతి సమాచారం | Honorarium information for volunteers
  • వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ | Documents required for fresh registration of YSR signature
  • వైఎస్సార్ కళ్యాణమస్తు 3వ విడత అప్డేట్ | YSR Kalyanamastu 3rd installment update
  • YSR Pension Kanuka Details (వైఎస్ఆర్ పెన్షన్ కానుక వివరాలు)
  • Jagananna Suraksha (జగనన్న సురక్ష)
  • AP Mission Vatsalya | ఆంధ్రప్రదేశ్-మిషన్ వాత్సల్య | అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు
  • Mission Vatsalya Scheme Date Extended | మిషన్ వాత్సల్య పథకం గడువు పొడిగింపు
  • Jagananna Vasathi Deevena 2023 Date Fixed | Starts in Ananthapur | జగనన్న వసతి దీవెన 2023 అనంతపురంలో ప్రారంభమవుతుంది
  • YSR PENSION KANUKA & AASARA Key Contacts | HelpLine Numbers District
  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2026 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in