Navaratnalu

  • Contact us

Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు

March 2, 2023 by bharathi

డిజిటల్ లైబ్రరీ కొరకు స్థలం సేకరణ కొరకు కలెక్టర్లకు ఆదేశాలు.

Villages-Digital-Librarys

  • ఏడాదిన్నర క్రితమే 3,960 లైబ్రరీ ల నిర్మాణాలు ప్రారంభించడం జరిగింది.
  • ఒక్కోక్క లైబ్రరీ అంచనా వ్యాయం 16, లక్షలతో నిర్మాణం పనులు.
  • గ్రామ సచివాలయం ఉన్న ప్రతి ఒక్క చోట ఒక లైబ్రరీ ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది.

ఇంటి నుండి పని , చేసుకొనే IT ఉద్యోగులకూ అవసరమయ్యే సౌకర్యాలు విద్యార్థులకు ఆన్‌లైన్ డిజిటల్ క్లాస్ అవసరమగు సమాచారం ప్రతి గ్రామానా ఉండేలా డిజిటల్ లైబ్రరీ లు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి ఇప్పటికే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 3,690 డిజిటల్ లైబ్రరీ ల యేర్పాటు జరుగుతోంది.

ఇందులో కొన్ని పూర్తవగా నిర్మాణ దశలో ఉన్న గ్రామ సచివాలయం ఉన్న ప్రతి ఒక్క చోట డిజిటల్ లైబ్రరీ ఉండేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిబంధనల మేరకు గ్రామీణ అభివృద్ధి శాఖ కొత్తగా మరో 6,965 గ్రామాలకు వీటిని నిర్మించేందుకు అనుమతులు ఇచ్చింది ఇందులో మొత్తం 10, 925 గ్రామాల డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి రానున్నాయి.

డిజిటల్ లైబ్రరీ సౌకర్యాలు:

ఇంటర్నెట్ సదుపాయం కలదు.

ముఖ్యంగా ఐటి ఉద్యోగులకు విద్యార్థులకు వర్క్ ఫ్రం హోం చేయు ఉద్యోగులు వారి స్వగ్రామం నుండి ఉద్యోగం చేసుకునే వెసులబాటు.

విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు హాజరు కావడానికి వారికి అవసరమైన సమాచారం ఆన్‌లైన్ డిజిటల్ విధానం ద్వారా సేకరించడానికి ఈ లైబ్రరీలు అవసరం అవుతాయి.

ఏపీ ప్రభుత్వం ఇవ్వబడిన ఆదేశాలు :

ప్రభుత్వం ఒక్కో డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి 16, లక్షలు ఖర్చు చేస్తే వేరే ఇతర సౌకర్యాల కోసం మరికొంత ఖర్చు పెట్టబడుతుంది .

భవన నిర్మాణాలకు స్థల సేకరణ చేయడానికి ఆ శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు జారీ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో కేవలం డిజిటల్ లైబ్రరీ నిర్మాణాలకై ఏపీ ప్రభుత్వం రూ, 1,114 కోట్లు ఖర్చు చేస్తోంది.

Filed Under: News

విద్యుత్‌ పీపీఏల టారిఫ్‌ | ఇక ఇదే రేటు | APERC Has Fixed Tariff Wind Power PPAS Beyond Ten Years

March 1, 2023 by bharathi

పదేళ్లు దాటిన పవన విద్యుత్‌ పీపీఏల టారిఫ్‌ నిర్ణయించిన ఏపీఈఆర్సీ.

11 నుంచి 20 ఏళ్ల వరకు యూనిట్‌ రూ.2.64.

ఇరవై ఏళ్లు దాటిన పీపీఏల రద్దుకు డిస్కంలకు అవకాశం.

కొనసాగితే విద్యుత్‌ ఉత్పత్తి, డిస్కంల పరస్పర అంగీకారంతో టారిఫ్‌.

రాష్ట్రంలో ప్రస్తుతం పవన విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం 4096.65 మెగావాట్లు.

గతేడాది డిసెంబర్‌ నాటికి 40.9 మెగావాట్ల కొత్త ప్రాజెక్టులు.

9.8 శాతం వాటాతో దేశంలోని మొదటి 10 రాష్ట్రాల్లో ఏపీ.

APERC Has Fixed Tariff Wind Power PPAS Beyond Ten Years

పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి 10,785.51 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం 4,096.65 మెగావాట్లు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకి 15 మిలియన్‌ యూనిట్ల నుంచి 20 మిలియన్‌ యూనిట్ల మధ్య పవన విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది.

భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో దీర్ఘకాల పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్ల (పీపీఏ)తో ఆర్థికంగా కుదేలవుతున్న విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఊరట కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) పవన విద్యుత్‌ ధరలను నిర్ణయించింది. యూనిట్‌ రూ.2.64గా నిర్దేశించింది. యూనిట్‌కు రూ.3.43 ఇవ్వాలని విండ్‌ పవర్‌ జనరేటర్లు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.

ఇరవై ఏళ్ల తరువాత మీ ఇష్టం.
విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి పవన విద్యుత్‌ను తీసుకుంటున్న డిస్కంలు మొదటి పది సంవత్సరాలకు యూనిట్‌కు రూ.3.50 చొప్పున చెల్లించాలని గతంలోనే ఏపీఈఆర్‌సీ ఆదేశాలిచ్చింది. అయితే 11 ఏళ్లు దాటిన తరువాత 20 ఏళ్ల వరకు యూనిట్‌కు రూ.3.43, లేదా అంతకంటే ఎక్కువ టారిఫ్‌ ఇవ్వాలని పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ఏపీఈఆర్‌సీని కోరాయి.

డిస్కంలు మాత్రం మొదటి పదేళ్లకే ఏపీఈఆర్‌సీ టారిఫ్‌ ఇచ్చిందని, దానికి జనరేటర్లు కూడా అంగీకారం తెలిపారని, ఆ తరువాత పదేళ్లకు టారిఫ్‌ను మండలి నిర్ణయించాల్సి ఉందని తేల్చి చెప్పాయి. దీనిపై స్పందించిన ఏపీఈఆర్‌సీ.. పవన విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మొదటి పదేళ్లు యూనిట్‌కు రూ.3.50గా నిర్ణయించామని తెలిపింది. కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున ఆ ధరలే ఇవ్వమనడం కుదరదని తేల్చి చెప్పింది.

11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు పవన విద్యుత్‌ టారిఫ్‌ యూనిట్‌కు రూ.2.64 గా నిర్థారించింది. ఇరవై ఏళ్లు దాటిన తరువాత పీపీఏలను రద్దు చేసుకునేందుకు డిస్కంలకు అవకాశం కల్పించింది. ఒక వేళ పీపీఏలను కొనసాగిస్తే విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ సంస్థల పరస్పర అంగీకారంతో టారిఫ్‌ను నిర్ణయించుకోవచ్చని, దానిని కమిషన్‌కు నివేదించి ఆమోదం పొందాలని సూచించింది.

పవన విద్యుత్‌కు అనుకూలంగా రాష్ట్రం.
కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తికి ప్రోత్సాహాన్నిస్తోంది. అదే సమయంలో డిస్కంలు ఆర్ధికంగా నష్టపోకుండా కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా పవన విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం 8 శాతం పెరిగితే రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయి వృద్ధికంటే 1.8 శాతం ఎక్కువ నమోదు చేసుకుని మొదటి పది రాష్ట్రాల్లో ఒకటిగా (ఆరో స్థానంలో) ఏపీ నిలిచింది.

రాష్ట్రంలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రోపికల్‌ మెటీయెరాలజీ (పూణె) పరిశోధకులు వెల్లడించారు. ‘కపుల్డ్‌ మోడల్‌ ఇంటర్‌–కంపారిజన్‌ ప్రాజెక్ట్‌ (సీఎంఐపీ) ప్రయోగాలలో సముద్ర తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఏపీలో గాలి సామర్ధ్యం పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో గతేడాది డిసెంబర్‌ నాటికి (నాలుగో త్రైమాసికంలో) దేశవ్యాప్తంగా 229 గిగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులు పెరగగా, మన రాష్ట్రంలో 40.9 మెగావాట్ల కొత్త ప్రాజెక్టులు వచ్చాయి.

Filed Under: News

పాడి రైతుకు తోడు | In Addition to The Dairy Farmer

March 1, 2023 by bharathi

ఆర్బీకేల ద్వారా అన్నదాత ముంగిట్లో పశు వైద్యసేవలు.

హెల్త్‌ కార్డులతోపాటు గ్రామస్థాయిలో శిబిరాలు.

సర్టిఫై చేసిన పశుగ్రాస విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా.. పశువులు, మేకలు, గొర్రెల పెంపకందారుల కోసం పశువిజ్ఞాన బడులు.

పాడిరైతుల సమస్యల పరిష్కారానికి టోల్‌ ఫ్రీ నెంబర్లు.. మూగ జీవాల కోసం వైఎస్సార్‌ సంచార పశు వైద్య సేవలు.

108 అంబులెన్స్‌ల తరహాలో పశువులకు వైద్యసేవలు దేశంలోనే తొలిసారి.

Veterinary Services Farmers Through Rythu Bharosa Centres

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు పాడి రైతన్నలకు బాసటగా నిలుస్తూ పశువులకు పూర్తిస్థాయి ఆరోగ్య భద్రత కల్పిస్తు­న్నాయి. ఆర్బీకేల రాకతో తమ కష్టాలకు తెర పడిం­­దని పాడి రైతులు చెబుతున్నారు. ప్రాథ­మిక వైద్యం కోసం మండల కేంద్రాల వద్ద పడి­గాపులు కాయాల్సిన అవస్థలు తొలగిపోయాయి. ఆర్బీకేలతో గ్రామ స్థాయిలో పశువైద్య సేవ­లందిం­చడమే కాకుండా సర్టిఫై చేసిన నాణ్యమైన పశు­గ్రాస విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా, మిన­రల్‌ మిక్చర్, చాప్‌ కట్టర్స్‌.. ఏది కావా­లన్నా గుమ్మం వద్దకే తెచ్చి ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

108 అంబులెన్స్‌ల తరహాలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రూ.240.69 కోట్ల వ్యయంతో రెండు విడతల్లో 340 అంబులెన్స్‌లను సిద్ధం చేశారు.

వీటిని నియోజక వర్గానికి రెండు చొప్పన అందుబాటులోకి తీసుకొచ్చి ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ప్రతి అంబులెన్స్‌ లో రూ.35 వేల విలువైన 81 రకాల మందులను అందుబాటులో ఉంచారు. 54 రకాల అత్యాధునిక పరికరాలతో పాటు వెయ్యి కిలోలు బరువున్న జీవాలను ఎత్తగలిగేలా హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ సౌకర్యం కల్పించారు.

ఇప్పటివరకు కాల్‌ సెంటర్‌కు రైతుల నుంచి రోజుకు సగటున 1500 కాల్స్‌ చొప్పున 3.90 లక్షల కాల్స్‌ రాగా మారుమూల పల్లెల్లో 1.30 లక్షల ట్రిప్పులు తిరిగాయి. దాదాపు 2 లక్షలకుపైగా పశువులకు అత్యవసర వైద్య సేవలు అందించారు. ఇప్పటి వరకు 1.35 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఏపీ తరహాలో పంజాబ్, కేరళ, ఛత్తీస్‌ ఘడ్‌ తదితర రాష్ట్రాలు వెటర్నరీ అంబులెన్స్‌లను తీసుకొస్తున్నాయి. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న పశు వైద్యసేవలపై ‘సాక్షి బృందం’ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించింది.

మూగ జీవులపై మమకారం..
వైఎస్సార్‌ పశు సంరక్షణ పథకం కింద పశువులకు హెల్త్‌కార్డులు జారీ చేయడమే కాకుండా పాడి రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులతో ఆర్ధిక చేయూతనిస్తున్నారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నారు. కృత్రిమ గర్భదారణ, పునరుత్పత్తి, దూడల సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రతినెలా 3వ శనివారం పాడి రైతులకు, 2, 4వ బుధవారాల్లో గొర్రెలు, మేకల పెంపకందారులకు వైఎస్సార్‌ పశువిజ్ఞానబడులు నిర్వహిస్తూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆర్బీకేల్లో దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా పాడి, మూగజీవాల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. పాడి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా 155251, 1962 టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు.

రెండున్నరేళ్లలో సేవలిలా..
రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కాగా పాడి సంపద ఎక్కువగా ఉన్న 8,330 ఆర్బీకేల్లో ట్రైవిస్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి నెలా రూ.4 వేల విలువైన మందులను సరఫరా చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా గత 32 నెలల్లో 4,468 టన్నుల గడ్డి విత్తనాలు, 62,435 టన్నుల సంపూర్ణ మిశ్రమం, 60 వేల కిలోల నూట్రిషనల్‌ సప్లిమెంట్స్, 350 టన్నుల పశువుల మేతతో పాటు 3,909 చాప్‌ కట్టర్స్‌ పంపిణీ చేశారు.

ఆర్బీకేల ద్వారా 2 కోట్ల పశువులకు టీకాలిచ్చారు. 33.08 లక్షల పశువులకు హెల్త్‌ కార్డులు జారీ చేశారు. 14.73 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ జరిగింది. 1.61 కోట్ల పశువులకు ప్రాథమిక వైద్యసేవలు అందించారు. పశువిజ్ఞాన బడుల్లో 13.99 లక్షల మంది రైతులకు శిక్షణ నిచ్చారు. ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు 42 వేల మంది రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులందించి రుణ పరపతి కల్పిస్తున్నారు.

Filed Under: News

500 రూపాయల నోటు ఉన్నవారు: పెద్ద వార్త! 500 రూపాయల నోటుకు సంబంధించి RBI కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది, కొత్త మార్గదర్శకాలను తనిఖీ చేయండి, లేకపోతే…

February 28, 2023 by bharathi

500 రూపాయలపై RBI రూల్ : మీ వద్ద 500 రూపాయల రెండు నోట్లు మరియు రెండూ ఒకే క్రమ సంఖ్య కలిగి ఉంటే, అటువంటి పరిస్థితిలో మీరు ఏమి చేస్తారు. దీని గురించి RBI ఏమంటుంది అంటే.

500 Rupee Note Holders: Big news! RBI issued new guideline regarding Rs 500 rupee note, Check the new guideline, otherwise…

500-rupee-note-holders-big-news-rbi-issued-new-guideline-regarding-rs-500-rupee-note-check-the-new-guideline-otherwise

చాలా సార్లు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు కూడా చిరిగిపోయిన లేదా పాత నోట్లు దొరుకుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కానీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీని కోసం మీరు RBI మార్గదర్శకాన్ని చూడాలి. ఇది మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది మరియు మీ కష్టాలు కూడా తొలగిపోతాయి.

100, 200, 500 రూపాయల నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది, అయితే దేశవ్యాప్తంగా నోట్ల రద్దు తర్వాత, నోట్ల గురించి అనేక రకాల వైరల్ మరియు ఫేక్ వార్తలు తెరపైకి వస్తున్నాయి. మీరు పాత లేదా మ్యుటిలేటెడ్ నోట్లను కూడా మార్చాలనుకుంటే, ఇప్పుడు మీరు దీన్ని సులభంగా చేయవచ్చు. దీని కోసం మీరు మీ సమీప శాఖను సంప్రదించవచ్చు. అక్కడ మీరు నోట్లు మరియు నాణేలను మార్చుకోవచ్చు. రెండు నోట్లు ఒకే క్రమ సంఖ్యను కలిగి ఉంటే, అవి చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించబడతాయా?

ఈ విషయంలో, రిజర్వ్ బ్యాంక్ రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు నోట్లు ఒకే క్రమ సంఖ్యను కలిగి ఉండవచ్చు, కానీ వేర్వేరు ఇన్సెట్ లెటర్స్ లేదా వేర్వేరు ప్రింటింగ్ సంవత్సరాలు లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వివిధ గవర్నర్‌లను కలిగి ఉండవచ్చు. చెయ్యవచ్చు. ఇన్సెట్ లెటర్ అనేది నోటు యొక్క నంబర్ ప్యానెల్‌పై ముద్రించిన అక్షరం. గమనికలు ఎటువంటి ఇన్సెట్ లెటర్ లేకుండా కూడా ఉంటాయి.

నకిలీ నోట్లను గుర్తించేందుకు ఇవే మార్గాలు.

కొత్త 500 నోటును గుర్తించాలని రిజర్వ్ బ్యాంక్ తన మార్గదర్శకంలో కొన్ని రోజుల క్రితం ఒక సందేశంలో 500 రూపాయల నోటు నకిలీదని, అందులో ఆకుపచ్చ స్ట్రిప్ RBI గవర్నర్ సంతకం దగ్గర లేదని పేర్కొంది. కానీ గాంధీజీ. చిత్రం సమీపంలో. దీన్ని నకిలీగా అభివర్ణిస్తూ.. రెండు రకాల నోట్లు చెల్లుబాటు అవుతాయని పీఐబీ ట్వీట్ చేసింది. సాధారణ పౌరులకు నిజమైన మరియు నకిలీ రూ. 500 నోట్ల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనడంలో సహాయపడటానికి RBI PDFని కూడా షేర్ చేసింది.

పనికిరాని నోట్లను ఎలా గుర్తించాలి.

  • నోట్లు చాలా మురికిగా మారినట్లయితే మరియు వాటిలో చాలా మట్టి ఉంటే, అటువంటి పరిస్థితిలో అవి పనికిరానివిగా పరిగణించబడతాయి.
  • చాలా సార్లు, నోట్లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల, నోట్లు వదులుగా లేదా వదులుగా మారుతాయి. అలాంటి నోట్లు పనికిరావు.
    అంచు నుండి మధ్యకు చిరిగిన నోట్లు సరిపోవు.
  • నోట్‌లో తయారు చేసిన కుక్క చెవుల వైశాల్యం 100 చదరపు మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే, అది పనికిరానిదిగా పరిగణించబడుతుంది.
  • 8 చదరపు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ రంధ్రాలు ఉన్న నోట్‌లు పనికిరాని నోట్‌లుగా పరిగణించబడతాయి.
    నోట్‌లో ఏదైనా గ్రాఫిక్ మార్పు అన్ ఫిట్ నోట్‌గా పరిగణించబడుతుంది.
  • పెన్నులోని సిరా నోట్లో పూసుకుంటే అది పనికిరాని నోటు.
  • నోటు రంగు వాడిపోతే అది అన్ ఫిట్ నోటు.
  • నోట్లో టేప్, జిగురు వంటి అంశాలు ఉంటే, అటువంటి నోటు అన్ ఫిట్ గా పరిగణించబడుతుంది.
  • నోటు యొక్క రంగు మారితే, అటువంటి పరిస్థితిలో అటువంటి నోట్ పనికిరానిదిగా పరిగణించబడుతుంది.

RBI నిబంధన ఏం చెబుతుందో తెలుసా?

రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనల ప్రకారం, మీ వద్ద కూడా పాత లేదా మ్యుటిలేటెడ్ 500 రూపాయల నోట్లు ఉంటే, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు బ్యాంకులోని ఏదైనా శాఖను సందర్శించడం ద్వారా అటువంటి నోట్లను మార్చుకోవచ్చు. బ్యాంకు ఉద్యోగి మీ నోట్‌ని మార్చుకోవడానికి నిరాకరిస్తే, మీరు దీని గురించి ఫిర్యాదు కూడా చేయవచ్చు. నోటు పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే, దాని విలువ తగ్గుతుందని మీరు గుర్తుంచుకోవాలి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి.

RBI ప్రకారం, ఏదైనా చిరిగిన నోటులో కొంత భాగం కనిపించకుండా పోయినప్పుడు లేదా రెండు కంటే ఎక్కువ ముక్కలను కలిగి ఉండి ఒకదానితో ఒకటి అతికించబడినప్పుడు మాత్రమే అంగీకరించబడుతుంది. కరెన్సీ నోటులోని కొన్ని ప్రత్యేక భాగాలు, అంటే జారీ చేసే అధికారం, హామీ మరియు వాగ్దాన నిబంధన, సంతకం, అశోక స్తంభం, మహాత్మా గాంధీ చిత్రం, వాటర్ మార్క్ మొదలైనవి కూడా లేకుంటే, మీ నోటు మార్చబడదు. చాలా కాలంగా మార్కెట్‌లో చలామణిలో ఉండడంతో నిరుపయోగంగా మారిన నాసిరకం నోట్లను కూడా మార్చుకోవచ్చు.

మీరు ఇలా నోట్స్ మార్చుకోవచ్చు.

మీ వద్ద చాలా కాలిపోయిన నోట్లు, లేదా నోట్లు ఒకదానితో ఒకటి ఇరుక్కుపోయి ఉంటే, వాటిని RBI కార్యాలయం నుండి కూడా మార్చుకోవచ్చు, కానీ బ్యాంకు వాటిని తీసుకోదు, మీరు వాటిని RBI యొక్క ఇష్యూ కార్యాలయానికి తీసుకెళ్లాలి. మీ నోట్‌కు జరిగిన నష్టం నిజమైనదేనని మరియు ఉద్దేశపూర్వకంగా దెబ్బతినలేదని సంస్థ ఈ విషయాలను ఖచ్చితంగా తనిఖీ చేస్తుందని గుర్తుంచుకోవాలి.

Filed Under: News

హాస్టల్‌ విద్యార్థులకు శుభవార్త | Good news for hostel students

February 26, 2023 by bharathi

Andhra Pradesh Govt Support Hostel Students

  • డైట్, కాస్మోటిక్‌ చార్జీలు పెంచుతూ జీఓ
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
  • విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం 

రాష్ట్రంలో విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అండగా నిలుస్తోంది. తాజాగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఇచ్చే డైట్, కాస్మోటిక్‌ చార్జీలను పెంపుదల చేస్తూ జీఓలను విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్‌ 1 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వస్తాయి.

ఇందుకోసం అదనంగా డైట్‌ చార్జీలకు రూ.132 కోట్లు, కాస్మోటిక్‌ చార్జీలకు రూ.48 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, తదితర సంక్షేమ హాస్టల్‌ విద్యార్థులకు ప్రభుత్వం 2012లో మెస్‌ చార్జీలను పెంచింది. గత ఎన్నికలకు ముందు (2018) టీడీపీ ప్రభుత్వం హడావుడిగా నామమాత్రంగా డైట్‌ చార్జీలను పెంచినా అవి అమల్లోకి రాలేదు.

నాటి నుంచి ఇప్పటివరకూ హాస్టల్‌ విద్యార్థులకు పాత చార్జీలనే అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం డైట్, కాస్మోటిక్‌ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

67 హాస్టళ్లు.. 2,500 మంది విద్యార్థులు

జిల్లాలో 38 ఎస్సీ, 29 బీసీ హాస్టళ్లలో సుమారు 2,500 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఎస్సీ హాస్టళ్లలో 1,251 మంది, బీసీ హాస్టళ్లలో 1,321 మంది ఉన్నారు. వీరందరికీ చార్జీల పెంపు వల్ల ప్రయోజనం కలుగుతుంది.

అలాగే హాస్టళ్లలో చేరేందుకు పేద విద్యార్థులు మరింత ఆసక్తి చూపుతారని అధికారులు అంటున్నారు. పేదల చదువులకు అన్నివిధాలా అండగా ఉంటున్న సీఎం జగన్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది

హాస్టళ్లలో విద్యార్థుల డైట్, కాస్మోటిక్‌ చార్జీలను ప్రభుత్వం పెంచడం ద్వారా రానున్న విద్యాసంవత్సరం నుంచి వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం పెంచిన చార్జీలు వచ్చే జూన్‌ నుంచి అమలులోకి రానున్నాయి.

–జీవీఆర్‌కేఎస్‌ఎస్‌ గణపతిరావు, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి, భీమవరం

Filed Under: News

  • « Previous Page
  • 1
  • 2
  • 3
  • 4
  • …
  • 12
  • Next Page »

Recent Posts

  • Sachivalayam Aadhar Camps in August 2023 | ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు
  • ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు 2022 జులై DA ప్రకటన | ఏ బేసిక్‌ వారికి ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి
  • ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhan Mantri Mudra Yojana) – PMMY | Updates
  • తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు | Central Government Schemes in Telangana Villages
  • Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం
  • YSR NethaAnna Nestham (BENEFICIARY OUT REACH APP) Full Detailed Process
  • YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల తేదీ ఖరారు
  • పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం 2023 | PM Vishwakarma Kaushal Samman Scheme 2023
  • Ammavodi Payment Status Checking -2023 | అమ్మఒడి చెల్లింపు స్థితి తనిఖీ -2023
  • బంపరాఫర్ .. రైతులకు సగం ధరకే ట్రాక్టర్ | Central Government Has Brought the Pradhan Mantri Tractor Yojana Scheme
  • PM Tractor Yojana 2023: కేంద్రం గొప్ప పథకం.. సగం ధరకే ట్రాక్టర్.. అర్హులెవరు.. దరఖాస్తు ఎలా.. మొత్తం డీటెయిల్స్ ఇవే..
  • వాలంటీర్ల హాజరు రిపోర్ట్ | Volunteers Attendnace Report
  • AP: CM సంచలన నిర్ణయం: పెన్షన్@ రూ. 4,000.!? Volunteers Salary Increased to Rs.10,000/- ?
  • వైయస్సార్ పెళ్లి | YSR Pelli Kaanuka Important Update
  • విడాకులు తీసుకున్న ఒంటరి వ్యక్తులకు రైస్ కార్డు | Rice Card for Divorced Single Persons
  • YSR Pension Kanuka Hike
  • ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • YSR CHEYUTHA scheme 2023-24
  • Ammavodi-2023 – eKYC | అమ్మఒడి-2023 – ఇకెవైసి
  • ఖరీఫ్ సీజన్ : పంట నమోదు ఫారం | Kharif Season : Crop Registration Form
  • వైఎస్సార్ వాహన మిత్ర 2023-24 సంవత్సరానికి సంబంధించి GO విడుదల | YSR Vahana Mitra GO release for the year 2023-24
  • వాలంటీర్ల గౌరవ భృతి సమాచారం | Honorarium information for volunteers
  • వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ | Documents required for fresh registration of YSR signature
  • వైఎస్సార్ కళ్యాణమస్తు 3వ విడత అప్డేట్ | YSR Kalyanamastu 3rd installment update
  • YSR Pension Kanuka Details (వైఎస్ఆర్ పెన్షన్ కానుక వివరాలు)
  • Jagananna Suraksha (జగనన్న సురక్ష)
  • AP Mission Vatsalya | ఆంధ్రప్రదేశ్-మిషన్ వాత్సల్య | అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు
  • Mission Vatsalya Scheme Date Extended | మిషన్ వాత్సల్య పథకం గడువు పొడిగింపు
  • Jagananna Vasathi Deevena 2023 Date Fixed | Starts in Ananthapur | జగనన్న వసతి దీవెన 2023 అనంతపురంలో ప్రారంభమవుతుంది
  • YSR PENSION KANUKA & AASARA Key Contacts | HelpLine Numbers District
  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2026 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in